వంగవీటికి చెక్ పెట్టేందుకేనా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ మ‌న‌సులో కీల‌క స్థానం సంపాయించ‌డం అంటే మాట‌లు కాద‌ని అంటారు ఆ పార్టీకి చెందిన నాయ‌కులు. ముఖ్యంగా ఆ పార్టీలో కీల‌కంగా ఉండి [more]

;

Update: 2019-09-27 14:30 GMT

వైసీపీ అధినేత జ‌గ‌న్ మ‌న‌సులో కీల‌క స్థానం సంపాయించ‌డం అంటే మాట‌లు కాద‌ని అంటారు ఆ పార్టీకి చెందిన నాయ‌కులు. ముఖ్యంగా ఆ పార్టీలో కీల‌కంగా ఉండి కూడా ప‌ద‌వులు ద‌క్కించుకోలేక పోయినవారు ఎంద‌రో ఉన్నారు. అయితే, వీరికి భిన్నంగా తొలిసారి ఎన్నిక‌ల్లో పోటీ చేసి విజ‌యం సాధించ‌డంతోపా టు.. కీల‌క మైన కాపు కార్పొరేష‌న్ చైర్మ‌న్ ప‌ద‌విని సంపాయించి అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించారు యువ నాయ‌కుడు, జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితులైన వారిలో ఒక‌రిగా గుర్తింపు పొందిన జ‌క్కం పూడి రాజా. ఈ కుటుంబానికి సుదీర్ఘ రాజ‌కీయ అనుభవం ఉండ‌డం గ‌మ‌నార్హం.

జక్కంపూడి వారసుడిగా….

జ‌క్కంపూడి రామ్మోహ‌న్ రావు కాంగ్రెస్ పార్టీలో కీల‌క నేత‌గా ఎదిగారు. ప్ర‌ధానంగా వైఎస్ రాజ‌శేఖ‌రరెడ్డి వ‌ర్గంలో నాయ‌కుడిగా ఆయ‌న గుర్తింపు సాధించారు. దీంతో ఆయ‌న‌కు వైఎస్ హ‌యాంలో మంత్రి ప‌ద‌వి కూడా ద‌క్కింది. ప్ర‌స్తుతం ర‌ద్ద‌యిన క‌డియం నుంచి మూడు సార్లు ఆయ‌న విజ‌యం సాధించి వైఎస్ కేబినెట్‌లో మంత్రి ప‌ద‌విని సొంతం చేసుకున్నారు. ఆయ‌న మ‌ర‌ణం త‌ర్వాత ఆయ‌న స‌తీమ‌ణి కూడా రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. ఈ క్ర‌మంలోనే 2009లో ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ‌మ‌హేంద్ర‌వ‌రం రూర‌ల్ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అయితే, కాంగ్రెస్‌లో ఆమె ఓట‌మి చెందారు. ఇక‌, వైఎస్ మ‌ర‌ణం, త‌ద‌నంత‌ర రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో 2014కు ముందుగానే వైసీపీలో చేరారు.

పార్టీ పెట్టినప్పటి నుంచి…

జ‌గ‌న్ వైసీపీ పెట్టిన‌ప్పుడే ఆ ఫ్యామిలీ కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పేసి టీడీపీలో చేరిపోయింది. అప్ప‌టి నుంచి రాజ‌కీయంగా ఎన్నోసార్లు ఇత‌ర పార్టీల‌కు టార్గెట్ అయ్యింది. ఎన్నో కేసులు ఎదుర్కొంది. ఈ క్ర‌మంలో జ‌గ‌న్ ఈ కుటుంబానికి రాజాన‌గ‌రం నుంచి పోటీ చేసే అవ‌కాశం 2014లోనే క‌ల్పించారు. అయితే, ఆ ఎన్నిక‌ల‌లోనూ జ‌క్కంపూడి స‌తీమ‌ణి ఓడిపోయారు. ఇక‌, ఆమె త‌ర్వాత వారి కుమారుడు రాజా రాజ‌కీయ అరంగేట్రం చేసి జ‌గ‌న్‌కు న‌మ్మిన బంటుగా వ్య‌వ‌హ‌రించారు. వైసీపీ రాష్ట్ర యువ‌జ‌న విభాగంలో కీల‌క నాయ‌కుడిగా గుర్తింపు పొందారు. వైఎస్ ఫ్యామిలీతో న‌డిచారు. త‌క్కువ స‌మ‌యంలో గుర్తింపు సాధించారు. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో తొలిసారి పోటీ చేసిన జక్కంపూడి రాజా భారీ విజ‌యం న‌మోదు చేసుకున్నారు. అదే స‌మయంలో జ‌గ‌న్ మ‌న‌సు గెలుచుకుని కీల‌క‌మైన ఏపీ కాపు కార్పొరేష‌న్ ప‌ద‌విని సొంతం చేసుకున్నారు.

అందరినీ పక్కన పెట్టి….

నిజానికి ఈ ప‌ద‌వికోసం వైసీపీలో ఎంతో పోటీ ఉన్నా.. జ‌గ‌న్ జక్కంపూడి రాజాకే అవ‌కాశం ఇవ్వ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. ఇక‌, కాపు కార్పొరేష‌న్ చైర్మ‌న్‌గా ఉన్న జక్కంపూడి రాజా కాపుల‌కు బ‌ల‌మైన గోదావ‌రి జిల్లాల్లో మంచి ఫాలోయింగ్ సంపాయించుకున్నారు. కాపు సామాజిక‌వ‌ర్గంలోని యూత్ వింగ్‌లో రాజాకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఎలాంటి వివాదాల‌కు అవ‌కాశం లేకుండా ముందుకు సాగుతున్నారు. ఎక్క‌డా ఏ చిన్న పొర‌పాటు లేకుండా జ‌గ‌న్ ఆశ‌యాల‌కు అనుగుణంగా దూసుకుపోతున్నారు. యువ‌కుడు కావ‌డంతో పాటు త‌క్కువ వ‌య‌స్సులోనే జ‌గ‌న్‌కు న‌మ్మ‌క‌స్తుడిగా ఉన్న జక్కంపూడి రాజా భ‌విష్య‌త్తులో రాజ‌కీయంగా మ‌రింత ఉన్నత స్థానాల‌కు వెళ్లే ఛాన్స్ కూడా ఉంది.

వంగవీిిటికి పోటీగా….

అయితే, కీల‌క‌మైన కాపు కార్పొరేష‌న్ చైర్మ‌న్‌గా ఉన్నందున‌.. రెండున్న‌రేళ్ల త‌ర్వాత మంత్రి ప‌ద‌వి ద‌క్కే అవ‌కాశం లేక పోవ‌చ్చు. అది కూడా తొలిసారి ఎన్నిక కావ‌డం కూడా దీనికి కార‌ణంగా క‌నిపిస్తోంది. ఏదేమైనా.. జక్కంపూడి రాజాకు వైసీపీలోను, జ‌గ‌న్ వ‌ద్ద మంచి మార్కులున్నాయ‌నేందుకు ఇది తార్కాణం అంటున్నారు ప‌రిశీల‌కులు. కాపుల్లో యువకుడిగా ఉన్న వంగవీటి రాధా రాజకీయంగా దెబ్బతిన్నారు. ఇప్పుడు కాపు సామాజిక వర్గలో జక్కంపూడి రాజా బలమైన నేతగా ఎదుగుతారా? వంగవీటి రాధాకు చెక్ పెట్టేందుకే జక్కంపూడి రాజాకు కీలకమైన పదవిని జగన్ ఇచ్చారంటారు.

Tags:    

Similar News