వైసిపి బ్యాటింగ్ … బిజెపి క్యాచ్
ఎపి రాజకీయాల్లో చిత్రమైన పరిస్థితి నడుస్తుంది. వైసిపి ధాటికి టిడిపి తమ్ముళ్ళు బెంబేలెత్తి పోతున్నారు. పోనీ ఆ పార్టీలో చేరదామంటే జగన్ డోర్లు క్లోజ్ చేసి మరి [more]
ఎపి రాజకీయాల్లో చిత్రమైన పరిస్థితి నడుస్తుంది. వైసిపి ధాటికి టిడిపి తమ్ముళ్ళు బెంబేలెత్తి పోతున్నారు. పోనీ ఆ పార్టీలో చేరదామంటే జగన్ డోర్లు క్లోజ్ చేసి మరి [more]
ఎపి రాజకీయాల్లో చిత్రమైన పరిస్థితి నడుస్తుంది. వైసిపి ధాటికి టిడిపి తమ్ముళ్ళు బెంబేలెత్తి పోతున్నారు. పోనీ ఆ పార్టీలో చేరదామంటే జగన్ డోర్లు క్లోజ్ చేసి మరి కొట్టేస్తున్నారు. దాంతో తమ్ముళ్లకు కాషాయదళంలో చేరి షెల్టర్ తీసుకోవడం ఒక్కటే మార్గం కింద కనిపిస్తుంది. ఎంపిలతో మొదలై ఎమ్యెల్యేలు, మాజీ ఎమ్యెల్యేల వరకు ఫ్యాన్ గాలికి వణికిపోతూ జై మోడీ అనక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఏపీలో జీరో స్థాయికి చేరిపోయిన కాషాయ దళం ఈ అవకాశాన్ని పూర్తి గా ఆస్వాదిస్తోంది. అధికార వైసిపి వారు ఎంత టిడిపిని టార్చర్ పెడితే అంతా తమకే లాభమని సంబర పడుతుంది.
మరింత దీనంగా పసుపు కోట …
టిడిపి కోట పూర్తిగా కూలిపోయే దశకు చేరుకుంది. అధికారం దూరం కావడం ఒక్కటే కాదు గత ప్రభుత్వం చేసిన తప్పులన్నిటికి జగన్ శిక్షలు విధించేందుకు దూకుడు మీద వున్నారు. దాంతో తప్పని పరిస్థితుల్లో చంద్రబాబే సన్నిహితులను ముఖ్యంగా తనకు చాలా కాలంగా ఆర్ధికంగా దన్నుగా నిలిచిన వారిని కమలంలో చేరిపోండి అని చెప్పినట్లు నడుస్తున్న ప్రచారం రోజు రోజుకు ఎక్కువైంది. ఇది మరోరకంగా బాబును భవిష్యత్తులో ఇబ్బంది పెట్టె అవకాశాలు వున్నాయి. బిజెపి లో చేరి మౌనంగా ఉంటే సరిపోదు వచ్చిన నేతలు ఆ పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయాలి. అలా చేస్తే టిడిపి మరింత బలహీనపడటం ఖాయం. దాంతో ఎటు అడుగులు వేయడమా అన్న డైలమాలో టిడిపి అధిష్టానం కొట్టుమిట్టాడుతోంది.