వైసీపీ ఎమ్మెల్యేపై అసంతృప్తి… టీడీపీ లేడీ లీడర్‌కు ప్లస్ అయ్యిందా ?
ఆయన నాన్‌లోకల్ ఎమ్మెల్యే. తన సొంత నియోజకవర్గం ఒకటైతే.. విజయం సాధించింది మరో నియోజకవర్గం. అయితే అక్కడైనా ఆయన కుదురుగా ఉండి పట్టు చిక్కించుకుంటున్నారా ? అంటే [more]
;
ఆయన నాన్‌లోకల్ ఎమ్మెల్యే. తన సొంత నియోజకవర్గం ఒకటైతే.. విజయం సాధించింది మరో నియోజకవర్గం. అయితే అక్కడైనా ఆయన కుదురుగా ఉండి పట్టు చిక్కించుకుంటున్నారా ? అంటే [more]
ఆయన నాన్‌లోకల్ ఎమ్మెల్యే. తన సొంత నియోజకవర్గం ఒకటైతే.. విజయం సాధించింది మరో నియోజకవర్గం. అయితే అక్కడైనా ఆయన కుదురుగా ఉండి పట్టు చిక్కించుకుంటున్నారా ? అంటే అది కూడాలేదు. దీంతో ఈ పరిణామం.. ప్రతిపక్ష నేతగా ఉన్న టీడీపీ మాజీ మహిళా ఎమ్మెల్యేకి వరంగా మారింది. ఆమె దూకుడుగా నియోజకవర్గంలో పట్టు పెంచుకుంటున్నారు. సదరు ఎమ్మెల్యే గెలిచి రెండేళ్లు కూడా కాకుండానే ఆయనకు అంతలా వ్యతిరేక గాలులే వీస్తున్నాయి. దీంతో వైసీపీ నేత ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో మళ్లీ టీడీపీ మహిళా నేత హవా జోరుగా సాగుతోందనే చర్చలు స్థానికంగా వినిపిస్తున్నాయి.
ఎన్నారైగా వచ్చి…..
విషయంలోకి వెళ్తే.. విజయనగరం జిల్లాలోని ఎస్.కోట నియోజకవర్గం నుంచి గత 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే గా కడుబండి శ్రీనివాసరావు విజయం సాధించారు. ఈయన ఎన్నారై. వాస్తవానికి ఈయన సొంత నియోజకవర్గం గజపతి నగరం. 2014లో ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన ఓడిపోయారు. గత ఎన్నికల్లో మరోసారి తన భవిష్యత్తును అక్కడే తేల్చుకుందామని అనుకునే సరికి .. బొత్స సత్యనారాయణ ఇక్కడ చక్రం తిప్పి తన సోదరుడు అప్పల నరసయ్యకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఆయనను ఎస్.కోటకు మార్చారు. నియోజకవర్గానికి నాన్ లోకల్ అయినప్పటికీ.. జగన్ సునామీలో విజయం సాధించారు. అయితే ఎమ్మెల్యేగా గెలవడంతోనే ఆయన రిలాక్స్ అయిపోయారనే స్థాని ప్రజలు అంటున్నారు.
విజిటింగ్ ప్రొఫెసర్ గా…..
ఆయన ఎమ్మెల్యే అయినా నియోజకవర్గంలో ఉండకపోగా.. కరోనా సహా ఇతర సమయాల్లోనూ ఆయన ఇక్కడి వారికి ఎవరికీ అందుబాటులో ఉండడంలేదు. దీనికి తోడు ఆయనకు కూడా కరోనా రావడంతో ఆ టైంలో అసలు నియోజకవర్గం వైపే చూడలేదు. ఈయన ఎక్కువ సమయం ఇతర ప్రాంతాల్లో లేదా వైజాగ్‌కే పరిమితం కావడంతో..ఈ గ్యాప్‌ను మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి చక్కగా వాడుకున్నారు. కరోనా సమయంలోను.. ఆ తర్వాత కూడా ఇక్కడి ప్రజలకు అందుబాటులో ఉన్నారు. కడుబండికి ఓట్లేసినా భవిష్యత్తులోనూ ఉపయోగం ఉండదని.. ఆయన నియోజకవర్గానికి ఓ విజిటింగ్ ప్రొఫెసర్ అయిపోయారన్న టాక్ వచ్చేసింది. ఇవన్నీ మాజీ ఎమ్మెల్యే లలిత కుమారికి ప్లస్ అవుతున్నాయి.