జగ్గంపేట చంటిబాబుకు మళ్ళీ ఛాన్సుందా… ?
తూర్పుగోదావరి జిల్లాలో రాజకీయంగా ఆసక్తిని రేకెత్తించే శాసనసభ నియోజకవర్గాలలో జగ్గంపేట ఒకటి. ఈ నియోజకవర్గంలో ఇప్పటికి కొన్ని దశాబ్దాలుగా ఒకే సామాజిక వర్గం గెలుస్తోంది. కాపు సామాజిక [more]
;
తూర్పుగోదావరి జిల్లాలో రాజకీయంగా ఆసక్తిని రేకెత్తించే శాసనసభ నియోజకవర్గాలలో జగ్గంపేట ఒకటి. ఈ నియోజకవర్గంలో ఇప్పటికి కొన్ని దశాబ్దాలుగా ఒకే సామాజిక వర్గం గెలుస్తోంది. కాపు సామాజిక [more]
తూర్పుగోదావరి జిల్లాలో రాజకీయంగా ఆసక్తిని రేకెత్తించే శాసనసభ నియోజకవర్గాలలో జగ్గంపేట ఒకటి. ఈ నియోజకవర్గంలో ఇప్పటికి కొన్ని దశాబ్దాలుగా ఒకే సామాజిక వర్గం గెలుస్తోంది. కాపు సామాజిక వర్గానికి జగ్గంపేట కంచుకోట. అంతే కాదు, తోట, జ్యోతుల ఫ్యామిలీలే గత మూడు దశాబ్దాలుగా రాజ్యం చేస్తున్నాయి. ఇక గత రెండు సార్లుగా ఇక్కడ వైసీపీ జెండా ఎగురవేసింది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు నాయకులకు టికెట్ ఇచ్చి మరీ గెలిపించుకోవడం జగన్ సాధించిన రికార్డుగా చెప్పాలి. తెలుగుదేశంలో పుట్టి రెండు సార్లు ఎమ్మెల్యే అయిన జ్యోతుల నెహ్రూ తరువాత కాలంలో ప్రజారాజ్యంలో చేరి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత ఆయన మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచింది 2014లోనే. అది కూడా వైసీపీ జెండా మీదనే.
అత్యధిక మెజారిటీతో….
అయితే ఆయన మూడేళ్ళకే జగన్ కి బై చెప్పేసి టీడీపీలో చేరిపోయారు. ఆ తరువాత టీడీపీ నుంచి జ్యోతుల చంటిబాబు వైసీపీలో చేరారు. ఈ ఇద్దరు కుటుంబ ప్రత్యర్ధులు, రాజకీయ ప్రత్యర్ధులుగా మారి అనేక ఎన్నికల్లో పోటీ పడ్డారు. ఇక 2019 ఎన్నికల్లో జ్యోతుల చంటిబాబు ఏకంగా ఇరవై వేల ఓట్ల మెజారిటీతో నెహ్రూని ఓడించి జగన్ అప్పగించిన బాధ్యతను అలా పూర్తి చేశారు. ఈ మధ్యలో జనసేన నుంచి పోటీ చేసిన అభ్యర్ధికి పది వేల ఓట్లు వచ్చాయి. నెహ్రూకి 70 వేల ఓట్లు వస్తే జ్యోతుల చంటిబాబుకు ఏకంగా తొంబై వేల ఓట్లు వచ్చాయి.
జనసేనతో పొత్తు పెట్టుకున్నా..?
అందువల్ల జనసేనతో టీడీపీ పొత్తు పెట్టుకున్నా కూడా వచ్చే ఎన్నికల్లో జగ్గంపేటలో వైసీపీకి వచ్చిన ఢోకా ఏదీ లేదని చెప్పాలి. ఎందుకంటే చంటిబాబు రాజకీయంగా చురుకుగానే ఉంటున్నారు. ఇక రాజకీయంగా అనేక పార్టీలు జంప్ చేసిన నెహ్రూ వయోభారంలో బాగా తగ్గారు. ఆయన ఈ మధ్య చంద్రబాబుకు వ్యతిరేకంగా కూడా కామెంట్స్ చేసి అధినాయకత్వం ఆగ్రహానికి గురి అయ్యాయి. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడిని పోటీకి దించాలని నెహ్రూ చూస్తున్నారు.
వివాద రహితుడిగా….?
ప్రస్తుతం జ్యోతుల నెహ్రూ తనయుడు జ్యోతుల నవీన్ కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఇక ఆయనకు వారసుడికి టీడీపీ సీటు ఇస్తుందో లేదో తెలియదు. ఇంకో వైపు పొలిటికల్ గా గట్టిగానే ఫౌండేషన్ వేసుకున్న జ్యోతుల చంటిబాబు మళ్ళీ గెలిచేందుకు అంతా సిధ్ధం చేసుకున్నారు. ఎవరు కలసి వచ్చినా పొత్తులు ఎన్ని ఉన్నా తనను ఓడించలేరు అన్న ధీమాతో జ్యోతుల చంటిబాబు ఉన్నారు. జ్యోతుల నెహ్రూ లాంటి ఉద్దండుడు అవతల ఉన్నా కూడా జ్యోతుల చంటిబాబు వివాద రహిత రాజకీయాలతో ఆయన్ను మరుగున పడేస్తున్నారు.