Ycp : రెడ్డి అయినా ఈసారి మంత్రి పదవి గ్యారంటీ అట
ప్రకాశం జిల్లాలో కొద్దో గోప్పో సీనియర్ నేత మానుగుంట మహీధర్ రెడ్డి. ఆయన ఈసారి ఖచ్చితంగా తనకు మంత్రి పదవి దక్కుతుందని భావిస్తున్నారు. సీనియారిటీ ప్రకారం తనకే [more]
;
ప్రకాశం జిల్లాలో కొద్దో గోప్పో సీనియర్ నేత మానుగుంట మహీధర్ రెడ్డి. ఆయన ఈసారి ఖచ్చితంగా తనకు మంత్రి పదవి దక్కుతుందని భావిస్తున్నారు. సీనియారిటీ ప్రకారం తనకే [more]
ప్రకాశం జిల్లాలో కొద్దో గోప్పో సీనియర్ నేత మానుగుంట మహీధర్ రెడ్డి. ఆయన ఈసారి ఖచ్చితంగా తనకు మంత్రి పదవి దక్కుతుందని భావిస్తున్నారు. సీనియారిటీ ప్రకారం తనకే ఇవ్వాలని ఆయన కోరుతున్నారు కూడా. జగన్ తన మంత్రివర్గంలో వంద శాతం మార్చేయాలని చూడటంతో బాలినేని శ్రీనివాసరెడ్డి మంత్రి పదవి కూడా ఉండదని తేలిపోయింది. దీంతో మానుగుంట మహీధర్ రెడ్డికి మరింత ఆశ పెరిగింది.
నాలుగు సార్లు గెలిచి…..
మానుగుంట మహీధర్ రెడ్డి కందుకూరు నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు విజయం సాధించారు. సుదీర్ఘ రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. కాంగ్రెస్ హయాంలో మంత్రి పదవిని కూడా చేపట్టారు. మొన్నటి ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ను వీడి వైసీపీలో చేరి విజయం సాధించారు. పార్టీలో చేరే ముందే ఆయనకు జగన్ హామీ ఇచ్చినట్లు తెలిసింది. దీంతో రెండో విడత మంత్రి వర్గ విస్తరణపై మానుగుంట మహీధర్ రెడ్డి ఆశలు పెట్టుకున్నారు.
అందరూ జూనియర్లే….
ప్రకాశం జిల్లాలో మొత్తం 12 నియోజకవర్గాలున్నాయి. వీటిలో కొండపి, పర్చూరు, చీరాల, అద్దంకి టీడీపీ గెలుచుకుంది. వైసీపీ గెలిచిన మార్కాపురం, కనిగిరి, సంతనూతలపాడు, దర్శి, గిద్దలూరు నియోజకవర్గాల్లో మొదటి సారి ఎమ్మెల్యేలుగా గెలిచారు. యర్రగొండపాలెం నుంచి గెలచిన ఆదిమూలపు సురేష్ మంత్రి అయ్యారు. ఒంగోలు నుంచి గెలిచిన బాలినేని కూడా మంత్రి అయ్యారు. గిద్దలూరులో అన్నారాంబాబు రెండుసార్లు గెలిచారు. కందుకూరు నుంచే మానుగుంట మహీధర్ రెడ్డి సీినియర్ గా ఉన్నారు. అందుకే ఆయన ఆశలు పెట్టుకున్నారు.
ఎన్నికల టీం కావడంతో….
సామాజిక సమీకరణాలు చూస్తే తప్ప మానుగుంట మహీధర్ రెడ్డి కి పదవి దక్కడ ఖాయమంటున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని ఏకతాటిపై నడిపించే సత్తా ఒక ఆయనకు మాత్రమే ఉందన్నది వాస్తవం. మిగిలిన వారంతా జూనియర్లు కావడం, బాలినేని చెప్పినట్లే వింటుండటంతో వారికి అంత సామర్థ్యం లేదు. దీంతో త్వరలో జరగబోయే మంత్రి వర్గ విస్తరణలో మానుగుంట మహీధర్ రెడ్డి పేరు ఖాయంగా ఉంటుందన్న ప్రచారం అయితే జోరుగా సాగుతోంది.