కన్నా కాలర్ ఎత్తుకుని..?

బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు డిసెంబరు గండం పొంచి ఉంది. ఆయన పై ఇప్పటికే పార్టీలో వ్యతిరేక వర్గం పళ్లు నూరుతోంది. కన్నా లక్ష్మీనారాయణ వల్ల [more]

;

Update: 2019-11-28 11:00 GMT

బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు డిసెంబరు గండం పొంచి ఉంది. ఆయన పై ఇప్పటికే పార్టీలో వ్యతిరేక వర్గం పళ్లు నూరుతోంది. కన్నా లక్ష్మీనారాయణ వల్ల పార్టీకి పెద్దగా ఉప యోగం లేదని వాదించే నేతల సంఖ్య పార్టీలో పెరిగిపోతోంది. అందులో టీడీపీ నుంచి ఇటీవల వచ్చి చేరిన నేతలు కన్నా లక్ష్మీనారాయణను అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. మరి డిసెంబరు 15వ తేదన ఏపీ బీజేపీ అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కన్నా లక్ష్మీనారాయణ ఆ పదవిలో కొనసాగుతారా? లేదా? అన్న చర్చ జరుగుతోంది.

డిసెంబరు గండం…..

కన్నా లక్ష్మీనారాయణ ఏపీ బీజేపీ పదవి చేపట్టి కేవలం ఏడాది మాత్రమే గడిచింది. కన్నా కాపు సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో ఆయనను అధ్యక్షుడిగా నియమించి ఒక వర్గం ఓట్లను ఆకర్షించాలని బీజేపీ ఈ ప్లాన్ ను అమలుపర్చింది. అయితే బీజేపీకి నోటా కంటే ఓట్లు తక్కువగా వచ్చాయి. ఒక్క కన్నా లక్ష్మీనారాయణ పోటీ చేసిన నరసరావుపేట పార్లమెంటు పరిధిలోనే కొంత మెరుగైన ఓట్లు వచ్చాయి. దీంతో కన్నా లక్ష్మీనారాయణ కాలర్ ఎత్తుకుని తిరగగలిగారు.

కొత్త అధ్యక్షుడి ఎన్నిక…..

అయితే డిసెంబరు 15వ తేదీతో బీజేపీ అధ్యక్ష పదవి కాలపరిమితి ముగిసిపోతుంది. అదే రోజు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. వాస్తవానికి కన్నా లక్ష్మీనారాయణ ఎన్నికలకు ముందు వైసీపీలో చేరాలనుకున్నారు. ఆయన వెళ్లేందుకు సిద్ధమయిన సమయంలోనే అమిత్ షా నేరుగా ఫోన్ చేసి ఆయనను నిలువరించారు. బీజేపీలోకి వస్తే రాష్ట్ర అధ్యక్ష్య పదవి ఇస్తామని చెప్పి కన్నా లక్ష్మీనారాయణను వైసీపీలోకి వెళ్లకుండా ఆపారు. తర్వాత ఆ పదవి ఇచ్చి కన్నాను స్టేట్ లీడర్ గా చేశారు.

చేరికలు లేక…..

కానీ ఎన్నికల్లో బీజేపీ చతికలపడటం, బీజేపీలో చేరికలు పెద్దగా లేకపోవడంతో బీజేపీలో కొందరు నేతలు కన్నా ను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నుంచి ఇటీవల చేరిన నేతలు కన్నా లక్ష్మీనారాయణ నాయకత్వాన్ని అంగీకరించడం లేదు. మరోవైపు కన్నా సామాజిక వర్గానికి చెందిన నేతలు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బీజేపీ కేంద్ర నాయకత్వం కన్నా లక్ష్మీనారాయణను బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగిస్తుందా? లేదా? అన్న ఉత్కంఠ నెలకొంది. కన్నా లక్ష్మీనారాయణ మాత్రం తాను పదవి చేపట్టి ఏడాది మాత్రమే కాబట్టి, తనను తొలగించరన్న ధీమాతో ఉన్నారు.

Tags:    

Similar News