యాంటీ వాయిస్ మరింత పెంచుతారా?

వైసీపీ ఎమ్మెల్యేల్లో క్రమంగా అసంతృప్తి పెరుగుతుంది. ఒకవైపు తమకు మంత్రి పదవి దక్కదన్న కారణం కావచ్చు. రెండు తమ నియోజకవవర్గాలను మంత్రులు సయితం పట్టించుకోవడం లేదని కావచ్చు. [more]

Update: 2021-01-26 03:30 GMT

వైసీపీ ఎమ్మెల్యేల్లో క్రమంగా అసంతృప్తి పెరుగుతుంది. ఒకవైపు తమకు మంత్రి పదవి దక్కదన్న కారణం కావచ్చు. రెండు తమ నియోజకవవర్గాలను మంత్రులు సయితం పట్టించుకోవడం లేదని కావచ్చు. రెండేళ్లుగా అభివృద్ధి లేకుండా కేవలం సంక్షేమానికే ప్రభుత్వం పెద్ద పీట వేస్తుండటం కొందరు సీనియర్ ఎమ్మెల్యేలకు మింగుడు పడటం లేదు. అభివృద్థి చేయకుండా కేవలం సంక్షేమంతోనే గెలవాలనుకోవడం అత్యాశ అని కొందరు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి అసంతృప్తి ఎమ్మెల్యేల్లో ప్రకాశం జిల్లాకు చెందిన మానుగుంట మహీధర్ రెడ్డి.

నాలుగు సార్లు గెలిచి…..

మానుగుంట మహీధర్ రెడ్డి ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఇదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు. కాంగ్రెస్ లో మంత్రిగాను మానుగుంట మహీధర్ రెడ్డి పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా కాంగ్రెస్ లోనే కొనసాగారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీీలో చేరారు. వైసీపీలో చేరిన మానుగుంట మహీధర్ రెడ్డికి టిక్కెట్ ఇవ్వడంతో ఎన్నికల్లో గెలిచారు.

అధికారులు కూడా….

తొలినాళ్లలో కొంత సంతృప్తికరంగానే ఉన్నా మానుగుంట మహీధర్ రెడ్డి ఇటీవల కాలంలో పార్టీ అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒకానొక సమయంలో ఆయన అధికారులపై అసంతృప్తితో ఏకంగా ఆందోళనకు దిగారు. అధికారులు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయడం లేదని ఆయన ఫైర్ అవుతున్నారు. కొన్ని పనులకు నిధులు ఉన్నా తమ నియోజకవర్గంలో పనులు చేపట్టడం లేదని, తనను ఎమ్మెల్యేగా ఖాతరు చేయడం లేదని మానుగుంట మహీధర్ రెడ్డి ఫైర్ అయ్యారు.

మంత్రి వర్గ విస్తరణ తర్వాత…..

ఇక రామాయపట్నం పోర్టు విషయంలోనూ ఆయన ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేశారు. తన నియోజకవర్గం పరిధిలోని రామాయపట్నం పోర్టు నిర్మాణం జరుగుతుంటే దానికి అనుబంధ పరిశ్రమలను మంత్రి మేకపాటి గౌతంరెడ్డి నెల్లూరు జిల్లాకు తీసుకువెళుతున్నారని ఆరోపించారు. దానికి జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి సహకారం ఉందని చెబుతున్నారు. జిల్లాకు రావాల్సిన పరిశ్రమలు తరలి వెళుతున్నా ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. మొత్తం మీద మానుగుంట మహీధర్ రెడ్డి మంత్రి వర్గ విస్తరణ తర్వాత మరింత స్వరం పెంచే అవకాశముంది.

Tags:    

Similar News