జగన్ యంగ్ టీం రెడీ.. వారికి ఇక నో ఛాన్స్ …?

వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటినుంచి అన్ని పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. ప్రధాన విపక్షం తెలుగుదేశం పార్టీ ఇప్పటికే కొందరికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పని చేసుకోవాలని చెబితే [more]

;

Update: 2021-07-05 08:00 GMT

వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటినుంచి అన్ని పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. ప్రధాన విపక్షం తెలుగుదేశం పార్టీ ఇప్పటికే కొందరికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పని చేసుకోవాలని చెబితే మరికొందరికి ఎన్నికలకు ఏడాది ముందే పేరు ప్రకటించడానికి సిద్ధం అవుతున్నట్లు టాక్. ఇదిలా ఉంటె అధికార వైసిపి సైతం ఇప్పటినుంచే రాబోయే ఎన్నికల్లో ఫోకస్ పెంచినట్లు తెలుస్తుంది. అందులో భాగంగా ముందుగా ఎంపి టికెట్ల అంశంలో ఇప్పటినుంచి సీరియస్ గా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా ఎక్కడ అభ్యర్థులను మార్చాలి ఎక్కడ పాతవారిని కొనసాగించాలన్నదానిపై వైసిపి లో వడబోతలు మొదలైపోయాయి అంటున్నారు. దీనిలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా లో మార్పు తధ్యం అన్న మాట బలంగా వినిపిస్తుంది.

వారిద్దరి సేవలు పార్టీకే …

తూర్పుగోదావరి జిల్లాలో కాపు, శెట్టిబలిజ సామాజిక వర్గాలు రెండు బలమైనవే. ఆ రెండిటికి సమతూకంతో ప్రాధాన్యత కల్పించామన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్ళాలి అంటే అటు పిల్లి సుభాష్ చంద్ర బోస్ ఇటు తోట త్రిమూర్తులు వంటివారిని సమర్ధంగా వినియోగించుకునే వ్యూహాలను జగన్ ముందునుంచే రూపొందిస్తున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి సైతం రాజ్యసభ నుంచి బోస్, ఎమ్యెల్సీగా తోట త్రిమూర్తులు పదవుల్లో ఉండనున్నారు. సీనియర్లు అయిన వీరి సేవలను ఎన్నికల సమయంలో విస్తృతంగా వినియోగించుకోవాలన్నది అధినేత ఆలోచనగా ఉండబోతుందంటున్నారు. ప్రస్తుత పదవుల తరువాత వారి సేవలను పార్టీకే పూర్తి స్థాయిలో వినియోగిస్తారని తెలుస్తుంది. సోషల్ ఇంజనీరింగ్ లో చంద్రబాబును మించిన జగన్ వ్యూహాలు ఏమేరకు ఫలిస్తాయో వేచి చూడాలి.

అదే బాటలో సీనియర్లకు …

తూర్పుగోదావరి జిల్లాలో ప్రస్తుతం వీరిద్దరే సీనియర్ నేతలుగా పార్టీలో ఉన్నారు. రెండు బలమైన సామాజిక వర్గాలకు ప్రతినిధులు కూడా. వీరికోవలోకి పినిపే విశ్వరూప్ కూడా వస్తారు. మరి ఆయనకు వచ్చే సారి బెర్త్ కన్ఫర్మ్ చేస్తారో లేదో తెలియదు అని భావిస్తున్నారు. ఆయనకు సైతం ఇలా నామినేటెడ్ పదవి ఇచ్చి పార్టీ సేవలకు వినియోగిస్తారని తెలుస్తుంది. యంగ్ టీం తోనే వచ్చే ఎన్నికల్లో పోరుకు జగన్ సమాయత్తం అవుతారని రాజకీయ విశ్లేషకుల అంచనా. ప్రత్తిపాడు పర్వత ప్రసాద్ కు సైతం చుక్కెదురు కావొచ్చంటున్నారు. ఇలా 60 కి దగ్గరగా వచ్చే వారంతా జగన్ హిట్ లిస్ట్ లో చేరే ఛాన్స్ లే ఎక్కువన్నది లెక్కేస్తున్నారు. మరి జగన్ ఏమి చేయనున్నారా వేచి చూడాలి.

Tags:    

Similar News