Ycp : ఇక్కడ ఎమ్మెల్యేకు ఇక మిగిలిందేమీ లేదట

అలివి కాని చోట అధికులమనరాదు అన్న సామెత రాజకీయాలకు బాగా వర్తిస్తుంది. అసలే అంతంత మాత్రంగా ఉన్న తన పరిస్థితిని నిర్ణయాలతో మరింత చేటు తెచ్చుకుంటున్నారు ఈ [more]

;

Update: 2021-09-30 14:30 GMT

అలివి కాని చోట అధికులమనరాదు అన్న సామెత రాజకీయాలకు బాగా వర్తిస్తుంది. అసలే అంతంత మాత్రంగా ఉన్న తన పరిస్థితిని నిర్ణయాలతో మరింత చేటు తెచ్చుకుంటున్నారు ఈ ఎమ్మెల్యే. నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో లేకుండా ఉండటంతో అసలే ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా పరిషత్ ఎన్నికల్లో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు ఇవ్వడంలో ప్రాధాన్యత ఇవ్వడంతో పార్టీ క్యాడర్ కూడా ఆయనకు రివర్స్ అయింది. ఆయనే శృంగవరపు కోట వైసీపీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు.

నాన్ లోకల్ గా….

కడుబండి శ్రీనివాసరావు ఎస్ కోట నియోజకవర్గానికి చెందిన వారు కాదు. ఆయన ఎన్ఆర్ఐ. అమెరికాలో బాగా సంపాదించి ఇక్కడ రాజకీయం చేద్దామని వచ్చారు. ఈయనది నిజానికి గజపతి నగరం నియోజకవర్గం. అక్కడి నుంచి 2009లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసిన కడుబండి శ్రీనివాసరావు ఓటమి పాలయ్యారు. తర్వాత ఆయన వైసీపీలో చేరారు. గజపతి నగరం టిక్కెట్ కోసం ప్రయత్నించినా అక్కడ బొత్స కుటుంబ సభ్యులు ఉండటంతో అప్పటికప్పుడు జగన్ ఈయనకు శృంగవరపు కోట టిక్కెట్ ను కేటాయించారు.

నియోజకవర్గానికి దూరంగా….

2019 ఎన్నికల్లోనే శృంగవరపు కోటలో వైసీపీ క్యాడర్ కడుబండి శ్రీనివాసరావు అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించింది. అయినా జగన్ ఆదేశాలతో కలసికట్టుగా కృషి చేసి గెలిపించారు. అయితే గెలిచిన రెండున్నరేళ్లలో కడుబండి శ్రీనివాసరావు నియోజకవర్గంలో పర్యటించింది చాలా తక్కువ సార్లే. ఆయన కోసం నేతలు విశాఖ, హైదరాబాద్ లకు వెళ్లాల్సి వస్తుందంటున్నారు. ప్రజలు కూడా ఎమ్మెల్యేపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం స్థానిక నేతలు మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లారు.

వ్యతిరేకిస్తున్న నేతలు…

కానీ ఇటీవల పరిషత్ ఎన్నికల సమయంలో కడుబండి శ్రీనివాసరావు ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు ఎంపీపీ పదవిని కట్టబెట్టే ప్రయత్నం చేశారు. టీడీపీ నుంచి పార్టీలో వచ్చిన వారికి పదవివ్వడమేంటని మిగిలిన వైసీపీ నేతలు అభ్యంతరం తెలిపారు. ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు నిర్ణయానికి వ్యతిరేకంగా ఎంపీటీసీలంతా ఏకమయ్యారు. వారంతా కలసి దొగ్గ సత్యవంతుడిని అభ్యర్థిగా నిలబెట్టారు. ఇటుప్రజల్లో అసంతప్తి, అటు క్యాడర్, నేతల్లోనూ అసహనం కన్పిస్తుంది. ఇప్పటికైనా వైసీపీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు తన తీరు మార్చుకోవాలని పార్టీ నేతలే హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News