ఫిక్స్…. ఈయన కాదట

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలయింది. మార్చి 26 న పోలింగ్ జరగనుంది. దీంతో తెలంగాణలో భర్తీ కానున్న రాజ్యసభ స్థానాలపై టీఆర్ఎస్ లో చర్చ జరుగుతోంది. తెలంగాణ [more]

;

Update: 2020-02-28 09:30 GMT

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలయింది. మార్చి 26 న పోలింగ్ జరగనుంది. దీంతో తెలంగాణలో భర్తీ కానున్న రాజ్యసభ స్థానాలపై టీఆర్ఎస్ లో చర్చ జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర అధినేత కేసీఆర్ మార్చి మొదటి వారంలో అభ్యర్థుల పేర్లను వెల్లడించే అవకాశముంది. అయితే ఇప్పటి నుంచే ఆశావహులు ప్రగతి భవన్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. అయితే కేసీఆర్ మైండ్ లో ఇప్పటికే పేర్లు ఫిక్స్ అయ్యాయని, వాటిని మార్చేందుకు ఎవరికీ సాధ్యం కాదని కూడా పార్టీ వర్గాలే చెబుతున్నాయి.

రెండు స్థానాల్లో…..

తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఇందులో టీఆర్ఎస్ తరుపు కె. కేశవరావు పదవీ విరమణ చేయనున్నారు. రెండు స్థానాలు టీఆర్ఎస్ కే దక్కనున్నాయి. అయితే కె.కేశవరావుకు ఇప్పటికే రెండు సార్లు రాజ్యసభకు అవకాశం కల్పించారు. ఆయన నిరాటంకంగా 2006 నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నాయి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో దక్కిన రాజ్యసభ పదవి అలాగే కంటిన్యూ అవుతుంది.

అనేక మంది…..

రెండు స్థానాలకు దాదాపు పన్నెండు మంది పోటీ పడుతున్నారు. అయితే కె. కేశవరావుకు ఈసారి రెన్యువల్ చేసే అవకాశం లేనట్లే కన్పిస్తుంది. పార్టీలో గాని, రాష్ట్రంలో కాని ఆయనకు కీలక పదవి ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఒకే వ్యక్తి కి కంటిన్యూ గా పదవులు ఇవ్వడం కూడా సరికాదని, మిగిలిన వారికి అవకాశాలు కల్పించాల్సి ఉంటుందన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నారని చెబుతున్నారు. దీంతో కె. కేశవరావుకు రెన్యువల్ కావడం కష్టమేనన్నది పార్టీ వర్గాల నుంచి విన్పిస్తున్న మాట.

రాష్ట్ర స్థాయి పదవిని…..

ఢిల్లీలో తెలంగాణ గళం ఇటీవల కాలంలో విన్పించడం లేదని, సమర్థంగా వాదనలు విన్పించడం లేదని కేసీఆర్ అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. అందుకోసమే ఆయన ఈసారి సమర్థులైన వారిని రాజ్యసభకు పంపాలని డిసైడ్ అయినట్లు చెబుతున్నారు. గతంలో రెండు స్థానాలు బీసీలకు ఇచ్చినందున ఈసారి వారికి అవకాశం లేదు. అందుకే కె. కేశవరావును రాజ్యసభకు పంపే ఆలోచనను కేసీఆర్ చెరిపేసుకున్నట్లేనని చెబుతున్నారు. మరి కేశవరావుకు రాష్ట్రంలో ఎలాంటి పదవి దక్కుతుందో చూడాలి.

Tags:    

Similar News