ఇక వారికి గుడ్ న్యూస్… సంతృప్తి పర్చటానికే?

పార్టీలో ఉన్న అసంతృప్తులను తొలగించేందుకు, నేతల్లో ఉత్సాహం నింపేందుకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిద్దమయ్యారు. త్వరలో నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలని నిర్ణయించారు. రెండోసారి పార్టీ అధికారంలోకి [more]

Update: 2021-02-19 09:30 GMT

పార్టీలో ఉన్న అసంతృప్తులను తొలగించేందుకు, నేతల్లో ఉత్సాహం నింపేందుకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిద్దమయ్యారు. త్వరలో నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలని నిర్ణయించారు. రెండోసారి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవులను పెద్దగా భర్తీ చేయలేదు. ఎమ్మెల్సీలను కూడా సామాజిక సమీకరణాల కారణంగా కొందరికి ఇవ్వాల్సి వచ్చింది. దీంతో సీనియర్ నేతలు కొందరు అసంతృప్తితో ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా పెద్దగా పాల్గొనడం లేదు.

కరోనా, ఎన్నికలతో…..

మొన్నటి వరకూ కరోనా ఉన్న కారణంగా నామినేటెడ్ పోస్టులపై కేసీఆర్ దృష్టి పెట్టలేదు. ఆ తర్వాత వరసగా దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల హడావిడితో ఉన్న కేసీఆర్ నామినేటెడ్ పోస్టుల భర్తీని పట్టించుకోలేదు. చాలా మంది చాలా కాలంగా నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారు. నేరుగా కేసీఆర్ ను కలసి అడిగే శక్తి కూడా నేతలకు లేదు. దీంతో తమ పని తాము చూసుకుంటున్నారు. దీంతో అనేక ప్రాంతాల్లో టీఆర్ఎస్ బలహీనపడే ప్రమాదం ఉందని కేసీఆర్ గుర్తించారు.

బలోపేతం కావాలంటే…?

పార్టీని బలోపేతం చేయాలంటే ముందుగా నేతలను సంతృప్తి పర్చాల్సి ఉంటుంది. అందుకే త్వరలోనే నామినేటెడ్ పోస్టుల భర్తీకి కేసీఆర్ రెడీ అయ్యారంటున్నారు. ఇటీవలే సునీతా లక్ష్మారెడ్డికి మహిళ ఛైర్ పర్సన్ పదవిని ఇచ్చిన సంగతి తెలిసిందే. వీరిలో పార్టీ ప్రారంభం నుంచి ఉన్నవారు కొందరైతే, పార్టీ ప్రయోజనాల దృష్ట్యా ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్ లో చేరిన వారు కూడా ఉన్నారు. వీరందరికీ ఏదో ఒక పదవి అప్పగించే యోచనలో కేసీఆర్ ఉన్నారు.

కొన్ని కీలక పోస్టులను….

నామినేటెడ్ పోస్టుల పదవీకాలం కొందరికి పూర్తయినా వారి స్థానంలో ఎవరినీ కేసీఆర్ నియమించలేదు. ట్రైకార్ ఛైర్మన్, మహిళ ఆర్థిక సంస్థ ఛైర్మన్, ఆగ్రోస్ ఛైర్మన్, గొర్రెల పెంపకం దారుల అభివృద్ధి సంస్థ ఛైర్మన్, హస్త కళల అభివృద్ధి సంస్థ, ఖాదీ గ్రామీణాభివృద్ధి సంస్థ వంటి వాటిలో పదవులను భర్తీ చేయాల్సి ఉంది. త్వరలోనే ఈ పోస్టులన్నింటినీ భర్తీ చేసి నేతలను సంతృప్తి పర్చాలని కేసీఆర్ నిర్ణయించారు.

Tags:    

Similar News