సొంత లైవ్ లే చేటు తెస్తున్నాయా ?
ఇప్పుడు నడుస్తుంది సోషల్ మీడియా. దీంట్లో దూకుడుగా ఉంటూ వేగంగా ప్రచారం పొందేవారు హీరోలు. అయితే ఒక్కోసారి ఇందులో చిన్న తప్పు జరిగినా జీరోలు కూడా అయ్యే [more]
;
ఇప్పుడు నడుస్తుంది సోషల్ మీడియా. దీంట్లో దూకుడుగా ఉంటూ వేగంగా ప్రచారం పొందేవారు హీరోలు. అయితే ఒక్కోసారి ఇందులో చిన్న తప్పు జరిగినా జీరోలు కూడా అయ్యే [more]
ఇప్పుడు నడుస్తుంది సోషల్ మీడియా. దీంట్లో దూకుడుగా ఉంటూ వేగంగా ప్రచారం పొందేవారు హీరోలు. అయితే ఒక్కోసారి ఇందులో చిన్న తప్పు జరిగినా జీరోలు కూడా అయ్యే ప్రమాదం ఆధునిక సాంకేతికత యుగంలో అంతే స్పీడ్ గా ఎదురౌతుంది. అది ఏ స్థాయిలో అంటే బికాం లో ఫిజిక్స్ లా ఉంటుందనడంలో సందేహమే లేదు. నేటి పొలిటికల్ వార్ అంతా ట్విట్టర్ ఫెస్ బుక్, యూట్యూబ్, ఇన్ స్టా, వాట్స్ అప్ వంటి సామాజిక వేదికలపై హోరాహోరీగా సాగడం చూస్తూనే ఉన్నాం. ఇందులో ఎవరైనా నేత లైవ్ లో తప్పు చేస్తే ప్రత్యర్ధులు ఆ వ్యాఖ్యలను సెకనులో డౌన్ లోడ్ చేసి దానికి రంగులు హంగులు అద్ది వారి రాజకీయ జీవితాలతో బంతి ఆడేస్తున్నారు. సెలబ్రిటీ గా ఉన్నవారినుంచి సామాన్యుల వరకు ఈ తంతు ఇప్పుడు ఒక ట్రెండ్ గా మారింది.
రాజమండ్రి ఎంపి లైవ్ లతో …
యువనేత రాజమండ్రి ఎంపి మార్గాని భరత్ రామ్ ఇప్పుడు ఫెస్ బుక్ లైవ్ లతో సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆయన ఉదయం లేచింది మొదలు పడుకునే వరకు వీలైనన్ని లైవ్ లు ముఖపుస్తకంలో నడిపిస్తారు. ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా ఆయన వెనుక మొబైల్ ఫోన్ పట్టుకుని ఒకరు అనుసరిస్తారు. ఆ సమయంలో ప్రతీ అంశం లైవ్ లోకి వెళ్ళిపోతూ కొన్ని సందర్భాల్లో పార్టీకి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుందన్న చర్చ మొదలైంది. రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, డా ఆకుల సత్యనారాయణ ఇతర నేతలు వ్యక్తిగత సంభాషణలు ఇలాగే మార్గాని భరత్ లైవ్ ద్వారా బయటకు వచ్చి వైరల్ అయ్యాయి.
ప్రత్యర్థులకు ఆయుధాలు అవుతున్నాయా ?
ఈ అంతర్గత భేటీలో నేతలు మాట్లాడింది వేరు ప్రచారం జరిగింది వేరు. అందులో పార్టీ నేతలు మాట్లాడిన దానికి భిన్నంగా టిడిపి మీడియా వక్రీకరించి వైసిపి ని ఒక ఆట ఆడుకుంది. ఇటీవల ఎంపి మార్గాని భరత్ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన రాజన్న రచ్చబండలో సైతం కొందరు మాట్లాడిన మాటలు ఎంపీ వ్యాఖ్యలు వైసిపి నేతల్లో చర్చకు టిడిపికి ఆయుధంగా మారాయంటున్నారు. లైవ్ నిర్వహిస్తున్న అంశం కొందరికి మాత్రమే తెలిసి ఉండటంతో యధాలాపంగా పార్టీ వర్గాలు, ప్రజలు మాట్లాడుకునే మాటలు లైవ్ లో ప్రసారం అయిపోతూ లేనిపోని సమస్యలకు కారణం అవుతున్నాయన్న టాక్ నడుస్తుంది. తీసే వ్యక్తులకు సైతం ఏది లైవ్ తీయాలి ఏది తీయకూడదు అన్న పరిజ్ఞానం లేనివారు కావడంతో సెన్సార్ లేని సినిమా సంచలనాలకు తెరతీస్తోంది. దాంతో ఇప్పుడు సరైన పరిజ్ఞానం ఉన్నవారిని నియమించుకుని ఎంపి మార్గాని భరత్ ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారో లేదో మరిన్ని సంచలనాలకు కేంద్ర బిందువుగా మారతారో వేచి చూడాలి.