గెలిస్తే మాత్రం ఆయనే సీఎం

ఆయన సినిమా నటడు. సింగర్ భోజ్ పురి ఫిల్మ్ ఇండ్రస్ట్రీకి సుపరితమైన వ్యక్తి ఆయనే మనోజ్ తివారి. ప్రస్తుతం మనోజ్ తివారి ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు. [more]

;

Update: 2020-01-27 17:30 GMT

ఆయన సినిమా నటడు. సింగర్ భోజ్ పురి ఫిల్మ్ ఇండ్రస్ట్రీకి సుపరితమైన వ్యక్తి ఆయనే మనోజ్ తివారి. ప్రస్తుతం మనోజ్ తివారి ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన సారథ్యంలోనే ఎన్నికలు జరగుతున్నాయి. మనోజ్ తివారి నాయకత్వంపై కమలనాధులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మనోజ్ తివారీని పార్టీలోకి తీసుకు వచ్చిన కారణం కూడా ఢిల్లీ ఎన్నికల గురించే. అందుకే ఢిల్లీ ఎన్నికల్లో పార్టీ అధ్యక్షుడిగానే కాకుండా, ముఖ్య ప్రచారకర్తగా మనోజ్ తివారీ ప్రధాన పాత్ర పోషించనున్నారు.

ఎస్సీ నుంచి పోటీ చేసి…..

మనోజ్ తివారీ తొలుత సమాజ్ వాదీ పార్టీ. ఉత్తర్ ప్రదేశ్ లోని గొరఖ్ పూర్ నియోజకవర్గం నుంచి పార్లమెంటు అభ్యర్థిగా సమాజ్ వాదీ పార్టీ నుంచి పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో అప్పటి అభ్యర్థి యోగి ఆదిత్యనాధ్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత బీజేపీ మనోజ్ తివారీని తన పార్టీలోకి రప్పించుకుంది. భోజ్ పురి నటుడిగా, సింగర్ గానే కాకుండా ఆయన చేసే ప్రసంగాలు సయితం ప్రజలను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. 2014లో ఢిల్లీలోని నార్త్ ఈస్ట్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా గెలుపొందారు.

పార్టీ అధ్యక్షుడిగా…..

అందుకే మనోజ్ తివారిని ఢిల్లీ పార్టీ అధ్యక్షుడిగా చేశారు. 2017లో జరిగిన ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు మనోజ్ తివారీ నేతృత్వంలోనే జరిగాయి. ఆ ఎన్నికల్లో విజయం సాధించారు. దీంతో మనోజ్ తివారీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను కూడా గట్టెక్కిస్తారన్న నమ్మకంతో కమలనాధులు ఉన్నారు. ఉత్తర్ ప్రదేశ్ లో ఎంపీగా పోటీ చేసినప్పుడు కూడా పూర్వాంచల్ అభివృద్ధికి పాటుపడతానని పదే పదే చెప్పేవారు. పూర్వాంచల్ ను అభివృద్ధి చేయాలన్నదే తమ లక్ష్యమని అనేవారు.

వారిపైనే దృష్టిపెట్టి…..

ఇప్పుడు ఢిల్లీలో కూడా పూర్వాంచల్ ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు. ఢిల్లీ తూర్పు ప్రాంతంలో ఉన్న పూర్వాంచల్ లో ఉన్నది ఎక్కువ మంది వలస వచ్చిన వారే. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. కానీ బీజేపీ ఇప్పటి వరకూ వీరిని పట్టించుకోలేదు. అయితే మనోజ్ తివారీ పూర్వాంచల్ ప్రాంతానికి చెందిన వారికి పదిమందికి ఈ ఎన్నికల్లో టిక్కెట్లు దక్కేలా చూశారు. వీరు స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న కాలనీలను కేంద్రప్రభుత్వం చేత రెగ్యులరైజ్ చేయించారు మనోజ్ తివారి. మొత్తం ఓటర్లలో 30 శాతం మంది పూర్వాంచల్ కావడంతో మనోజ్ తివారీ గత కొంతకాలంగా వారిపై నే దృష్టి పెట్టారు. బీజేపీ ఢిల్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదు. అయితే విజయం సాధిస్తే మనోజ్ తివారీ ముఖ్యమంత్రి అనేది ఖాయంగా కనపడుతోంది.

Tags:    

Similar News