వైసీపీ ఎమ్మెల్యే మళ్లీ గెలిచే ఛాన్సే లేదు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎలా ఉండాలి? ఒకవైపు ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ కార్యక్రమాలను వరుసబెట్టి గ్రౌండ్ చేస్తుంటే ఈ ఎమ్మెల్యే మాత్రం తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. [more]
;
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎలా ఉండాలి? ఒకవైపు ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ కార్యక్రమాలను వరుసబెట్టి గ్రౌండ్ చేస్తుంటే ఈ ఎమ్మెల్యే మాత్రం తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. [more]
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎలా ఉండాలి? ఒకవైపు ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ కార్యక్రమాలను వరుసబెట్టి గ్రౌండ్ చేస్తుంటే ఈ ఎమ్మెల్యే మాత్రం తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. వలస వచ్చి పోటీ చేసినా నియోజకవర్గ ప్రజలు గెలిపించినా వారిని మెప్పించడంలో విఫలమవుతున్నారు. గత ఆరు నెలల్లో ఆయన నియోజకవర్గానికి వచ్చింది వేళ్ల మీద లెక్కించవచ్చు. మరోసారి ఆయన గెలిచే ఛాన్స్ లేదంటున్నారు. ఆయనే విజయనగరం జిల్లా ఎస్ కోట వైసీపీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు.
ఎన్ఆర్ఐగా వచ్చి…..
కడుబండి శ్రీనివాసరావు ఒక ఎన్ఆర్ఐ. అమెరికాలో ఉన్న కడుబండి శ్రీనివాసరావు రాజకీయాలపై ఆసక్తితో రాష్ట్రానికి వచ్చారు. కడుబండి శ్రీనివాసరావుది వాస్తవానికి గజపతినగరం నియోజకవర్గం. తొలుత ఆయన ప్రజారాజ్యం పార్టీలో చేరి 2009లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తర్వాత వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో అక్కడ టిక్కెట్ కోసం ఆయన ప్రయత్నించినా బొత్స సత్యనారాయణ సోదరుడు బొత్స అప్పల నరసయ్య కు టిక్కెట్ దక్కింది. అయితే జగన్ పాదయాత్ర సందర్భంగా ఆయనను ఎస్ కోట నియోజకవర్గానికి ఇన్ చార్జిగా నియమించారు.
చివరికి టిక్కెట్ దక్కించుకుని….
నిజానికి ఎస్ కోట నియోజకవర్గం నుంచి బొత్స మేనల్లుడు చిన్న శ్రీను పోటీ చేయాలని చివరి నిమిషం వరకూ టిక్కెట్ కోసం ప్రయత్నించినా జగన్ మాత్రం కడుబండి శ్రీనివాసరావుకే టిక్కెట్ ఇచ్చారు. స్థానికేతరుడైనా ఎస్ కోట వైసీపీ నేతలు కడుబండి శ్రీనివాసరావును దగ్గరుండి గెలిపించుకున్నారు. అయితే గెలిచిన తర్వాత మాత్రం కడుబండి కనపడకుండా పోయారు. కనీసం జిల్లా స్థాయి సమీక్షలకు కూడా ఆయన హాజరు కావడం లేదు.
స్థానికేతరుడైనా…..
దీంతో నియోజకవర్గంలో కడుబండి శ్రీనివాసరావు మీద తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నియోజకవర్గానికి చుట్టపు చూపుగా వచ్చి పోతున్నారు. ఎమ్మెల్యే నియోజకవర్గంలో పట్టించుకోకపోవడంతో అక్కడ వైసీపీ సీనియర్ నేతలే ఆధిపత్యం చెలాయిస్తున్నారట. ఎప్పటి నుంచో ఇక్కడ నేతలు పార్టీలో ఉండటంతో ప్రజలు కూడా తమ సమస్యల కోసం వారి వద్దకు వస్తున్నారు. నియోజకవర్గంలోని సీనియర్ నేతలు తనను ఓవర్ టేక్ చేస్తున్నారని కడుబండి శ్రీనివాసరావు మనస్థాపం చెంది నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారన్న టాక్ కూడా ఉంది. అధిష్టానానికి చెప్పినా పట్టించుకోలేదంటున్నారు. మొత్తం మీద కడుబండి శ్రీనివాసరావు ఎస్ కోట నియోజకవర్గం నుంచి మరోసారి గెలవడం కష్టమేనంటున్నారు.