కెరీర్ ఖేల్ ఖతం
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కీలక విషయం శాసన మండలి రద్దు. దీనిపై ఇప్పటికే అసెంబ్లీ లో తీర్మానాన్ని ఆమోదించిన జగన్ ప్రభుత్వం కేంద్రానికి పంపింది. దీనిపై [more]
;
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కీలక విషయం శాసన మండలి రద్దు. దీనిపై ఇప్పటికే అసెంబ్లీ లో తీర్మానాన్ని ఆమోదించిన జగన్ ప్రభుత్వం కేంద్రానికి పంపింది. దీనిపై [more]
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కీలక విషయం శాసన మండలి రద్దు. దీనిపై ఇప్పటికే అసెంబ్లీ లో తీర్మానాన్ని ఆమోదించిన జగన్ ప్రభుత్వం కేంద్రానికి పంపింది. దీనిపై కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం సత్వరమే చర్య తీసుకుంటుందా ? పార్లమెంటులో బిల్లు పెట్టి ఏపీ సర్కారు ఆమోదించిన మం డలి రద్దు తీర్మానానికి జై కొడుతుందా? అనేది ఆసక్తిగా మారింది. నిజానికి ఏపీలో ఎన్నికలు జరిగేందుకు మరో నాలుగు సంవత్సరాలకు పైగానే సమయం ఉంది. ఈ నేపథ్యంలో మళ్లీ ప్రభుత్వం మారి.. వేరే పార్టీ అధికారంలోకి వచ్చి.. మండలి కావాలని తీర్మానం చేసేందుకు ఎంత లేదన్నా కూడా నాలుగున్నరేళ్లకు పైగానే సమయం ఉంది.
మండలి రద్దయితే….
సో.. కేంద్రప్రభుత్వం అన్ని సంవత్సరాలపాటు జగన్ ప్రభుత్వం చేసిన రద్దు తీర్మానంపై చర్యలు తీసుకోకుండా ఉండే అవకాశం లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో కొంచెం ఆలస్యంగానైనా మండలి రద్దు ఖాయమనే వాదన వినిపిస్తోంది. ఇదే జరిగితే రాష్ట్రంలోని 50 మంది మండలి సభ్యులు నష్టపోవడం అటుంచితే వైసీపీకి చెందిన కీలక నాయకుడు, గుంటూరుకు చెందిన నేత మర్రి రాజశేఖర్ రాజకీయ జీవితమే తల్లకిందులు కానుంది. వాస్తవానికి వైసీపీ నేతల్లో చాలా మంది మండలి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. కానీ, ఇప్పుడు మండలి రద్దుతో వారి ఆశలపై నీళ్లు చల్లినట్టు అయింది.
టిక్కెట్ ఇవ్వకుండా….
కానీ, వీరి కన్నా కూడా మర్రి రాజశేఖర్ కెరీర్ ఖేల్ ఖతం అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. 2019 ఎన్నికలకు ముందు తాను ఇంచార్జ్‌గా ఉన్న కీలకమైన నియోజకవర్గం చిలకలూరిపేటలో వైసీపీని మర్రి రాజశేఖర్ బలోపేతం చేశారు. ఈ నియోజకవర్గంలో మర్రి రాజశేఖర్ ఫ్యామిలీకి ఐదారు దశాబ్దాల అనుబంధం ఉంది. నాలుగున్నరేళ్లు పార్టీ కోసం కష్టపడిన మర్రికి చివర్లో జగన్ హ్యాండ్ ఇచ్చారు. తన గెలుపు గ్యారెంటీ అనుకుంటున్న దశలో అధినేత జగన్ ఇక్కడ నుంచి బీసీ వర్గానికి చెందిన విడదల రజనీకి టికెట్ ఖరారు చేశారు.
మంత్రి పదవి కూడా…
ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారంలో మర్రికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. అయితే, ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనందున ఎమ్మెల్సీని చేసి, అటు నుంచి మంత్రి వర్గంలోకి తీసుకోవాలి. కానీ, ఇప్పుడు ఏకంగా మండలే రద్దవుతున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ పదవితో పాటు మంత్రిగా కూడా మర్రి రాజశేఖర్ ఆశలు అడియాసలేనని అంటున్నారు పరిశీలకులు. ఏదైనా నామినేటెడ్ పదవి తప్ప మంత్రిగా మాత్రం మర్రి రాజశేఖర్ కి ఛాన్స్ దక్కే అవకాశం లేదని చెబుతున్నారు. మరి మర్రి కన్నా దురదృష్టవంతుడు అయిన నేత ఎవ్వరూ ఉండరేమో?