కొట్టుకు చావడం మానుకోకుంటే?

ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పదేళ్ల పాటు ఏలిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ కోలుకోలేకుండా ఉంది. అసలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ కు [more]

Update: 2021-01-12 11:00 GMT

ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పదేళ్ల పాటు ఏలిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ కోలుకోలేకుండా ఉంది. అసలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ కు భవిష్యత్ ఉందా? అన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ దాదాపు ఖాళీ అయిందనే చెప్పాలి. నిన్న మొన్నటి వరకూ తెలంగాణలో కొంత కాంగ్రెస్ పార్టీకి సానుకూల వాతావరణం ఉన్నప్పటికీ, ఇటీవల జరిగిన దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాల తర్వాత ఆ అనుమానం కూడా పూర్తిగా తొలగిపోయింది.

ఎవరు వచ్చినా….

ఇప్పుడు కాంగ్రెస్ కు కొత్త పీసీసీ చీఫ్ త్వరలో రానున్నారు. ఎవరు వచ్చినా కాంగ్రెస్ ను బాగు పర్చడం తెలంగాణలో సాధ్యం కాదన్నది ఇప్పుడున్న పరిస్థితుల్లో అసాధ్యమేనంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి అనేక మంది సీనియర్ నేతలు ఇతర పార్టీల బాటన పట్టారు. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరగా, సీనియర్ నేతలు సయితం పార్టీని వీడి వెళ్లిపోయారు. డీకే అరుణ, విజయశాంతి వంటి నేతలు పార్టీని వీడటం ఆలోచించుకోవాల్సిన విషయం.

ప్రజల్లో నమ్మకం లేక….

తెలంగాణను ఇచ్చిన పార్టీగా రాష్ట్ర ప్రజల్లో నమ్మకం కలిగించడంలో కాంగ్రెస్ విఫలమయిందని చెప్పాలి. కాంగ్రెస్ కు ఓటేస్తే వృధా అవుతుందన్న భావన ప్రజల్లో ఏర్పడింది. వాళ్లు గెలిచినా అధికార పార్టీలోకి వెళతారని ప్రజలు భావించారు. అందుకే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ సింగిల్ సీటుకే పరిమితం కావాల్సి వచ్చింది. ఇంత దారుణ ఓటములు ఎదురవుతున్నా కాంగ్రెస్ నేతల్లో మార్పు వచ్చిందా? అంటే లేదన్నది వాస్తవం.

నేతల్లో సఖ్యత లేక…..

ఇప్పటికీ గ్రూపులుగా విడిపోయి కొట్టుకు ఛస్తున్నారు. నాయకత్వం కోసం అల్లాడి పోతున్నారు. ఎవరికి పీసీసీ చీఫ్ పదవి ఇచ్చినా మరికొందరు సహకరించరు. ఇది వాస్తవం. కాంగ్రెస్ కు ఇప్పటికీ తెలంగాణలో బలమైన ఓటు బ్యాంకు ఉంది. క్యాడర్ కూడా ఉంది. అయితే నేతల మధ్య సఖ్యత లేకపోవడంతో నమ్మకం లేక ఆ పార్టీ వైపు నిలబడలేకపోతున్నారు. ఇప్పటికీ కాంగ్రెస్ నేతలు తమ వైఖరిని మార్చుకోకుంటే భవిష్యత్ ఎప్పటికీ ఉండదు. బీజేపీ ఆ ఓటు బ్యాంకును ఎగరేసుకు పోవడం ఖాయంగా కన్పిస్తుంది.

Tags:    

Similar News