Tdp : కేఈ దానిని కూడా వదిలేశారా?

అసలే అంతంత మాత్రంగా ఉన్న పార్టీని వచ్చే ఎన్నికల్లో గెలిపించేందుకు నేతలు పోరాడాల్సి ఉంటుంది. కానీ టీడీపీ నేతలు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. తమకు పట్టున్న [more]

;

Update: 2021-10-20 13:30 GMT

అసలే అంతంత మాత్రంగా ఉన్న పార్టీని వచ్చే ఎన్నికల్లో గెలిపించేందుకు నేతలు పోరాడాల్సి ఉంటుంది. కానీ టీడీపీ నేతలు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. తమకు పట్టున్న ప్రాంతంలో ఈసారి పోటీ చేసేందుకు సమాయత్తమవుతున్నారు. ఇందుకు కర్నూలు జిల్లాలో కేఈ కుటుంబమే ఉదాహరణ. కర్నూలు జిల్లాలో కేఈ కుటుంబానికి పత్తికొండ, డోన్ లో పట్టుండేది. గత ఎన్నికల్లో రెండు చోట్ల కేఈ కుటుంబం ఓటమి పాలయింది.

డోన్ ఇన్ ఛార్జిగా….

డోన్ లో కేఈ ప్రతాప్ పోటీ చేసి ఓటమి పాలుకాగా, పత్తికొండలో కేఈ శ్యాంబాబు ఘోర పరాజయం పాలయ్యారు. డోన్ లో గత రెండుసార్లుగా బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి గెలుస్తుండటం, అక్కడ పాతుకుపోవడంతో కేఈ కుటుంబానికి గ్రిప్ పోయింది. కేఈ శ్యాంబాబును కాదని ఇటీవల కేఈ ప్రభాకర్ ను డోన్ ఇన్ ఛార్జిగా నియమించారు. తొలి నాళ్లలో కేఈ ప్రభాకర డోన్ నియోజకవర్గంలో కొంత హడావిడి చేసినా తర్వాత మామూలయింది.

డోన్ లో నెగ్గలేమని….

వచ్చే ఎన్నికలలో తాను డోన్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని కేఈ ప్రభాకర్ ప్రకటించారు కూడా. అయితే డోన్ తనకు కలసి రాదని కేఈ ప్రభాకర్ భావిస్తున్నారు. అందుకోసం ఆయన నియోజకవర్గాన్ని మార్చేయాలని నిర్ణయించుకున్నారని తెలిసింది. ఆలూరు నియోజకవర్గమయితే తనకు సేఫ్ గా ఉంటుందని కేఈ ప్రభాకర్ భావిస్తున్నారు. అందుకే తరచుగా ఆలూరులో ఆయన పర్యటనలు చేస్తున్నారు. ఇది వివాదంగా మారింది.

ఆలూరు వైపు…

ఆలూరులో కోట్ల సుజాతమ్మ ఇన్ ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఆలూరు బీసీలకు కొంత అడ్వాంటేజీ ఉంటుందని కేఈ ప్రభాకర్ అంచనా వేస్తున్నారు. అందుకే నియోజకవర్గంలో తన వర్గం వారితో సమావేశమవుతున్నారు. దీనిపై కోట్ల సుజాతమ్మ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి కి వార్నింగ్ ఇచ్చినట్లుగానే ఇతరుల నియోజకవర్గాల్లో జోక్యం చేసుకోవద్దని కేఈకి కూడా వార్నింగ్ ఇస్తారో? లేదో? చూడాలి.

Tags:    

Similar News