“లావు” ను వదిలిపెట్టడం లేదటగా?

లావు శ్రీకృష్ణదేవరాయలు తొలిసారిగా పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. సీనియర్ నేత రాయపాటి సాంబశివరావును ఓడించి మరీ ఆయన విజయం సాధించారు. దీంతో యువకుడిగా ఆయన నియోజకవర్గంలో బాగానే [more]

;

Update: 2020-10-04 15:30 GMT

లావు శ్రీకృష్ణదేవరాయలు తొలిసారిగా పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. సీనియర్ నేత రాయపాటి సాంబశివరావును ఓడించి మరీ ఆయన విజయం సాధించారు. దీంతో యువకుడిగా ఆయన నియోజకవర్గంలో బాగానే పర్యటిస్తున్నారు. ప్రజా సమస్యల పట్ల స్పందనలోనూ లావు శ్రీకృష్ణ దేవరాయలు ముందుంటారన్నది వాస్తవం. గుంటూరు జిల్లా కావడం, కమ్మ సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో లావు శ్రీకృష్ణ దేవరాయలుకు జగన్ కూడా అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు.

ప్రజలకు హామీ ఇచ్చినా…..

లావు శ్రీకృష్ణ దేవరాయలు ప్రతి విషయాన్ని అధ్యయనం చేసి మాట్లాడతారన్న పేరుంది. ఊరికే ప్రజలకు హామీ కూడా ఇవ్వరు. ఆ పని పూర్తవుతుందనకుంటేనే లావు శ్రీకృష్ణ దేవరాయలు ప్రజల ముందుకు వెళతారు. లేదంటే నిర్మొహమాటంగా ఇది తాను చేయలేనని చెప్పేస్తారు. ఇటీవల లావు శ్రీకృష్ణ దేవరాయలు వద్దకు వెళ్లే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. జగన్ వద్ద మంచి మార్కులుండటంతో ఎక్కువ మంది నేతలు ఆయననే ఆశ్రయిస్తున్నారు.

నమ్మకం ఏర్పడటంతో….

తమ గ్రామానికి పని కావాలంటే లావు శ్రీకృష్ణ దేవరాయలుతోనే అవుతుందన్న నమ్మకం ఏర్పడింది. ఎమ్మెల్యేల కన్నా ఎక్కువగా అందుబాటులో ఉంటుండటం కూడా ఆయనకు ప్లస్ అనే చెప్పాలి. ఎమ్మెల్యే అపాయింట్ మెంట్ దొరకదు కాని లావు శ్రీకృష్ణ దేవరాయలు మాత్రం వెంటనే రమ్మని చెబుతారన్నది నియోజకవర్గంలో విన్పిస్తున్న టాక్. అందుకే ఇప్పుడు నరసరావుపేట నియోజకవర్గంలో లావు శ్రీకృష్ణ దేవరాయలు వద్దకే ఎక్కువ మంది క్యూ కడుతున్నారంటున్నారు.

ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నా…..

అయితే లావు శ్రీకృష్ణ దేవరాయలును ఎమ్మెల్యేలు పక్కన పెడుతున్నారు. ఎంపీ దూసుకుపోతుండటం, తమ వైరి వర్గాలను ప్రోత్సహిస్తుండంతో చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ, వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఎంపీ పై కారాలు మిరియాలు నూరుతున్నారు. తమ నియోజకవర్గాలకు కూడా ఆహ్వానించడం లేదు. అయినా ఈ రెండు నియోజకవర్గాల నుంచే ఎక్కువ మంది లావు శ్రీకృష్ణ దేవరాయల వద్దకు వస్తుండటం గమనార్హం. మొత్తం మీద ఈ యువ ఎంపీ నరసరావు పేట నియోజకవర్గంలో హాట్ హాట్ గా మారారు.

Tags:    

Similar News