ఇద్దరూ వెనక్కు తగ్గడం లేదుగా?

వైసీపీలో క్రమశిక్షణ కొరవడుతోంది. ఆధిపత్య పోరు పెరిగిపోతోంది. ఎన్ని సార్లు చెప్పినా ఎవరూ తగ్గడం లేదు. ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య తలెత్తిన వివాదం చివరకు ఎటు దారితీస్తుందోనన్న [more]

;

Update: 2020-06-15 13:30 GMT

వైసీపీలో క్రమశిక్షణ కొరవడుతోంది. ఆధిపత్య పోరు పెరిగిపోతోంది. ఎన్ని సార్లు చెప్పినా ఎవరూ తగ్గడం లేదు. ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య తలెత్తిన వివాదం చివరకు ఎటు దారితీస్తుందోనన్న చర్చ వైసీపీలో జరుగుతోంది. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే, ఎంపీ ఆధిపత్య పోరు పెరిగింది. ఇద్దరూ యువకులే కావడంతో ఎవరూ పట్టువీడేందుకు సిద్ధపడటం లేదు. ఇప్పటికే ఈ అంశం హైకమాండ్ దృష్టిలో ఉన్నా ఎవరినీ ఏమీ అనలేని పరిస్థితి.

బలమైన నాయకులే…..

ఇద్దరు బలమైన నాయకులే. బలమైన సామాజిక వర్గానికిచెందిన వారే. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుని తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. జగన్ కు అత్యంత సన్నిహితుడు. అధికారంలోకి వచ్చిన వెంటనే జక్కంపూడి రాజాకు జగన్ కాపు కార్పొరేషన్ ఛైర్మన్ పదవిని అప్పగించారు. జక్కంపూడి కుటుంబం అంటే ప్రత్యేక అభిమానం ఉండటంతో రాజా వైసీపీలో వెరీ వెరీ స్పెషల్ అంటారు.

తొలిసారి గెలిచినా….

అలాగే ఎంపీ మార్గాని భరత్ కూడా తొలిసారి ఎంపీగా గెలిచారు. రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గంలో తొలిసారి బీసీ నేతగా విజయం సాధించారు. అయితే పేదల ఇళ్ల స్థలాల కోసం ఎంపిక చేసిన భూములు వీరి మధ్య అగ్గిని రాజేశాయి. దీంతో పాటు వాసంసెట్టి గంగాధర్ ను జక్కంపూడి రాజా పార్టీలో చేర్చుకోవడం మార్గాని భరత్ కు ఆగ్రహం తెప్పించిందంటున్నారు. ఎంపీ సీటు తనకు ఇవ్వవద్దంటూ ఆందోళన చేసిన గంగాధర్ ను పార్టీలో చేర్చుకోవడాన్ని మార్గాని భరత్ తప్పుపడుతున్నారు. దీంతో రాజానగరంలోనూ తనకంటూ సొంత గ్రూపును మార్గాని భరత్ ఏర్పాటు చేసుకున్నారు.

ఫ్లెక్సీల నుంచి జాయినింగ్స్ వరకూ…

అంతటితో ఆగకుండా కొంతకాలం క్రితం జగన్ రాజమండ్రికి వచ్చినప్పుడు వేసిన ఫ్లెక్సీల్లో రాజా ఫొటో లేకుండా మార్గాని భరత్ చేశారని జక్కంపూడి వర్గం ఆరోపిస్తుంది. అంతేకాకుండా భూ కబ్జాల ఆరోపణలున్న బర్రె కొండబాబు, అజ్జారపు వాసు లను భరత్ పార్టీలో చేర్చుకోవడంపై జక్కంపూడి రాజా అభ్యంతరం తెలిపారు. ఇలా రెండు వర్గాలుగా విడిపోయారు. కార్యక్రమాలకు కూడా ఎవరినీ ఒకరినొకరు ఆహ్వానించుకోవడం లేదు. ఇలా రెండు వర్గాలుగా విడిపోవడంతో వైసీపీ క్యాడర్ అయోమయంలో పడింది. ఈ నియోజకవర్గం విపక్షాలకు అందివచ్చేటట్లే కన్పిస్తుంది.

Tags:    

Similar News