Chinnaiah jangam : తండ్రి తెలియదు… తెలంగాణ బంగారమయ్యాడు
అట్టడుగు వర్గంలో పుట్టినా అతను అదరలేదు. బెదరలేదు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. ప్రపంచాన్ని జయించాలన్న లక్ష్యంతో పుస్తకాల పురుగులా మారారు. పల్లె టూరిలో జన్మించి ప్రపంచ దేశాల్లో అత్యున్నత [more]
;
అట్టడుగు వర్గంలో పుట్టినా అతను అదరలేదు. బెదరలేదు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. ప్రపంచాన్ని జయించాలన్న లక్ష్యంతో పుస్తకాల పురుగులా మారారు. పల్లె టూరిలో జన్మించి ప్రపంచ దేశాల్లో అత్యున్నత [more]
అట్టడుగు వర్గంలో పుట్టినా అతను అదరలేదు. బెదరలేదు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. ప్రపంచాన్ని జయించాలన్న లక్ష్యంతో పుస్తకాల పురుగులా మారారు. పల్లె టూరిలో జన్మించి ప్రపంచ దేశాల్లో అత్యున్నత స్థానానికి ఎదిగాడు. వ్యవస్థలను అంగీకరించకపోయినా వెనకడుగు వేయలేదు. తన లక్ష్యాన్ని ముందు ఉంచుకున్నారు. పయనించారు. ఇప్పుడు దేశంలో అందరికీ ఆదర్శంగా నిలిచారు. దళిత సమాజానికి ఒక దిక్సూచీగా నిలిచారు. ఆయనే జంగం చిన్నయ్య.
జోగిని కుటుంబంలో….
జంగం చిన్నయ్య జీవితం తెలుసుకున్న వారు ఒకింత ఆశ్చర్యపోక తప్పదు. జోగిని కుటుంబంలో జన్మించి ఇప్పుడు విశ్వవ్యాప్తిగా విద్యావ్యవస్థలో జోలపాటగా మారారు. జంగం చిన్నయ్య జన్మించింది ఒక సామాన్య కుటుంబంలో నిజామాబాద్ జిల్లా కొమ్మన్ పల్లి గ్రామం. జంగం చిన్నయ్య తల్లి చిన్నూ భాయ్ ని ఈ సమాజం జోగినీని చేసింది. అయినా ఆ తల్లి భయపడలేదు. తండ్రి ఎవరో తెలియని ఆ బిడ్డను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలనుకుంది. సమాజానికి వెరవలేదు. తన చెమట చుక్కలనే తన కుమారుడికి అక్షరాలుగా మార్చింది. ఆ తల్లి కష్టం ఫలించింది. కానీ చివరకు తన కొడుకు ఎదుగుదలను చూడకుండానే ఆ తల్లి కన్నుమూసింది.
కెనడాలో….
ఫలితంగా ప్రస్తుతం జంగం చిన్నయ్య కెనడాలోని కార్లెటాన్ యూనివర్సిటీలో హిస్టరీ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఓన మాలు దిద్దిన జంగం చిన్నయ్య ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో ఇంటర్ చదివారు. తర్వాత నాగార్జున సాగర్ లో డిగ్రీ పూర్తి చేశారు. అంతటితో ఆగలేదు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ జంగం చిన్నయ్యను అక్కున చేర్చుకుంది. అక్కడ ఎంఏ హిస్టరీ చదివారు. ఢిల్లీ జేఎన్టీయూలో ఎంఫిల్ చేసి ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యోగం చేశారు. అనంతరం యూనివర్సిటీ ఆఫ్ లండన లో పీహెచ్.డి పూర్తి చేశారు. న్యూయార్క్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేశారు.
అక్షరాలతో అద్భుతాలు….
జంగం చిన్నయ్య జీవితం ప్రస్తుత యువతకు ఆదర్శమనే చెప్పాలి. తండ్రిపేరు లేకుండా ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత స్థానంలో నిలిచారు. జంగం చిన్నయ్య దళిత్స్ అండ్ మేకింగ్ ఆఫ్ మోడరన్ ఇండియా పుస్తకాన్ని రచించారు. అట్టడుగు వర్గాలు అక్షరాలతో అద్భుతాలు సృష్టించవచ్చని జంగం చిన్నయ్య నిరూపించారు. జంగం చిన్నయ్య ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఉన్న దళిత వర్గాలకు మార్గదర్శి. ఆయన స్ఫూర్తితో యువత ముందడుగు వేయాలని కోరుకుందాం.