వచ్చి సరే… ఉండి కూడా తప్పు చేస్తున్నామా…?
రాజకీయాలలో ఒక పార్టీ నుంచి మరో పార్టికి మారడం .. ఒక గుర్తుపై గెలిచి మరో గుర్త పార్టీని అంటిపెట్టుకోవడం కామన్‌గా మారిపోయింది. అవకాశం.. అవసరం.. రెండు [more]
;
రాజకీయాలలో ఒక పార్టీ నుంచి మరో పార్టికి మారడం .. ఒక గుర్తుపై గెలిచి మరో గుర్త పార్టీని అంటిపెట్టుకోవడం కామన్‌గా మారిపోయింది. అవకాశం.. అవసరం.. రెండు [more]
రాజకీయాలలో ఒక పార్టీ నుంచి మరో పార్టికి మారడం .. ఒక గుర్తుపై గెలిచి మరో గుర్త పార్టీని అంటిపెట్టుకోవడం కామన్‌గా మారిపోయింది. అవకాశం.. అవసరం.. రెండు కారణంగా.. నాయకులు ఇలాంటి జంపింగులకు అలవాటు పడిన నేపథ్యంలో ప్రజలు కూడా లైట్ తీసుకుంటున్నారు. మన తెలుగు రాజకీయాల్లో 24 గంటల్లో మూడు ప్రాధాన పార్టీలు మారి ఈ రోజు ఎమ్మెల్యేలు అయిన నేతలు కూడా ఉన్నారు. ఇలా.. 2017-19 మధ్య కాలంలో వైసీపీ నుంచి జంప్ చేసిన నేతలు.. చాలా మంది టీడీపీలో చేరారు. గత ఎన్నికల్లో వీరంతా దాదాపు టికెట్లు తెచ్చుకుని పోటీ చేశారు. అయితే.. వైసీపీ సునామీ కారణంగా ఓడిపోయారు. ఇక, అప్పటి నుంచి పార్టీలో గుర్తింపు లేకుండా పోయిందనే ఆవేదన వీరిలో కనిపిస్తోంది.
ప్రాధాన్యత ఇవ్వక….
టీడీపీలో కీలక పదవుల విషయంలో జంపింగులకు చంద్రబాబు అవకాశం ఇవ్వలేదు. పార్టీలో నియామకాలు చేపట్టినా జంపింగు నేతలకు.. ముఖ్యంగా గిరిజన, ఎస్సీ ప్రాంతాల్లోని వారికి కూడా ప్రాధాన్యం లేకుండా చేశారు. దీంతో జంపింగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గొట్టిపాటి రవికుమార్ లాంటి నేతలు ఓటమి లేకుండా వరుసగా విజయాలు సాధిస్తూ వస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీలోకి వచ్చిన జంపింగ్‌లు అందరూ ఓడిపోయినా రవి మాత్రం గెలిచారు. అలాంటి నేతకు ఏ పీఏసీ పదవి ఇవ్వడమో లేదా ఇతర కీలక పదవులు కట్టబెట్టడమో చేయాల్సి ఉన్నా చేయలేదని ఆయన వర్గం వాపోతోంది.
ఎవరూ పట్టించుకో్క…..
ఇక ఇప్పటికే టీడీపీలో స్థిరపడిన నాయకులు ఎవరూ కూడా వీరిని పట్టించుకోవడం లేదు. దీంతో ఉండాలా ? వద్దా ? అనే మీమాంసలో నాయకులు నలిగిపోతున్నారనేది వాస్తవం. కానీ, ఇప్పటికిప్పుడు ఎటూ నిర్ణయం తీసుకోలేని వారు కూడా ఉన్నారు. అరకు, బొబ్బిలి, రంపచోడవరం, పాడేరు, పామర్రు, విజయవాడ వెస్ట్.. ఇలా అనేక నియోజకవర్గాల్లో నాయకుల పరిస్థితి ఇలానే ఉంది. బొబ్బిలిలో మాజీ మంత్రి సుజయ్ కృష్ణ, పలమనేరులో మరో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి కూడా రాజకీయ భవిష్యత్తు కోసం సరైన నిర్ణయకోసమే వెయిటింగ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది.
సీమ నుంచి మాత్రం…
సీమలోని కొన్ని జిల్లాల్లో మాత్రం జంపింగులు మళ్లీ.. వైసీపీలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వారు స్థానికంగా ఉన్న నేతలను మచ్చిక చేసుకుంటున్నారు. ఎందుకంటే.. గత ఎన్నికల్లో సీమలో టీడీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. కీలక నియోజకవర్గాల్లో కూడా పార్టీ గెలుపు గుర్రం ఎక్కలేదు. ఇక, ఇప్పుడు కూడా టీడీపీ పుంజుకునే పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. దీంతో ఈ నాలుగు జిల్లాల్లో నేతలు.. చాలా మంది పార్టీ మారిపోయి.. వైసీపీ గూటికి చేరుకుంటే..ఏదొ ఒక నామినేటెడ్ పదవైనా.. దక్కుతుందని అనుకుంటున్నారు. కానీ, ఇప్పటికిప్పుడు మాత్రం ఆ పరిస్థితి ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం. దీంతో వైసీపీని వదిలేసి తప్పుచేశాం.. ఇప్పుడు వెళ్లలేక అవస్థలు పడుతున్నాం.. అనే మాట జోరుగా వినిపిస్తుండడం గమనార్హం.