ఎన్నిక లాంఛనమే అయినా.. జాప్యంతో?

మాజీ ఎంపీ కవిత ఈపాటికి ఎమ్మెల్సీ అయి ఉండేవారు. నిజానికి ఏప్రిల్ నెలలోనే నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక జరగాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా [more]

;

Update: 2020-07-06 05:00 GMT

మాజీ ఎంపీ కవిత ఈపాటికి ఎమ్మెల్సీ అయి ఉండేవారు. నిజానికి ఏప్రిల్ నెలలోనే నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక జరగాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా ఎన్నికల సంఘం వాయిదా వేసింది. నలభై అయిదు రోజులపాట వాయిదా వేయడంతో ఆగస్టు నెలలో ఈ ఎన్నికల జరిగే అవకాశముందంటున్నారు. తగిన బలం ఉన్నా.. గెలుపు విషయంలో స్పష్టత ఉన్నా కవితకు కరోనా ఎమ్మెల్సీ పదవికి అడ్డుపడిందనే చెప్పాలి.

తక్కువ కాలపరిమితి ఉండటంతో….

నిజామాబాద్ ఎమ్మెల్సీగా ఉన్న భూపతి రెడ్డిపై పార్టీ ఫిరాయింపుల చట్టం కింద అనర్హత వేటు వేయడంతో నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోస్టు ఖాళీ అయింది. దాదాపు మూడేళ్ల పాటు భూపతి రెడ్డి ఎమ్మెల్సీ గా ఉన్నారు. ఇప్పుడు ఎన్నిక జరిగినా దీని పదవీకాలం కేవలం రెండేళ్లు మాత్రమే ఉండనుంది. ఇప్పుడు కవిత గెలిచినా 2022 జనవరి నాటికి మళ్లీ ఎన్నికలకు వెళ్లాల్సి ఉంది. అందుకే ఈ పదవి పై ఎవరికీ పెద్దగా ఆసక్తి లేదు.

కవితను ఎంపిక చేసి…..

తొలుత నిజామాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి మాజీ స్పీకర్ సురేష్ రెడ్డిని ఎంపిక చేస్తారనుకున్నారు. అయితే ఆయనను రాజ్యసభకు ఎంపిక చేసి కేసీఆర్ అందరినీ ఆశ్చర్య పరిచారు. కుమార్తె కవితకు ఈ సీటు ఇచ్చారు. ఏప్రిల్ 7వ తేదీన ఈ స్థానానికి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే కరోనా విజృంభిస్తుండటంతో ఎన్నికను వాయిదా వేసింది. అప్పటి నుంచి ఈ స్థానానికి కవిత ఎంపిక అవుతారని అనుకున్న గులాబీ పార్టీ శ్రేణులు వాయిదా పడటంతో నిరాశలో మునిగిపోయాయి.

లాంఛనమే అయినా….

నిజామాబాద్ రాజకీయాల్లో కవిత తిరిగి చురుగ్గా పాల్గొంటారని ఆ జిల్లా పార్టీ నేతలు భావించారు. నిజానికి ఇక్కడ కవిత గెలుపు కష్టమేదీ కాదు. స్థానిక సంస్థల ఓటర్లు కవితకు మద్దతుగా 532 మంది ఉన్నారు. టీఆర్ఎస్, ఎంఐఎంలు కలిస్తే కవిత విజయం సునాయాసమే. కాంగ్రెస్ 140 మంది, బీజేపీ 85 మంది ఉన్నారు. 16 నెలలు మాత్రమే కాలపరిమితి ఉండే ఈ పదవి కోసం నెలల తరబడి వెయిట్ చేయడం టీఆర్ఎస్ శ్రేణులకు భారంగా మారింది. మొత్తం మీద కవిత పెద్దలసభలో అడుగు పెట్టాలంటే మరికొద్ది నెలలు వెయిట్ చేయక తప్పదు.

Tags:    

Similar News