పెద్దాయనకు దర్జా తగ్గిపోలేదూ..!!
రాజకీయాల్లో ఒక్క ఐడియా చాలు అవకాశాలు అందుకోవడానికి, పాతాళానికి దిగజారడానికి, విశాఖ జిల్లాలో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ విషయంలో ఇది చక్కగా సరిపోతుంది. కాంగ్రెస్ లో [more]
;
రాజకీయాల్లో ఒక్క ఐడియా చాలు అవకాశాలు అందుకోవడానికి, పాతాళానికి దిగజారడానికి, విశాఖ జిల్లాలో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ విషయంలో ఇది చక్కగా సరిపోతుంది. కాంగ్రెస్ లో [more]
రాజకీయాల్లో ఒక్క ఐడియా చాలు అవకాశాలు అందుకోవడానికి, పాతాళానికి దిగజారడానికి, విశాఖ జిల్లాలో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ విషయంలో ఇది చక్కగా సరిపోతుంది. కాంగ్రెస్ లో పుట్టి అందులో పెద్ద అయిన కొణతాల జగన్ పార్టీలో ఎన్నికల ముందు చేరాలనుకున్నారు. కానీ మనసు మార్చుకుని చంద్రబాబు కోసం ఉండవల్లి వెళ్ళి మరీ కండువా కప్పుకున్నారు. అంతే ఇపుడు మరో అయిదేళ్ల పాటు రాజకీయ మాజీగా మారాల్సివచ్చింది. 1989లో కేవలం తొమ్మిది ఓట్ల తేడాతో ఎంపీ అయిన రాజకీయ అదృష్టవంతుడు కొణతాల ఇపుడు అదే లక్కు వెక్కిరించేసరికి వనవాసం చేయల్సివస్తోంది.
జగన్ పక్కన ఉంటే ….
వైఎస్సార్ మరణం తరువాత జగన్ వెంట ఉన్న కొణతాలకు వైసీపీలో పొలిటికల్ అడ్వైజర్ కమిటీలో మెంబర్ గా ఉన్నత స్థానం జగన్ కల్పించారు. ఉత్తరాంధ్ర జిల్లాల కీలకబాధ్యతలు అప్పగించారు. అయితే తన తల్లి విజయమ్మను విశాఖలో గెలిపించే బాధ్యతలు జగన్ అప్పగిస్తే లోపాయికారీగా టీడీపీతో అవగాహన పెట్టుకుని సరిగ్గా పనిచేయలేదని ఆరోపణలు వచ్చాయి. తన తల్లి ఓటమి పాలు కావడంతో జగన్ తీవ్ర మనస్తాపం చెందారు. అక్కడే కొణతాల రామకృష్ణకు బెడిసికొట్టింది. అంతే వైసీపీ నుంచి దూరం కావాల్సివచ్చింది. అయిదేళ్ళు గిర్రున గడచిపోయాయి. తాజా ఎన్నికలకు ముందు వైసీపీలో చేరమని కేడర్ వత్తిడి చేయడంతో కొణతాల లోటస్ పాండ్ గడప తొక్కారు. కొణతాలను జగన్ కూడా క్షమించేశారు. అయితే చివరి నిముషంలో మనసు మార్చుకుని కండువా కప్పుకోకుండా వచ్చేశారు. అదే ఇపుడు కొణతాల రాజకీయ జీవితాన్ని తల్లకిందులు చేసింది.
లేఖలు రాసుకుంటూ ….
ఇపుడు కొణతాల రామకృష్ణ పరిస్థితి ఎలా ఉందంటే ఉత్తరాంధ్ర సమస్యలపై ముఖ్యమంత్రి జగన్ గారూ అనుకుంటూ లేఖలు రాసుకోవడానికే సరిపోతోంది. అదే జగన్ని నమ్ముకుని ఉంటే, పార్టీకి చిత్తశుద్ధితో పనిచేసే సీనియర్ నేతగా ఈపాటికి కొణతాల విశాఖ జిల్లా మంత్రి అయ్యేవారని అంటున్నారు. జగన్ మనసు మార్చుకుని పార్టీలోకి తీసుకుందామనుకున్నా కొణతాల వెనక్కు పోవడం అంటే తన రాజకీయానికి తానే బ్రేకులు వేసుకున్నారని అంటున్నారు. మొత్తానికి ఒకనాడు జిల్లాలో చక్రం తిప్పిన ఈ మాజీ మంత్రి దర్జా తగ్గిపోయిందని సాక్షాత్తు అనుచరులే బాధపడుతున్నారు. మరో అయిదేళ్ళకు రాజకీయాలు ఎలా ఉంటాయో ఏమో ఎవరికి తెలుసు అంటున్నారు. అంటే కొణతాల పొలిటికల్ కెరీర్ కి డెడ్ ఎండ్ పడినట్లేనని చెప్పకనే చెప్పేస్తున్నారు.
.