మోపిదేవిని రీప్లేస్ చేసేదెవరు?
ఏదైనా నాయకుడు పదోన్నతి పొంది ఉన్నత స్థానాలకు వెళితే అక్కడ నాయకత్వ లోటు ఖచ్చితంగా కన్పిస్తుంది. ఇప్పుడు గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గంలో అదే జరుగుతుంది. మోపిదేవి [more]
;
ఏదైనా నాయకుడు పదోన్నతి పొంది ఉన్నత స్థానాలకు వెళితే అక్కడ నాయకత్వ లోటు ఖచ్చితంగా కన్పిస్తుంది. ఇప్పుడు గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గంలో అదే జరుగుతుంది. మోపిదేవి [more]
ఏదైనా నాయకుడు పదోన్నతి పొంది ఉన్నత స్థానాలకు వెళితే అక్కడ నాయకత్వ లోటు ఖచ్చితంగా కన్పిస్తుంది. ఇప్పుడు గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గంలో అదే జరుగుతుంది. మోపిదేవి వెంకటరమణ రాజ్యసభకు ఎంపిక కావడంతో ఈ నియోజకవర్గంలో పార్టీని నడిపించే నేత ఎవరు? అన్న ప్రశ్న తలెత్తుతుంది. ప్రస్తుతానికి మోపిదేవి పార్టీ బాధ్యతలను చూసుకుంటున్నా వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేసదెవరన్నది ఆసక్తికరంగా మారింది.
టీడీపీకి కంచుకోట….
రేపల్లె నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి పెట్టని కోటగా చెప్పాలి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత రెండు సార్లు రేపల్లెలో పసుపు జెండా ఎగిరింది. 2004, 2009లో మాత్రం కాంగ్రెస్ విజయం సాధించింది. 2004లో దేవినేని మల్లికార్జునరావు, 2009లో మోపిదేవి వెంకటరమణ ఇక్కడినుంచి గెలిచారు. 2014, 2019లో మోపిదేవి వెంకటరమణ ఇక్కడి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019లో జగన్ వేవ్ బాగా ఉన్నా మోపిదేవి వెంకటరమణ మాత్రం గెలుపొందలేకపోయారు.
రాజ్యసభకు ప్రమోట్ కావడంతో….?
అయితే మోపిదేవి వెంకటరమణ ను ఎమ్మెల్సీ చేసి జగన్ మంత్రిపదవి ఇచ్చారు. కానీ శాసనమండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడంతో మోపిదేవి వెంకటరమణను మంత్రి పదవి నుంచి తొలగించి జగన్ రాజ్యసభకు పంపారు. ఆయన పదవీ కాలం ఆరేళ్ల పాటు ఉంటుంది. 2024లో జరిగే ఎన్నికలకు మోపిదేవి వెంకటరమణ పోటీ చేసే అవకాశం లేదు. దీంతో మరొకరిని ఎంపిక చేయాల్సి ఉంది.
మరో బీసీ నేతను….
ప్రస్తుతానికి మోపిదేవి వెంకటరమణ రేపల్లె నియోజకవర్గ బాధ్యతలను చూసుకుంటున్నప్పటికీ పూర్తి స్థాయి నేత కావాలని జగన్ భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఇక్కడ రెండు సార్లు వరసగా గెలిచి మంచి జోరు మీద ఉంది. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ టీడీపీని ఓడించాలంటే బలమైన నాయకుడు అవసరం. రెండు, మూడు పేర్లే జగన్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. బీసీ వర్గాలకే రేపల్లె ఇన్ ఛార్జిగా నియమించే అవకాశముందని తెలుస్తోంది. మోపిదేవి వెంకటరమణ అభిప్రాయంం మేరకే ఇక్కడ ఇన్ ఛార్జి ని నియమించనున్నారు.