బాబు క్లారిటీ ఇచ్చారట
మాగంటి బాబు. రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేత. ఆమాటకొస్తే.. ఉభయ గోదావరి జిల్లా రాజకీయాల్లో ఈయన కు ప్రత్యేక స్థానం ఉంది. ఏటా సంక్రాంతికి నిర్వహించే కోడి [more]
;
మాగంటి బాబు. రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేత. ఆమాటకొస్తే.. ఉభయ గోదావరి జిల్లా రాజకీయాల్లో ఈయన కు ప్రత్యేక స్థానం ఉంది. ఏటా సంక్రాంతికి నిర్వహించే కోడి [more]
మాగంటి బాబు. రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేత. ఆమాటకొస్తే.. ఉభయ గోదావరి జిల్లా రాజకీయాల్లో ఈయన కు ప్రత్యేక స్థానం ఉంది. ఏటా సంక్రాంతికి నిర్వహించే కోడి పందేలకు ఈయన పెట్టింది పేరు. అదేవిధం గా ఏపీ సంస్కృతి సంప్రదాయాలను కాపాడడంలోనూ ఈయనది కీలక పాత్ర. మాగంటి కుటుంబానికి సుధీ ర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. మాగంటి బాబు తల్లి దండ్రులు ఇద్దరూ కూడా రాజకీయంగా సక్సెస్ అయినవారే. ఈ కుటుంబం నుంచి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన మాగంటి బాబు కాంగ్రెస్‌లోనే ఎక్కువగా ఉన్నారు. అటు తండ్రి, తల్లితో పాటు మాగంటి బాబు ఇలా ముగ్గురు ఒకే పార్టీ, ఒకే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి మంత్రులు అయిన ఘనత సొంతం చేసుకున్నారు.
పార్టీ మారతారని….
అయితే, అనూహ్య రీతిలో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి నుంచి ఎదురైన పరాభవంతో ఆయన ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఈ క్రమంలోనే టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఏలూరు ఎంపీగా ఈ పార్టీ టికెట్‌పై మాగంటి బాబు విజయం సాధించారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. ఇక, అప్పటి నుంచి మాగంటి బాబు సైలెంట్ అయిపోయారు. దీంతో పార్టీ కార్యక్రమాల్లో ఆయన యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేయడం లేదు. మీడియాలోనూ ఆయన ఎక్కడా కనిపించడం లేదు. దీంతో ఆయనపై పలు రకాల కథనాలు వస్తున్నాయి. టీడీపీకి రాం రాం చెబుతారని, బీజేపీలోకి వెళ్తారని వార్తలు వస్తున్నాయి. అయితే, వాస్తవానికి ఆయన ఆరోగ్యం అంతగా సహకరించడం లేదని పార్టీ వర్గాలే చెపుతున్నాయి. దీంతో ఆయన గతంలోలా బయటకు రాని పరిస్థితి.
మనసులో మాట….
ఇక, మాగంటి బాబుపై జరుగుతున్న ప్రచారం మాత్రం ఆగడం లేదు. జిల్లా తెలుగు యువత అధ్యక్షుడుగా ఉన్న మాగంటి బాబు వారసుడు రాంజీ ఫ్యూచర్ ఏ పార్టీతో ఉంటుందన్నది కూడా కాస్త సస్పెన్స్‌గా మారింది. ఈ నేపథ్యంలో తెలుగుపోస్ట్.కామ్ ప్రతినిధితో మాగంటి ఫోన్‌లో ముచ్చటించారు. ఈ సందర్భంగా మాగంటి బాబు మాట్లాడుతూ.. “కాంగ్రెస్ తో మా ఫ్యామిలీ రాజకీయాలు మొదలయ్యాయి. అనివార్య కారణాలతో టీడీపీ తీర్థం పుచ్చుకున్నాం. ఎన్నికష్టాలు వచ్చినా టీడీపీలోనే ఉంటాను. వారసుడు రాంజీ రాజకీయం కూడా టీడీపీతోనే ఉంటుంది“ అని స్పష్టం చేశారు. కాగా పార్టీ ఓడినా తెలుగు యువత అధ్యక్షుడిగా జిల్లాలో రాంజీ కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇక మాగంటి బాబు ఇప్పటికే క్రియాశీలక రాజకీయాలకు దూరమైనట్టే. అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో రాంజీ ఎంపీగా లేదా ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉంది. కానీ, వీరి కుటుంబం మాత్రం టీడీపీతోనే ఉంటుందనే స్పష్టత అయితే రావడం గమనార్హం.