margani bharath : నేను మరో RRR ను కాను.. కాబోను
రాజకీయాలు ఒకసారి రుచి చూసిన తర్వాత ఎవరూ అంత సులువుగా వదలరు. ఓటమి పాలయినా రాజకీయాల్లో కొనసాగుతారు తప్ప మరో దారి పట్టరు. పాలిటిక్స్ లో అంత [more]
;
రాజకీయాలు ఒకసారి రుచి చూసిన తర్వాత ఎవరూ అంత సులువుగా వదలరు. ఓటమి పాలయినా రాజకీయాల్లో కొనసాగుతారు తప్ప మరో దారి పట్టరు. పాలిటిక్స్ లో అంత [more]
రాజకీయాలు ఒకసారి రుచి చూసిన తర్వాత ఎవరూ అంత సులువుగా వదలరు. ఓటమి పాలయినా రాజకీయాల్లో కొనసాగుతారు తప్ప మరో దారి పట్టరు. పాలిటిక్స్ లో అంత కిక్కు ఉంటుంది మరి. రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు మార్గాని భరత్ ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారాడు. ఆయన మరో RRR అంటూ సొంత పార్టీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. తనపై చేసిన ఆరోపణలపై మార్గాని భరత్ నేరుగా సీఎంను కలిసేందుకు సిద్ధమవుతున్నారు.
జేడీతో సెల్ఫీపై….
ఈ మేరకు ఎంపీ మార్గాని భరత్ ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ ను కోరినట్లు తెలిసింది. తనపై దారుణమైన ఆరోపణలను జక్కంపూడి రాజా చేశారని మార్గాని భరత్ అంటున్నారు. జగన్ ను జైలుకు పంపిన జేడీ లక్ష్మీనారాయణతో సెల్ఫీ దిగినట్లు అన్నారని, నిరూపిస్తే ఎటువంటి శిక్షకైనా సిద్ధమని మార్గాని భరత్ సవాల్ విసురుతున్నారు. ఒక కాపు సామాజికవర్గం సమావేశానికి తాను హాజరుకాగా, జేడీ లక్ష్మీనారాయణ వచ్చారని, ఆయనే తన వద్దకు వచ్చి మాట్లాడరని భరత్ అంటున్నారు. జేడీ లక్ష్మీనారాయణ ముఖ్యమంత్రి జగన్ పాలనను ఆయన మెచ్చుకున్నారని మార్గాని భరత్ చెబుతున్నారు. తాను ఆయనవద్దకు వెళ్లి ఫొటోలు దిగలేదని, కావాలంటే వీడియో ఫుటేజీ పరిశీలించుకోవచ్చని చెబుతున్నారు.
ఆరోపణలు నిరాధారం….
మరోవైపు తాను గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పెందుర్తి వెంకటేష్ లతో కలసి రాజకీయాలు చేస్తున్నానని ఆరోపించారని, దీనిపై ఆధారాలుంటే తాను ఎలాంటి శిక్షకైనా సిద్ధమని అన్నారు. తనకు జగన్ జీవితంలో మర్చిపోలేని అవకాశమిచ్చారని అలాంటిది జగన్ ను మోసం చేస్తానని ఎలా అనుకున్నావని మార్గాని భరత్ ప్రశ్నించారు. తాను జీవితాంతం జగన్ వెంటే నడుస్తానన్నారు. తనను జగన్ తమ్ముడు లాగా చూసుకుంటానని, తాను ఎన్నడూ జగన్ పై అలగలేదని కూడా మార్గాని భరత్ అన్నారు.
రాజమండ్రి రచ్చపై….
తనపై చేసిన ఆరోపణలన్నీ నిరాధారమని చెప్పడానికి ఎంపీ మార్గాని భరత్ జగన్ ను కలవాలని నిర్ణయంచుకున్నారు. అధిష్టానం తనను పిలవకపోయినా నేరుగా తానే కలసి దీనిపై వివరణ ఇవ్వాలని మార్గాని భరత్ భావిస్తున్నారు. వీలయినంత త్వరగా జగన్ ను కలిసేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. అయితే రాజమండ్రిలో జరుగుతున్న రచ్చపై జగన్ ఇప్పటికే నివేదిక తెప్పించుకున్నట్లు తెలిసింది. రాజమండ్రిలో రచ్చకు గల కారణాలపై జగన్ ప్రత్యేకంగా నివేదిక తెప్పించుకున్నారంటున్నారు. మొత్తం మీద రాజమండ్రిలో ఇద్దరి యువనేతల మధ్య విభేదాలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేవిధంగా ఉన్నాయి.