సింధియా తొలి దెబ్బే అదిరిపోలా?

దేశమంతా కరోనాతో కకావికలం అవుతుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రం కూడా ఇందుకు మినహాయింపు కాదు. అయినా అక్కడ రాజకీయాలు మాత్రం హాట్ హాట్ గానే ఉన్నాయి. మధ్యప్రదేశ్ లో [more]

Update: 2020-04-22 17:30 GMT

దేశమంతా కరోనాతో కకావికలం అవుతుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రం కూడా ఇందుకు మినహాయింపు కాదు. అయినా అక్కడ రాజకీయాలు మాత్రం హాట్ హాట్ గానే ఉన్నాయి. మధ్యప్రదేశ్ లో ఇటీవల ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన శివరాజ్ సింగ్ చౌహాన్ తన మంత్రి వర్గాన్ని విస్తరించారు. శివరాజ్ సింగ్ చౌహాన్ నెలరోజుల తర్వాత తొలిసారి తన మంత్రివర్గాన్ని విస్తరించారు. ఐదుగురితో తన మంత్రివర్గాన్ని విస్తరించారు.

ఒక్కరే ట్యాకిల్ చేయలేక…..

కరోనా విలయతాండవం చేస్తుంటే శివరాజ్ సింగ్ చౌహాన్ ఒక్కరే ట్యాకిల్ చేయలేకపోతున్నారు. నిత్యం అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించడం, క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకోవడం వంటి విషయాల్లో ఆయన ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నారు. ఆయన తన ఒక్కరి వల్లనే కాదని అర్థమయింది. అందుకోసమే బీజేపీ కేంద్ర నాయకత్వం అనుమతితో మంత్రి వర్గ విస్తరణకు అనుమతి తీసుకున్నారు.

ఐదుగురిని మంత్రివర్గంలోకి….

తొలి విస్తరణలో కేవలం ఐదుగురుని మాత్రమే తన మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. నిన్న గవర్నర్ లాల్జీ టాండన్ ఐదుగురు మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించారు. మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేసిన వారిలో నరోత్తమ్ మిశ్రా, కమల్ పటేల్, మీనా సింగ్, తులసి సిలావత్, గోవింద్ సింగ్ రాజ్ పుత్ లు ఉన్నారు. వీరిలో ముగ్గురు సింధియా వర్గానికి చెందిన వారే. తొలి విస్తరణలోనే సింధియా వర్గానికి పెద్ద పీట వేయడంపై బీజేపీలోనూ చర్చ జరుగుతోంది.

సింధియా వర్గానికే….

మధ్యప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటానికి జ్యోతిరాదిత్య సింధియా కారణం. దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. ఊహించని విధంగా సింధియా హ్యాండ్ ఇవ్వడంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం స్థానంలో బీజేపీ సర్కార్ ఏర్పడింది. అందువల్లనే తొలి విస్తరణలోనే సింధియా వర్గానికి ఎక్కువ మందికి మంత్రి పదవులు ఇచ్చారు. కరోనా సమయంలో ఆరోగ్య శాఖ మంత్రి లేరన్న విమర్శలు రావడంతో శివరాజ్ సింగ్ చౌహాన్ మంత్రివర్గ విస్తరణ చేపట్టారు. మొత్తం మీద జ్యోతిరాదిత్య సింధియా తొలి విస్తరణలోనే తన సత్తా చాటారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

Tags:    

Similar News