కేవీపీ జగన్ కు దగ్గరవుతున్నారా?

జగన్ ఒక్కడుగా కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి సొంతంగా పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయ్యారు. రెండున్నరేళ్ల పాలనను సునాయాసంగా పూర్తి చేశారు. ఇప్పటిదాకా ఢీ కొట్టే వారు [more]

Update: 2021-08-22 13:30 GMT

జగన్ ఒక్కడుగా కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి సొంతంగా పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయ్యారు. రెండున్నరేళ్ల పాలనను సునాయాసంగా పూర్తి చేశారు. ఇప్పటిదాకా ఢీ కొట్టే వారు ఏపీ విపక్షంలోనూ లేరు అనే చెప్పాలి. అయితే జగన్ ముఖ్యమంత్రి సినిమా ఇంటర్వెల్ దాకానే వచ్చింది. సహజంగానే ఇంటర్వల్ తరువాతనే బిగ్ ట్విస్టులు ఉంటాయి. అందువల్ల జగన్ రెండవ అర్ధ భాగం ఎలా పూర్తి చేస్తారు. వచ్చే ఎన్నికలకు ఎలా పార్టీని ప్రభుత్వాన్ని ప్రిపేర్ చేస్తారు అన్నది సర్వత్రా ఆసక్తిని కలిగించే విషయమే.

జగన్ వినాల్సిందే…

జగన్ కి తండ్రి వైఎస్సార్ పెద్ద కుటుంబాన్నే ఇచ్చారు. అలాగే కాంగ్రెస్ లోని ఆయనకు ప్రాణంగా భావించే దోస్తులు కూడా ఉన్నారు. జగన్ మాత్రం ప్రజలనే పెద్ద కుటుంబాన్నే తీసుకున్నారు కానీ తండ్రి స్నేహితులను హితులను దగ్గరకు రానీయలేదు. ఈ నేపధ్యంలో వైఎస్సార్ ఆత్మగా భావించే కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు జగన్ మీద ఒక మీడియా భేటీలో సంచలన కామెంట్స్ చేశారు. జగన్ సీఎం అయ్యాక తాను దూరంగానే ఉంటూ వస్తున్నానని కూడా కేవీపీ చెప్పడం విశేషం. జగన్ కి ప్రజాబలం ఉందని చెబుతూనే జగన్ పాలనలోని లోపాలను ఆయన ఇండైరెక్ట్ గా ఎత్తి చూపారు. జగన్ ప్రతీ విషయాన్ని సీనియర్లతో, మంత్రులతో చర్చించాలని ఆయన పరోక్షంగా సూచించారు.

వైఎస్సార్ అలా …

వైఎస్సార్ ఏ రోజూ కీలకమైన విషయాలలో సీనియర్లను పక్కన పెట్టిన దాఖలాలు లేవని కేవీపీ అంటున్నారు. అందుకే ఆయన అతి పెద్ద నిర్ణయాలు తీసుకున్నా వివాదాలు రాలేదు అని కేవీపీ గుర్తుచేశారు. జగన్ కూడా అలాగే చేయాలన్నది కేవీపీ సూచనగానే చూడాలి. కోర్టుల వద్ద జగన్ సర్కార్ నిర్ణయాలు అన్నీ కూడా వీగిపోవడం వెనక చర్చలు సలహాలు లేకుండా నిర్ణయాలు తీసుకోవడమే కారణంగా కేవీపీ భావనగా చెప్పుకోవాలి. ఇక వైఎస్సార్, జగన్ ఎపుడూ కూడా విపక్షాలకు టార్గెట్ గా ఉన్నారు అంటే అది వారి ప్రజాబలం వల్లనే అని కూడా ఆయన విశ్లేషించారు.

జగన్ మళ్ళీ సీఎం…

కేవీపీ మాటలను జాగ్రత్తగా చూస్తే మాత్రం ఏపీలో కాంగ్రెస్ ఇప్పట్లో అధికారంలోకి రాకపోవచ్చు. అదే సమయంలో జాగ్రత్తగా చేసుకుంటే 2024 ఎన్నికల్లో జగన్ మళ్లీ అధికారంలోకి రావచ్చు. జగన్ కి అపరిమితమైన ప్రజాబలం ఉంది. అయితే అదొక్కటే చాలదు, పాలనా పరమైన లోపాలను సవరించుకోవాలి. సమిష్టి నిర్ణయాలు పార్టీలో, ప్రభుత్వంలో ఉండాలి.ఇదే కేవీపీ నేరుగా చెప్పకపోయినా ఏపీ రాజకీయాల గురించి, జగన్ గురించి చెప్పారనుకోవాలి. మరి వైఎస్సార్ చిరకాల మిత్రుడు, జగన్ ని చిన్నతనం నుంచి ఎరిగిన వారు. ఆయన కంటే జగన్ గురించి తెలిసిన వారు కూడా ఎవరూ లేరు. మరి మామ చెప్పిన మంచి మాటలను జగన్ పాటిస్తారా. చూడాలి.

Tags:    

Similar News