Addanki : కరణం కు ఈ సారి అదే ప్లస్ అవుతుందా?

అద్దంకి నియోజకవర్గంలో ఈసారి పోరు హోరాహోరీ కొనసాగనుంది. ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యే గొట్టి పాటి రవికుమార్ కు గెలుపు అంత సులువుకాదు. గతంలో మాదిరి ఆయన ఏ [more]

;

Update: 2021-10-28 08:00 GMT

అద్దంకి నియోజకవర్గంలో ఈసారి పోరు హోరాహోరీ కొనసాగనుంది. ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యే గొట్టి పాటి రవికుమార్ కు గెలుపు అంత సులువుకాదు. గతంలో మాదిరి ఆయన ఏ పార్టీలో ఉన్నా గెలిచే అవకాశాలు మాత్రం కన్పించడం లేదు. అద్దంకి నియోజకవర్గంలో వైసీపీ పట్టు సంపాదించడానికి ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా కరణం వెంకటేష్ ను రంగంలోకి దించాలని డిసైడ్ అయింది. అద్దంకి నియోజకవర్గం పూర్తి బాధ్యతలను కరణం వెంకటేష్ కు అప్పగించే పనిలో అధిష్టానం ఉన్నట్లు తెలిసింది.

గొట్టిపాటికి చెక్ పెట్టేందుకు…

అద్దంకి నియోజకవర్గంలో గొట్టిపాటి రవికుమార్ హ్యాట్రిక్ విజయాలను సాధించారు. 2009 లో కాంగ్రెస్ నుంచి, 2014లో వైసీపీ నుంచి 2019లో టీడీపీ నుంచి ఇలా మూడుసార్లు మూడు పార్టీల నుంచి పోటీ చేసి వరస విజయాలను అందుకున్నారు. అయితే 2014లో టీడీపీ కరణం వెంకటేష్ కు టిక్కెట్ ఇచ్చింది. కేవలం స్వల్ప ఓట్ల మెజారిటీతోనే ఓటమి పాలయ్యారు. కేవలం 3,500 ఓట్లతో మాత్రమే కరణం వెంకటేష్ ఓడిపోయారు.

మూడు సార్లు ఎమ్మెల్యేగా….

మూడు సార్ల నుంచి ఎమ్మెల్యేగా ఉంటున్న గొట్టిపాటి రవికుమార్ పై సహజంగానే ప్రజల్లో వ్యతిరేకత మొదలయింది. 2009లో తప్పించి ఆయన గెలిచినా ప్రతిపక్షంలోనే ఉంటున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ గుర్తు మీద గెలిచి టీడీపీలోకి వచ్చినా పెద్దగా నియోజకవర్గానికి చేసిందేమీ లేదంటున్నారు. దీనికి తోడు ఆయన వెంట ఉన్న నేతలకు ఆర్థిక ఇబ్బందులు కూడా మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో కరణం వెంకటేష్ కు పార్టీ పగ్గాలు అప్పగించాలని వైసీీప అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. బాచిన చైతన్యకు కూడా నామినేటెడ్ పదవి ఇచ్చారు.

ఇరవై ఏళ్ల నుంచి….

కరణం కుటుంబానికి అద్దంకి నియోజకవర్గంలో మంచి పట్టుంది. 2004లో కరణం బలరాం ఇక్కడి నుంచి గెలిచారు. అదే చివరిది. దాదాపు రెండు దశాబ్దాల నుంచి కరణం ఫ్యామిలీ గెలుపు కోసం ఎదురు చూస్తుంది. ఈ సారి ఆ కుటుంబానికి అవకాశమివ్వాలని అక్కడ ప్రధాన సామాజికవర్గం కూడా ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఇక్కడ పార్టీల కంటే వ్యక్తిగత ఇమేజ్ ఎక్కువగా ఉండటంతో ఈసారి గొట్టిపాటి కి గెలుపు అంత సులువు కాదని చెబుతున్నారు.

Tags:    

Similar News