ఏపీలో ఎగిరేది నిలిచేది వైఎస్ జగన్ వైసీపీ జెండాయేనా ?
వైఎస్ జగన్ ఎపుడో సీఏమ్ కావాల్సింది. ఆయనకు 2009లోనే ఆ పదవి ఇలా వచ్చి అలా జారిపోయింది. జగన్ ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకున్నది కాంగ్రెస్ లోని పెద్ద [more]
వైఎస్ జగన్ ఎపుడో సీఏమ్ కావాల్సింది. ఆయనకు 2009లోనే ఆ పదవి ఇలా వచ్చి అలా జారిపోయింది. జగన్ ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకున్నది కాంగ్రెస్ లోని పెద్ద [more]
వైఎస్ జగన్ ఎపుడో సీఏమ్ కావాల్సింది. ఆయనకు 2009లోనే ఆ పదవి ఇలా వచ్చి అలా జారిపోయింది. జగన్ ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకున్నది కాంగ్రెస్ లోని పెద్ద తలకాయలే కాదు. టీడీపీలో కూడా చంద్రబాబు జగన్ని ముఖ్యమంత్రి కాకుండా తన వంతు పాత్ర పోషించాడని అంటారు. అంటే జగన్ సీఎం అయితే అంతటితో రాజకీయం సరి అని చాలామందికి ఆనాడే తెలుసు అన్నమాట. అలా పదేళ్ళు అడ్డుకోగలిగారు కానీ అంతకు మించి సాధించలేకపోయారు. జగన్ని కొంత ఆపడం వల్ల చంద్రబాబుకు అయిదేళ్ళ పాటు ఏపీ సీఎం అయ్యే అవకాశం లభించింది. ఇపుడు జగన్ బంపర్ మెజారిటీతో పవర్లోకి వచ్చేశారు. వయసు లో యువకుడు. దూకుడులో మాత్రం చాలా పెద్దవాడు. దాంతో సమీప భవిష్యత్తులో ఏపీ రాజకీయాలు ఎలా ఉంటాయన్న చర్చ ఇపుడు వాడి వేడిగా సాగుతోంది.
జగన్ తప్ప మరో చాన్స్ లేదు:
ఈ మాటలు అన్నది ఎవరో కాదు రాజకీయంగా తలపండిన సీనియర్, నిన్నటి కాంగ్రెస్ నేత, ప్రస్తుత టీడీపీ నేత అయిన జేసీ దివాకర్ రెడ్డి. ఆయన తాజాగా మాట్లాడుతూ జగన్ ప్రభంజనం ఏపీలో బలంగా ఉందని, తనతో పాటు అన్నం తిన్న వారు వెంట వున్న వారు కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేశారంటే ఆ వేవ్ మాటల్లో చెప్పలేమని అన్నారు. కష్టాలు పడి పడి జగన్ రాటుదేలిపోయారని, అందులోనే ఆయన విజయం సాధించారని కితాబు ఇచ్చారు. ఇపుడున్న పరిస్థితులు చూస్తూంటే వైసీపీకి ఎదురులేకుండా ఉందని ఆయన అన్నారు. టీడీపీ పని దాదాపుగా అయిపోయినట్లే ఆయన మాటల్లోనే పరోక్షంగా చెప్పేశారు.
ఎవొరొచ్చినా ఇంతే :
ఇక టీడీపీకి చంద్రబాబే మొదటి, చివరి నాయకుడు అంటూ జేసీ సంచలన వ్యాఖ్యలే చేశారు. బాబు తప్ప ఆ పార్టీకి ఇప్పటికీ వేరే దిక్కు లేదని కూడా తేల్చేశారు. సినీ నటుడు జూనియర్ ఎన్టీయార్ పేరు కొంతమంది చెబుతున్నారని, ఆయనేం చేయగలడని జేసీ తేలిగ్గానే తీసేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి వారే రాజకీయాల్లో బోల్తా పడ్డాక ఇక సినిమా వాళ్ళకు చాన్స్ లేనేలేదని క్లారిటీగా జేసీ చెప్పేస్తున్నారు. సినిమా వాళ్ళను జనం చూడడానికి వస్తారు, అంతే తప్ప ఓట్లు రాలవని ఆయన అంటున్నారు. ఏది ఏమైనా ఏపీలో ఉండేది, ఉండబోయేది ఒకే ఒక పార్టీ అదే వైసీపీ అని జేసీ లాంటి అనుభవం కలిగిన నాయకుడు అన్నాడంటే ఇక సైకిల్ పార్టీ తమ్ముళ్ళు గుండేలు తల్లడిల్లాల్సిందే.