ఇక్కడ కూడా గల్లంతయితే?
కేరళ ఎన్నికలు ముగిశాయి. ఇక్కడ ఎల్డీఎఫ్, యూడీఎఫ్ హోరాహోరీ తలపడ్డాయి. గెలుపోటములపై దేశ వ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేరళ లో ఈసారి కూడా పినరయి విజయన్ [more]
;
కేరళ ఎన్నికలు ముగిశాయి. ఇక్కడ ఎల్డీఎఫ్, యూడీఎఫ్ హోరాహోరీ తలపడ్డాయి. గెలుపోటములపై దేశ వ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేరళ లో ఈసారి కూడా పినరయి విజయన్ [more]
కేరళ ఎన్నికలు ముగిశాయి. ఇక్కడ ఎల్డీఎఫ్, యూడీఎఫ్ హోరాహోరీ తలపడ్డాయి. గెలుపోటములపై దేశ వ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేరళ లో ఈసారి కూడా పినరయి విజయన్ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వస్తుందని చెబుతున్నారు. ఎల్డీఎఫ్ కు కూడా అదే స్థాయిలో ఛాన్స్ ఉందంటున్నారు. కేరళ ఒక్కటే ఇప్పుడు కమ్యునిస్టులకు ఆశాకిరణంగా ఉంది. దేశ వ్యాప్తంగా కమ్యునిస్టు పార్టీలు కనుమరుగవుతున్న సమయంలో కేరళలో గెలుపుతో తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు.
పట్టున్న రాష్ట్రాల్లో…..
గతంలో పశ్చిమ బెంగాల్, కేరళ, త్రిపుర వంటి రాష్ట్రాల్లో కమ్యునిస్టు పార్టీలు బలంగా ఉండేవి. త్రిపురలో బీజేపీ కమ్యునిస్టుల కంచుకోటను బద్దలు కొట్టేసింది. ఇంకా అనేక రాష్ట్రాల్లోనూ బలంగానే ఉండేవి, కొద్దోగొప్పో ప్రభావం చూపేవి. వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుని కమ్యునిస్టు పార్టీలు అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించేవి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ, ఆ తర్వాత తెలంగాణలోనూ కమ్యునిస్టు పార్టీలకు శాసనసభలో ప్రాతినిధ్యం లభించింది.
ప్రభావం చూపే….
ఇక పదేళ్ల ముందు వరకూ పశ్చిమ బెంగాల్ కమ్యునిస్టులకు కంచుకోటగా ఉండేది. కానీ మమత బెనర్జీ దెబ్బకు పదేళ్ల నుంచి అధికారానికి దూరమయ్యాయి. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లోనూ కమ్యునిస్టు పార్టీ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. కాకుంటే తమ బలాన్ని పెంచుకునే ప్రయత్నంలో కమ్యునిస్టు పార్టీలు ఉన్నాయి. ఈసారి పశ్చిమ బెంగాల్ లోనూ కమ్యూనిస్టు పార్టీలు బాగానే ప్రభావం చూపనున్నాయని విశ్లేషణలు వెలువడుతున్నాయి.
కేరళలో విజయం తమదేనంటూ….
ఇక కేరళ ఒక్కటే సీపీఎంకు ఆశాకిరణంగా ఉంది. ఇక్కడ అధికారంలోకి రాకపోతే దేశంలో ఖాళీ అయినట్లే. అందుకే కేరళపై సీపీఎం పార్టీ పెద్ద ఆశలు పెట్టుకుంది. ఒపీనియన్ పోల్స్ కూడా ఎల్డీఎఫ్ కే సానుకూలంగా ఉండటంతో దేశంలో తమ పార్టీ ఒక్కచోటైనా అధికారంలోకి వస్తుందని నమ్ముతున్నారు. మొత్తం మీద దేశ వ్యాప్తంగా కేరళపైనే వారు నమ్మకం పెట్టుకున్నారు. కమ్యునిస్టు పార్టీలు తమ ఉనికిని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.