వైసీపీ ఎమ్మెల్యేకు ఏడాదిలోనే సీన్ రివ‌ర్స్… ఏం జ‌రిగిందంటే?

వైసీపీలో ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక తీరుగా ఉంటున్నారు. కొంద‌రు అభివృద్ధి మంత్రం ప‌ఠిస్తున్నారు. మ‌రి కొందరు త‌మ స‌త్తామీద తాము నిల‌బ‌డుతున్నారు. కానీ, ఇంకొంద‌రు మాత్రం.,. నాయ‌కుల [more]

Update: 2020-05-22 03:30 GMT

వైసీపీలో ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక తీరుగా ఉంటున్నారు. కొంద‌రు అభివృద్ధి మంత్రం ప‌ఠిస్తున్నారు. మ‌రి కొందరు త‌మ స‌త్తామీద తాము నిల‌బ‌డుతున్నారు. కానీ, ఇంకొంద‌రు మాత్రం.,. నాయ‌కుల భ‌జ‌న‌లో ఊరేగుతున్నారు. దీంతో ఇలాంటి వంటి వారు త‌మ స‌త్తా నిరూప‌ణ విష‌యంలో మాత్రం వెనుక‌బ‌డి పోతున్నారు. ఫ‌లితంగా నియోజ‌క‌వ‌ర్గంలో చుల‌కన అవుతున్నారు. రాజ‌కీయంగా కూడా వెనుక‌బ‌డి పోతున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇలాంటి వారిలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని కీల‌క నియోజ‌క‌వ‌ర్గం శృంగ‌వ‌ర‌పుకోట‌(ఎస్.కోట‌) ఎమ్మెల్యే క‌డుగొండి శ్రీనివాస‌రావు పేరే.

2014 లో ఓటమి పాలయి…

వైసీపీలో కీల‌క నాయ‌కుడిగా ఎదిగారు శ్రీనివాస‌రావు. అయితే, 2014లో గ‌జ‌ప‌తిన‌గ‌రం నుంచి పోటీ చేసినా .. ఆయ‌న ఓడిపోయారు. ఆ ఎన్నిక‌ల్లో గ‌జ‌ప‌తిన‌గ‌రంలో కోళ్ల అప్పల‌నాయుడు, క‌డుబండి శ్రీనివాస‌రావు… టీడీపీ, వైసీపీ నుంచి పోటీ ప‌డ‌గా.. బొత్స అప్పల న‌ర‌స‌య్య కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. ఈ ట్రయాంగిల్ ఫైట్‌లో క‌డుబండి శ్రీనివాస‌రావు ఓడిపోయారు. అప్పటికి బొత్స స‌త్యనారాయ‌ణ కాంగ్రెస్‌లోనే ఉన్నారు. అయితే, బొత్స వైసీపీ లోకి ఎంట్రి ఇవ్వడంతో క‌డుబండి శ్రీనివాస‌రావు రాజ‌కీయ ప‌రిస్థితి పూర్తిగా మారిపోయింది. అప్పటి వ‌ర‌కు గ‌జ‌ప‌తిన‌గ‌రం వైసీపీ బాధ్యత‌లు చూస్తోన్న ఆయ‌న్ను బొత్స సోద‌రుడు న‌ర‌స‌య్య కోసం స్థానం మార్చక త‌ప్పని ప‌రిస్థితి.

నియోజకవర్గం మారినా…..

గ‌త ఏడాది జ‌రిగిన ఎన్ని క‌ల్లో గ‌జ‌ప‌తి న‌గ‌రం టికెట్‌ను బొత్స త‌న సోద‌రుడు అప్పల న‌ర్సయ్యకు ఇప్పించుకున్నారు. ఈ నేప‌థ్యంలో క‌డుబండి శ్రీనివాస‌రావును ఎస్‌.కోట‌కు పంపారు. వాస్తవంగా అక్క‌డ క్షత్రియ సామాజిక వ‌ర్గానికి చెందిన మ‌రో నేత పార్టీ కోసం క‌ష్టప‌డి సీటు ఆశించారు. అయితే చివ‌ర్లో బొత్స వ్యూహాత్మకంగా చ‌క్రం తిప్పి ఆ సీటు త‌న శిష్యుడు శ్రీనివాస‌రావుకు ఇప్పించుకున్నారు. అక్కడ నుంచి పోటీ చేసిన క‌డుబండి శ్రీనివాస‌రావు జ‌గ‌న్ సునామీ ప్రభావంతో విజ‌యం ద‌క్కించుకున్నారు. వాస్తవానికి ఇక్కడ టీడీపీకి గ‌ట్టి ప‌ట్టుంది. కోళ్ల ల‌లిత కుమారి కుటుంబం ఇక్కడ ప‌క్కా వ్యూహంతో ముందుకు సాగుతోంది. అలాంటి చోట‌.. వైసీపీ గెలుపు గుర్రం ఎక్కింది. ఇలాంటి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ట్టు సాధిం చేందుకువైసీపీ ఎలా క‌ష్టప‌డాల్సి ఉంటుందో తెలియంది కాదు.

భారీ మెజారిటీ రావడంతో…

ఎన్నిక‌ల్లో క‌డుబండి శ్రీనివాస‌రావు ఓడిపోతాడ‌న్న అంచ‌నాలే ఉన్నా జ‌గ‌న్ సునామి వ‌ల్లే ఆయ‌న భారీ మెజార్టీతో గెలిచారు. మ‌రో విశేషం ఏంటంటే ఎస్‌. కోట విశాఖ‌ప‌ట్నం లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోకి వ‌స్తుంది. ఇక్కడ వ‌చ్చిన భారీ మెజార్టీతోనే విశాఖ ఎంపీ కూడా వైసీపీ ఖాతాలో ప‌డింది. ఇక గాలి వాటంలో నాన్ లోకల్ అయినా తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన క‌డుబండి శ్రీనివాస‌రావు.. బొత్సకు భ‌జ‌న చేయ‌డం త‌ప్ప ఏమీ చేయ‌డం లేదు అనే విమ‌ర్శలు జోరందుకున్నాయి. పైగా స్తానిక నాయ‌కుడు కాక‌పోవ‌డంతో ఇక్కడ ప‌ట్టు పెంచుకునేందుకు క‌డుబండి శ్రీనివాస‌రావు చాలా కృషి చేయాల్సి ఉంది.

నాన్ లోకల్ కావడంతో….

అయినా కూడా ఆయ‌న కేవ‌లం బొత్సకు భ‌జ‌న చేయ‌డంలోనే స‌రిపెడుతున్నారు. బొత్స అండ‌దండ‌లు పుష్కలంగా ఉన్నాయ‌న్న కార‌ణంగానే క‌డుబండి శ్రీనివాస‌రావు నియోజ‌క‌వ‌ర్గాన్ని ప‌ట్టించుకోవ‌డం లేద‌ట‌. ఇక ఈ యేడాది కాలంలో ఎస్‌.కోట‌లో అభివృద్ధి గురించి చెప్పుకోవ‌డానికి శూన్యమే ఉందంటున్నారు. ఇక నియోజ‌క‌వ‌ర్గ వైసీపీలో మిగిలిన గ్రూపులు అన్నీ స్థానికేత‌రుడు అయిన క‌డుబండి శ్రీనివాస‌రావును పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. వాస్తవంగా చూస్తే యేడాదిలోనూ క‌డుబండిపై తీవ్ర వ్యతిరేక‌త వ్యక్తమ‌వుతోంద‌న్నది నిజం. దీంతో ఇక్కడ సీన్ రివ‌ర్స్ అవుతోంద‌ని వైసీపీ సీనియ‌ర్లు భావిస్తున్నారు. మ‌రి ఇప్పటికైనా క‌డుబండి శ్రీనివాస‌రావు బొత్స అండ‌దండ‌లున్నాయ‌న్న విష‌యం ప‌క్కన పెట్టి తాను ప్రజ‌ల్లోకి వెళితేనే ఆయ‌న ఇక్కడ ప‌ట్టు నిలుపుకునే ఛాన్స్ ఉంది.

Tags:    

Similar News