ఆవేశంలో ఉన్న రెడ్డి శపథాలు నెరవేరతాయా?
కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యల్లో అర్థముంది. ఆయన ఆవేదనలో కొంత నిజముంది. ఇన్నాళ్లూ పార్టీకి చేసిన సేవకు తగిన ఫలితం దక్కలేదన్నది ఆయన ఆక్రోశం. నిజమే కోమటిరెడ్డి [more]
;
కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యల్లో అర్థముంది. ఆయన ఆవేదనలో కొంత నిజముంది. ఇన్నాళ్లూ పార్టీకి చేసిన సేవకు తగిన ఫలితం దక్కలేదన్నది ఆయన ఆక్రోశం. నిజమే కోమటిరెడ్డి [more]
కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యల్లో అర్థముంది. ఆయన ఆవేదనలో కొంత నిజముంది. ఇన్నాళ్లూ పార్టీకి చేసిన సేవకు తగిన ఫలితం దక్కలేదన్నది ఆయన ఆక్రోశం. నిజమే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ లో సీనియర్ నేత. తొలి నుంచి కాంగ్రెస్ పార్టీనే నమ్ముకున్నారు. ఇద్దరు సోదరులు నల్లగొండ జిల్లాలో పార్టీకి వెన్నుదన్నుగా నిలిచారు. కష్టకాలంలో గత ఏడేళ్ల నుంచి కోమటిరెడ్డి సోదరులు పార్టీకి బాగానే ఉపయోగపడ్డారు.
ఆవేశం ఎంతోకాలం….
గాంధీ భవన్ గడప తొక్కనన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆవేశం ఎంతోకాలం ఉంటుందని అనుకోకూడదు. తనకు పీసీసీ చీఫ్ పదవి దక్కలేదన్న ఆగ్రహంతో కొన్ని పరుష వ్యాఖ్యలు చేసి ఉండకపోవచ్చు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ మారే ఆలోచన కూడా చేయకపోవచ్చు. కాంగ్రెస్ పార్టీలో ఏఐసీసీ, సీడబ్ల్యూసీలో పదవులు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి దక్కే అవకాశాలున్నాయి. దీంతో ఆయన అన్నీ మర్చిపోయి గాంధీభవన్ గడప ఎక్కవచ్చు.
అనేక మంది సీనియర్ నేతలు…..
నిజానికి రేవంత్ రెడ్డికంటే కాంగ్రెస్ లో అనేకమంది సీనియర్ నేతలున్నారు. పార్టీనే నమ్ముకుంటూ అధికారంలో లేకపోయినా కొనసాగుతూనే ఉన్నవారు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పట్ల, గాంధీ కుటుంబం పట్ల విధేయతను కనపర్చే వారు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. సహజంగా ఆయన పీసీసీ చీఫ్ పదవి దక్కుతుందని ఎంతో ఆశపెట్టుకున్నారు. ఆర్థికంగా, సామాజికపరంగా కూడా తనకు అడ్వాంటేజీ ఉండటంతో ఆయన తనకు ఈసారి ఛాన్స్ దక్కుతుందన్నారు.
వేరే అవకాశం లేదు….
కానీ అనూహ్యంగా రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఇవ్వడంతో కొంత ఆశ్చర్యానికి గురయ్యారు. అందుకే అమ్ముకున్నారని వ్యాఖ్యానించారు. ఇవన్నీ వేడి మీద చేసిన వ్యాఖ్యలే. కకోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ ను వీడి బీజేపీలోకి వెళ్లలేరు. టీఆర్ఎస్ లోకి కూడా అవకాశం లేదు. దీంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కాంగ్రెస్ పార్టీలో ఉండటం తప్ప మరో అవకాశం లేదు. ఇవన్నీ వారం,పదిరోజుల్లో సెట్ అవుతాయన్నది వాస్తవం.