Maa : ఇదంతా బూటకం.. వేషాలు దొరకడం కూడా ఇక కష్టమే
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల తర్వాత చిత్ర పరిశ్రమలో అనేక మార్పులు చోటు చేసుకునే అవకాశాలున్నాయి. ఇందులో ప్రధానంగా ఈ ఎన్నికల్లో కీలక భూమిక పోషించిన సినీ [more]
;
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల తర్వాత చిత్ర పరిశ్రమలో అనేక మార్పులు చోటు చేసుకునే అవకాశాలున్నాయి. ఇందులో ప్రధానంగా ఈ ఎన్నికల్లో కీలక భూమిక పోషించిన సినీ [more]
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల తర్వాత చిత్ర పరిశ్రమలో అనేక మార్పులు చోటు చేసుకునే అవకాశాలున్నాయి. ఇందులో ప్రధానంగా ఈ ఎన్నికల్లో కీలక భూమిక పోషించిన సినీ నటులకు సినిమాల పరంగా భవిష్యత్ ఉండదనే వాదన వినపడుతుంది. మా ఎన్నికలతో చిత్ర పరిశ్రమలో రెండు వర్గాలు ఏర్పడ్డాయి. ఒకటి మెగా ఫ్యామిలీ. రెండు మంచు ప్యామిలీ. మోహన్ బాబు, చిరంజీవి మంచి స్నేహితులేనని చెబుతున్నా మా ఎన్నికల తర్వాత దెబ్బతినేది కొందరు నటీ నటులేనంటున్నారు. మేమంతా ఒకటేనన్నారు. ఎన్నికల వరకే పోటీ అన్నారు. కానీ అదంతా బూటకమని తేలిపోయింది.
ఆలింగనాలు బహిరంగంగానే…?
సినిమాలో మాదిరిగానే నటులు జీవితంలో ఆలింగనాలు, ఆప్యాయతలు అంతా బూటకమే. ఎదురుపడినప్పుడు కౌగిలించుకోవడం, వంగి వంగి నమస్కారాలు పెట్టడం షరా మామూలే. పాదాభివందనాలు కూడా తమకు చిన్న పాత్ర ఇవ్వడం కోసమే. ఆ నటుడిపై గౌరవమో, ప్రేమో కాదన్నది అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో మోహన్ బాబు, నరేష్ లను ప్రకాష్ రాజ్ ప్యానెల్ విలన్లుగా భావిస్తుంది. అందుకే అందరూ రాజీనామాలు చేశారు.
ఘర్షణ లు తీవ్ర స్థాయికి….
ఇక ఈ ఎన్నికలు సినిమా పరిశ్రమను చీలిక తేవడమే కాకుండా ఎవరి చిత్రాల్లో వారు మరొకరికి అవకాశాలు దొరకడమూ కష్టమే. మా ఎన్నికల పోలింగ్ రోజునే బెనర్జీని మోహన్ బాబు దుర్భాష లాడారు. అలాగే శివబాలాజీకి, సమీర్ కు మధ్య గొడవ అయింది. ఇక నరేష్ కు, ప్రకాష్ రాజ్ కు మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలు ఇంతటితో ఆగేట్లు లేవు. సినీ పరిశ్రమలో మెగా కాంపౌండ్ నుంచి వచ్చే సినిమాలే అధికంగా ఉంటాయి. మంచు కుటుంబం సినిమాలు నిర్మించడం మానేసింది.
కొందరికి మాత్రం….
దీంతో మంచు విష్ణు ప్యానెల్ కు సహకరించిన వారికి ఇక వేషాలు కూడా దొరకని పరిస్థితి. ఎవరెవరు ప్రకాష్ రాజ్ ప్యానెల్ కు వ్యతిరేకంా ఓటు వేశారో వారిని మెగా ఫ్యామిలీ బ్లాక్ లిస్ట్ లో పెట్టేటట్లు కన్పిస్తుంది. నరేష్ వంటి వారికి ఆర్థికంగా ఇబ్బందులు ఉండవు. చిన్న చిన్న పాత్రలు వేసే వారే ఇబ్బంది పడక తప్పదు. ఇదే ఇప్పుడు అందరిలోనూ ఆందోళన కల్గిస్తుంది. మా ఎన్నికల తర్వాత కూడా రచ్చ జరుగుతుండటంతో చిన్న వేషాలు వేసే వారిలో ఆందోళన కల్గిస్తుంది. మొత్తం మీద మా ఎన్నికలు మా ఖర్మకు వచ్చినట్లుందన్న కామెంట్స్ కొందరి నటీనటుల నుంచి విన్పిస్తుండటం విశేషం.