జగ్గంపేట.. పట్టాభిషేకం ఎవరికో…
తూర్పుగోదావరి జిల్లాలో విలక్షణ తీర్పుకు మారుపేరు అయిన జగ్గంపేట నియోజకవర్గంలో రాజకీయం హీటెక్కింది. ఎన్నికలకు తేదీ దగ్గర పడుతున్నా కొద్ది ఆయా పార్టీలకు చెందిన ఆశావహులు పార్టీ [more]
;
తూర్పుగోదావరి జిల్లాలో విలక్షణ తీర్పుకు మారుపేరు అయిన జగ్గంపేట నియోజకవర్గంలో రాజకీయం హీటెక్కింది. ఎన్నికలకు తేదీ దగ్గర పడుతున్నా కొద్ది ఆయా పార్టీలకు చెందిన ఆశావహులు పార్టీ [more]
తూర్పుగోదావరి జిల్లాలో విలక్షణ తీర్పుకు మారుపేరు అయిన జగ్గంపేట నియోజకవర్గంలో రాజకీయం హీటెక్కింది. ఎన్నికలకు తేదీ దగ్గర పడుతున్నా కొద్ది ఆయా పార్టీలకు చెందిన ఆశావహులు పార్టీ అధినేతలను కలుస్తూ వస్తున్నారు. ఈసారి టీడీపీ అభ్యర్థిగా జ్యోతుల నెహ్రూ, వైసీపీ నుంచి జ్యోతుల చంటి బాబు, కాంగ్రెస్ పార్టీ నుంచి మారోతి శివ గణేష్‌లు బరిలో నిలవనున్నట్లు తెలుస్తోంది. 2014లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ నుంచి జ్యోతుల నెహ్రూ, టీడీపీ నుంచి జ్యోతుల చంటి పోటీ చేశారు. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా జ్యోతుల నెహ్రూ విజయం సాధించారు. అయితే రెండేళ్ల క్రితం ఆయన టీడీపీలోకి జంప్ అయ్యారు. నియోజకర్గ అభివృద్ధిలో మంచి మార్కులే వేయించుకున్నారు.
వైసీపీ టిక్కెట్ ఆయనకే…
ఇక చంటి బాబు విషయానికి వస్తే గతంలో 2009, 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఆయన ఈసారి విజయంపై ధీమాగా ఉన్నారు. సానుభూతి కూడా కలిసివచ్చే అవకాశం ఉంది. ఈసారి తన గెలుపును ఎవరూ ఆపలేరని చెబుతున్నారు. ఇక నియోజకవర్గంలో వైసీపీని క్షేత్రస్థాయిలో బలపర్చారు అనే పేరు కూడా ఆయనకు దక్కింది. ఇక దాదాపుగా ఆయనకు టికెట్ కన్ఫర్మ్ అయినట్లేనని వైసీపీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. దీంతో ఆయన ఈసారి జ్యోతుల నెహ్రూకు గట్టి పోటీ ఇవ్వడం మాత్రం ఖాయం.
బలమైన అభ్యర్థుల వేటలో బీజేపీ, జనసేన
కాంగ్రెస్ నుంచి నియోజకవర్గ కన్వీనర్‌గా వ్యవహరిస్తున్న మారోతి గణేష్‌కు టికెట్ దక్కనుంది. బీజేపీ కూడా బలమైన అభ్యర్థి కోసం వెతుకుతోంది. ఆర్థికంగా బలమైన అభ్యర్థి కోసం పలువురు పారిశ్రామిక వేత్తల పేర్లను కూడా ఆ పార్టీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. జనసేన నుంచి అయితే ఇప్పటి వరకు ఈ నియోజకవర్గ అభ్యర్థిత్వంపై క్లారిటీ లేదు. పోటీకి నిలబడతారనే నాయకుల పేర్లు కూడా పెద్దగా వినిపించడం లేదు. యూత్‌లో కాస్త క్రేజ్ ఉన్న మాట వాస్తవమే అయినప్పటికీ అది అతి విశ్వాసంగా మారుతోందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఎవరు ఎన్ని ధీమాలు వ్యక్తం చేసినా…ఎవరు లెక్కలెన్ని చెప్పినా జగ్గంపేటలో మాత్రం ఓటరు నాడి ముందే పసిగట్టడం అంతా ఈజీ కాదని కొంతమంది చెబుతున్నారు. అంచనాలు తలకిందులైనా సందర్భాలను గుర్తు చేస్తున్నారు.
బలమైన అభ్యర్థిని నిలిపితే…
ఈ నియోజకవర్గంలో కాపుల ఓట్లు అధికంగా ఉన్నమాట వాస్తవమే. అయితే జనసేన కూడా అదే ఆశతో ఇక్కడ పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. బలమైన అభ్యర్థిని ఇక్కడ నిలపకుంటే మాత్రం జనసేన గెలుపు కష్టమే అవుతుందని తెలుస్తోంది. గతంలో ప్రజారాజ్యం ఇక్కడ పోటీ చేసి ఓడిపోయినప్పటికి రెండో స్థానంలో నిలిచింది. మరి ఈసారి గనుక మంచి అభ్యర్థిని పెడితే గట్టి పోటీ ఇవ్వడం లేదా గెలిచే ఛాన్స్ కూడా ఉందని రాజకీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.