ఈ టిక్కెట్ కోసం జనసేన నేతల క్యూ
2019 ఎన్నికల్లో జనసేన సాధించిన గొప్ప గురించి చెప్పుకోవడానికి ఏదైనా మిగిలి ఉందంటే అది రాజోలు నియోజకవర్గం. అయితే పవన్‌కు ఆ ఆనందం కొద్ది రోజులే మిగిలి [more]
2019 ఎన్నికల్లో జనసేన సాధించిన గొప్ప గురించి చెప్పుకోవడానికి ఏదైనా మిగిలి ఉందంటే అది రాజోలు నియోజకవర్గం. అయితే పవన్‌కు ఆ ఆనందం కొద్ది రోజులే మిగిలి [more]
2019 ఎన్నికల్లో జనసేన సాధించిన గొప్ప గురించి చెప్పుకోవడానికి ఏదైనా మిగిలి ఉందంటే అది రాజోలు నియోజకవర్గం. అయితే పవన్‌కు ఆ ఆనందం కొద్ది రోజులే మిగిలి ఉంది. జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు వైసీపీ చెంత చేరిపోయారు. ఆయన తన కుమారుడిని కూడా జగన్ సమక్షంలో వైసీపీలో చేర్పించేశారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. ఇప్పుడు రాపాక వరప్రసాద్ వైసీపీలో ఉండడంతో రాజోలు వైసీపీ రాజకీయం బ్రష్టు పట్టిపోయింది. ఎప్పుడు అయితే రాపాక వైసీపీలోకి వెళ్లాడో అప్పుడే రాజోలు వైసీపీ మూడుగా చీలిపోయింది. స్థానిక క్షత్రియులు అందరూ వైసీపీ నేతలుగా చెలామణి అవుతున్నారు. వీరంతా రాపాక వరప్రసాద్ తమ చెప్పు చేతల్లో ఉంటాడని ఆయనకే సపోర్ట్ చేస్తున్నారు. ఇక ఇక్కడ వైసీపీ నుంచి గత రెండు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన బొంతు రాజేశ్వరరావు మరో వర్గంగా ఉంటే.. మాల కార్పోరేషన్ చైర్మన్ పెదపాటి అమ్మాజీ మరో వర్గంగా ఉంటున్నారు. ఈ ముగ్గురిలో ఎవరు అన్నా మిగిలిన ఇద్దరికి పడట్లేదు.
కంపు కంపు అయిపోయింది….
జగన్ ఇప్పుడు రాపాక వరప్రసాద్ ను పార్టీలో చేర్చుకోవడంతో రాజోలు వైసీపీ రాజకీయం కంపు కంపు అయిపోయింది. కేడర్ మూడు ముక్కలైంది. పాత కేడర్ రాపాక వరప్రసాద్ ను పక్కన పెడుతోంది. జంపింగ్ నేతలు అందరూ బొంతును ఎప్పుడో సైడ్ చేసేశారు. అసలు అమ్మాజీ వెనక ఎవరు ఉన్నారో ? కూడా అర్థం కావట్లేదు. ఈ లోగా అమలాపురం ఎంపీ చింతా అనూరాధ సైతం తాను కూడా ఇక్కడ ఉన్నానని ఫ్రూవ్ చేసుకునేందుకో లేదా వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న కోరికో కాని.. ఆమె హడావిడి మామూలుగా లేదు. వచ్చే ఎన్నికల్లో రాపాక వరప్రసాద్ కు సీటు ఇస్తే వైసీపీ వాళ్లే ఆయన్ను ఓడిస్తామని శపథాలు చేస్తున్నారు.
బలమైన నేతలు లేక….
ఇక రాజోలు వైసీపీ తలనొప్పి ఇలా ఉంటే పవన్‌కు కూడా ఇక్కడ వాతావరణం తలనొప్పిగా మారింది. రాపాక వెళ్లిపోయాక ఇక్కడ జనసేనకు బలమైన నాయకులు లేకుండా పోయారు. అయితే జనసేన కేడర్ బలంగా ఉంది. సర్పంచ్ ఎన్నికల్లో ఇక్కడ జనసేన సానుభూతిపరులు ఏకంగా 30 + పంచాయతీల్లో గెలిచారు. అయితే ఇక్కడ జనసేన కేడర్ అంతా వచ్చే ఎన్నికల్లో రాపాక వరప్రసాద్ ను ఎలాగైనా ఓడించాలని కసితో ఉన్నారు. జనసేనలో ఉన్న కాపు సామాజిక వర్గంతో పాటు పవన్ అభిమానులు కూడా రాపాకను గట్టిగా టార్గెట్ చేస్తున్నారు.
పోటీ పెరిగి….
గత ఎన్నికల్లో జనసేన ఏపీలోనే గెలిచిన ఏకైక సీటు కావడం.. ఇక్కడ పార్టీకి బలం ఉండడంతో టీడీపీ కన్నా కూడా జనసేన నుంచి పోటీ చేసేందుకు అప్పుడే ఐదారుగురు నేతలు క్యూలో ఉన్నారు. ఓ ప్రముఖ న్యాయవాదితో పాటు ఒకరిద్దరు ప్రభుత్వ అధికారులు సీటుపై హామీ ఇస్తారా ? మేం ఇప్పుడే రంగంలోకి దిగుతామని చెపుతున్నారట. వైసీపీలో లుకలుకలు క్యాష్ చేసుకుంటే మళ్లీ ఇక్కడ జనసేనే గెలుస్తుందన్నది వారి లెక్క..! అయితే ఇప్పుడు జనసేన ఇన్‌చార్జ్ పగ్గాల కోసం పోటీ పడుతోన్న వారిలో అప్పుడే గొడవలు మొదలయ్యాయి. వీటిని సెట్ చేసేంత సీన్ పవన్‌కు లేదు. జనసేనకు లేక లేక ఈ ఒక్క నియోజకవర్గంలో పట్టు ఉంటే ఇక్కడ లుకలుకలు.. పవన్‌కు వీటిని పట్టించుకునే తీరిక లేకపోవడం ఆ పార్టీ బ్యాడ్ లక్ ?