ఆ వూరి కరణం ఎప్పటికీ ఆయనే ?

కరణం అంటేనే చాలా కధ ఉంటుంది. గ్రామ పాలనకు పెద్దగా, పంచాయతీలు తేల్చే కర్తగా ఇప్పటికీ పాత రోజులను ప్రతీ వారూ గుర్తు చేసుకుంటారు. అన్న గారు [more]

Update: 2020-05-13 03:30 GMT

కరణం అంటేనే చాలా కధ ఉంటుంది. గ్రామ పాలనకు పెద్దగా, పంచాయతీలు తేల్చే కర్తగా ఇప్పటికీ పాత రోజులను ప్రతీ వారూ గుర్తు చేసుకుంటారు. అన్న గారు అధికారం చేపట్టాక గ్రామాల్లో కరణాలు, మునసబులు ఇంటికి పోయారు. ఆ వ్యవస్థకు ఆయన మంగళం పాడేశారు. ఇక ఇప్పటికీ ఎవరైనా గ్రామాల్లో బలంగా కనిపిస్తే కరణం అంటూ సంభోదిస్తారు. కానీ ఆయనకు ఆ పదవే ఇంటి పేరు అయింది. ఆయనే విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ. ఆయన చోడవరం ఎమ్మెల్యేగా దూసుకుపోతున్నారు. తన వర్గమేదో, పరవర్గమేదో గ్రహించి నడచుకుంటున్నారు. రాజకీయంగా తేడాపాడాలు కూడా గట్టిగానే తెలుసుకుని కాదేదీ రాజకీయానికి అనర్హం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

అలా షిఫ్ట్….

ఆయన మాడుగుల నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్సార్ టైంలో 2004 ఎన్నికల్లోఘన విజయం సాధించిన ఆయన 2014 నాటికి వైసీపీలో చేరి చోడవరానికి షిఫ్ట్ అయ్యారు. అక్కడ గత ఎన్నికల్లో పోటీ చేస్తే చాలా తక్కువ మెజారిటీతో ఓడిపోయారు. ఆయన ఓటమికి కారణం సొంత పార్టీలోని నాయకులేనని చెబుతారు. అక్కడ మాజీ మంత్రి బలిరెడ్డి సత్యారావు వర్గం ఆయన గెలుపును అడ్డుకుంది. ఇక 2019 నాటికి అన్ని రకాల విభేధాలను సర్దుకుని కరణం బరిలోకి దూకారు.దానికి జగన్ ప్రభంజనం కూడా తోడు కావడంతో విజయఢంకా మోగించారు.

ఎదురులేదా….

ఇక కరణం ధర్మశ్రీకి సొంత పార్టీలో ఎవరూ ప్రత్యర్ధులు లేరు. పార్టీలో తనను కాదని తల ఎగరవేసే సీన్ కూడా లేదు. దానికి తోడు తన అనుభవం, చాతుర్యం కలగలపి ఆయన వైసీపీని పటిష్టం చేస్తూ వస్తున్నారు. ఇక బలిరెడ్డి సత్యారావు కూడా మరణించడంతో ఆయన వర్గం కూడా కరణం ధర్మశ్రీ వెంటే నడుస్తోంది. కాపు సామాజికవర్గానికి చెందిన ధర్మశ్రీ మంచి వక్తగా పేరు తెచ్చుకున్నారు. జగన్ పక్షాన గట్టిగా వాణిని వినిపిస్తూ హై కమాండ్ దృష్టిలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయనకు ప్రత్యర్ధిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత కే ఎస్ ఎన్ రాజు కు సొంత పార్టీలోనే వర్గ పోరు సమస్యగా ఉంది. పైగా కులం కార్డ్ తో పచ్చ తమ్ముళ్ళు సొంత పార్టీలోనే చిచ్చు పెడుతున్నారు. రాజు తన కత్తితో తన పార్టీలొనే యుధ్ధం చేస్తున్నారు. ఇది కరణానికి కలసి వస్తోంది.

మంత్రిపై మోజు…

తాను సీనియర్ ఎమ్మెల్యేని అని, కాపు సామాజికవర్గానికి చెందినవాడినని కరణం ధర్మశ్రీ తన అర్హతలు చెప్పుకుంటున్నారు. జిల్లా రాజకీయాల మీద అవగాహన బాగా ఉందని కూడా అంటున్నారు. తనకు మంత్రి పదవి కనుక ఇస్తే పార్టీని గాడిలో పెడతాను అని ఆయన అంటున్నారు. అయితే ఇదే జిల్లాలో గుడివాడ అమరనాధ్ వంటి వారు కూడా పదవుల కోసం కాచుకుకూర్చున్నారు. దాంతో కరణం ఆశలు ఎంతవరకూ ఫలిస్తాయో తెలియదు కానీ 2024 ఎన్నికల్లోనూ మళ్ళీ గెలిచేలా చోడవరంలో పట్టు సాధించారు. తానే ఎప్పటికీ ఆ వూరికి కరణాన్ని అని నిబ్బరంగా చెబుతున్నారు.

Tags:    

Similar News