రీ ఎంట్రీ అందుకేనట… కేసీఆర్ ఆలోచన అదే?
నిజామాబాద్ మాజీ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత తిరిగి పాలిటిక్స్ లో రీ ఎంట్రీ ఇస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో ఓటమి అనంతరం కవిత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. [more]
;
నిజామాబాద్ మాజీ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత తిరిగి పాలిటిక్స్ లో రీ ఎంట్రీ ఇస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో ఓటమి అనంతరం కవిత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. [more]
నిజామాబాద్ మాజీ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత తిరిగి పాలిటిక్స్ లో రీ ఎంట్రీ ఇస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో ఓటమి అనంతరం కవిత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లోనూ పెద్దగా పాల్గొనలేదు. నిజామాబాద్ కూడా కవిత వెళ్లలేదంటే ఆమె ఏవిధమైన నైరాశ్యంలోకి వెళ్లిపోయారో అర్థమవుతుంది. అయితే కవితకు రాజ్యసభ స్థానం దక్కుతుందని చివర వరకూ ప్రచారం జరిగింది. చివరి నిమిషంలో కేసీఆర్ అదే జిల్లాకు చెందిన సురేష్ రెడ్డిని ఎంపిక చేయడంతో కవితకు ఎలాంటి పదవి దక్కుతుందన్న ఉత్కంఠ నెలకొంది.
భవిష్యత్తును ఆలోచించే…..
అయితే తాజాగా కేసీఆర్ శాసనమండలికి కవితను తీసుకురావడం భవిష్యత్తును ఆలోచించేనని చెబుతున్నారు. కవిత తొలిసారి టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు జాతీయ రాజకీయాలకే పరిమితమయ్యారు. ఇక్కడ సింగరేణి కాలరీస్ కార్మిక సంఘాలు వంటి వాటికి గౌరవ అధ్యక్షురాలిగా ఉండేవారు. నిజామాబాద్ జిల్లాలో పార్టీ పటిష్టత కోసం కవిత కృషి చేశారు. అయితే గత పార్లమెంటు ఎన్నికల్లో ఊహించని విధంగా కవిత ఓటమి పాలయ్యారు.
జాతీయ రాజకీయాల్లోకి….
దీంతో గత పది నెలలుగా కవిత కేవలం ఇంటికే పరిమితమయ్యారని చెప్పవచ్చు. తాజాగా కవిత రీఎంట్రీ చూస్తుంటే రాష్ట్ర రాజకీయాల్లో కవిత ప్రధాన భూమిక పోషిించే అవకాశాలున్నా యంటున్నారు. కేసీఆర్ కొద్ది రోజుల్లోనే ముఖ్యమంత్రి పదవిని తన కుమారుడు కేటీఆర్ కు అప్పగిస్తారన్న టాక్ ఉంది. తాను జాతీయ రాజకీయాలను చూసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లోనే కవిత రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారంటున్నారు.
మంత్రిగా కూడా……?
ఈ ఎన్నిక ఏకపక్షంగానే ఉండనుంది. కాంగ్రెస్ బరిలోకి దిగినా పెద్దగా ప్రభావం చూపలేదు. స్థానిక సంస్థల ప్రతినిధులందరూ అత్యధికంగా టీఆర్ఎస్ కు చెందిన వారే కావడంతో కవిత విజయం సునాయాసమే. అయితే కవితకు కేవలం ఎమ్మెల్సీ పదవితో సరిపెడతారా? మంత్రివర్గంలో చేర్చుకుంటారా? అన్న ఊహాగానాలు అప్పుడే మొదలయ్యాయి. కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే ఆయనశాఖను కవితకు అప్పగిస్తారన్న ప్రచారం కూడా జరుగుతుంది. మొత్తం మీద కవిత రీ ఎంట్రీతో తెలంగాణ రాష్ట్ర సమితిలోనూ, ప్రభుత్వంలోనూ మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి.