వైసీపీలో వాళ్లంతా డల్ అయ్యారు..కారణమిదేనటగా?
వైసీపీ ఎందుకో డల్ గా కన్పిస్తుంది. అధికారంలో లేక ముందు సౌండ్ విన్పించిన నేతలందరూ ఇప్పడు కనీసం మాట్లాడేందుకు కూడా ఇష్టపడటం లేదు. తెలుగుదేశం పార్టీ చేస్తున్న [more]
;
వైసీపీ ఎందుకో డల్ గా కన్పిస్తుంది. అధికారంలో లేక ముందు సౌండ్ విన్పించిన నేతలందరూ ఇప్పడు కనీసం మాట్లాడేందుకు కూడా ఇష్టపడటం లేదు. తెలుగుదేశం పార్టీ చేస్తున్న [more]
వైసీపీ ఎందుకో డల్ గా కన్పిస్తుంది. అధికారంలో లేక ముందు సౌండ్ విన్పించిన నేతలందరూ ఇప్పడు కనీసం మాట్లాడేందుకు కూడా ఇష్టపడటం లేదు. తెలుగుదేశం పార్టీ చేస్తున్న విమర్శలకు సయితం కనీసం కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేయడం లేదు. ప్రధానంగా ఏపీ శాసనమండిలో వైసీపీ ఎమ్మెల్సీలు తమ గొంతు విన్పించడం లేదు. జగన్ వారికి పదవులు ఇచ్చినా ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేందుకు ముందుకు రావడం లేదు.
మండలిలో ఉద్దండులున్నా…..
శాసనమండలిలో టీడీపీకే ఎక్కువ బలం ఉంది. ఇప్పుడు వైసీపీకి కేవలం పన్నెండు మంది మాత్రమే ఎమ్మెల్సీలు ఉన్నారు. వీరంతా పార్టీ వాయిస్ గట్టిగా విన్పించేవారే. ఉమ్మారెడ్డ వెంకటేశ్వర్లు శాసనమండలి పక్ష నేతగా కొనసాగుతున్నారు. ఈయనతో పాటుగా చల్లా రామకృష్ణారెడ్డి ఉన్నారు. ఆయనకు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఇక డొక్కా మాణిక్య వరప్రసాద్ కూడా టీడీపీకి రాజీనామా చేసి తిరిగి వైసీపీ తరుపున ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.
ప్రభుత్వంపై విమర్శలను….
జగన్ ప్రభుత్వంపై ఇప్పుడు అనేక అంశాలపై టీడీపీ విమర్శలు చేస్తుంది. మద్యం బ్రాండ్ల దగ్గర నుంచి ఇసుక, ఇంగ్లీష్ మీడియం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలపై దాడులు వంటి వాటిపై టీడీపీ ఎమ్మెల్సీలు దూకుడుగా మాట్లాడుతున్నారు. టీడీపీ ఎమ్మెల్సీలు రాజేంద్ర ప్రసాద్, లోకేష్, దీపక్ రెడ్డి తదితరులు ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు. అయినా వైసీపీ ఎమ్మెల్సీలు మాత్రం పట్టించుకోవడం లేదు. కనీసం ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేయలేదు.
పిలిచి పదవులిచ్చినా……
ఇక టీడీపీలో పార్లమెంటు సభ్యుడిగా పనిచేసి వచ్చిన పండుల రవీంద్ర బాబుకు కూడా జగన్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఆయన కూడా ఎస్సీ, ఎస్టీలపై దాడుల విషయంలో మౌనంగా ఉంటున్నారు. డొక్కా మాణిక్య వరప్రసాద్ కూడా అంతే. దీనికి ప్రధాన కారణం శాసనమండలి ఎప్పుడైనా రద్దు కావచ్చన్న ఆందోళన వారిలో ఉండటమేనంటున్నారు. మొత్తం మీద ఎమ్మెల్సీల పనితీరుపై ఇటీవల వైసీపీ సీనియర్ నాయకులతో జగన్ చర్చించినట్లు తెలిసింది. సమర్థవంతంగా విమర్శలు తిప్పికొట్టగలిగిన నేతలు ఉన్నా, ఎమ్మెల్సీల మౌనానికి గల కారణాలు మాత్రం తెలియరావడం లేదు.