జగనబ్బాయి తెగ నచ్చేశాడట

వైఎస్ జగన్ ఎందుకో ఇపుడు అందరికీ నచ్చేస్తున్నాడు. అలాగని జగన్ మారాడా అంటే అబ్బే అదేంలేదు. జగన్ అలాగే ఉన్నాడు. ఆయన మొదటి నుంచి ఎలా ఉన్నాడో [more]

Update: 2019-06-18 06:30 GMT

వైఎస్ జగన్ ఎందుకో ఇపుడు అందరికీ నచ్చేస్తున్నాడు. అలాగని జగన్ మారాడా అంటే అబ్బే అదేంలేదు. జగన్ అలాగే ఉన్నాడు. ఆయన మొదటి నుంచి ఎలా ఉన్నాడో అలాగే అచ్చం అలాగే ఉన్నాడు. కానీ జగన్ ఇపుడే అందరికీ నచ్చుతున్నాడు. అదే ప్రత్యర్హ్దులకైతే ఇంకా బాగా నచ్చుతున్నడట..కారణమేంటో మరి.

అప్పట్లో అలా మరి :

జేసీ దివాకర్ రెడ్డి అని వెటరన్ పొలిటీషియన్ ఉన్నారు. ఆయన ఎపుడు ఏం మాట్లాడుతారో తెలియదు కానీ మాటల్లో ముక్కుసూటితనం ఉంటుంది. ఆయన మాట్లాడితే ఉన్నది ఉన్నట్లుగానే మాట్లాడుతారు. అయితే కొన్ని సార్లు పక్కన ఉన్న వారిని మెప్పించడానికి కాస్త అతి కూడా చేస్తారు. ఆయనే జగన్ని అప్పట్లో నానా మాటలు అన్నారు కూడా. జగన్ కి ఏమీ తెలియదు, మొద్దబ్బాయి అని కూడా ఇదే జేసీ, బాబు గారి మెప్పు కోసం అప్పట్లో అన్నట్లు గుర్తు.

పులిబిడ్డేనట :

విషయానికి వస్తే జేసీ తాజాగా జగన్ గురించి గొప్పగా చెబుతున్నాడు. మా జగనబ్బాయి అంటున్నాడు. మా పులువెందుల బిడ్డ ఇంత ఎత్తుకు ఎదుతుగాడనుకోలేదని కూడా పరవశిస్తున్నారు జేసీ. జగన్ ఢిల్లీలో ప్రధాని తో వ్యవహరించిన తీరు. ఆయన ముఖ్యమంత్రిగా హుందాగా ఉన్న విధానం ఇవన్నీ కూడా దివాకరరెడ్డి గారికి బాగా నచ్చేశాయట. ముఖ్యంగా ప్రత్యేక హోదా విషయంలో జగన్ ఢిల్లీలో మాట్లాడిన తీరు కూడా అయనకు నచ్చిందట. మొత్తానికి జగన్ బాగా పనిచేస్తున్నారని కితాబు ఇచ్చేశారు జేసీ. ఇది భయపడో మరోటో కాదని ,ఉన్న మాటే చెబుతున్నానని జేసీ అనడం కొసమెరుపు

Tags:    

Similar News