ముద్రగడ ఎటు తేల్చుకోలేకపోతున్నారా ?
మాజీ మంత్రి కాపు రిజర్వేషన్ పోరాట యోధుడు ముద్రగడ పద్మనాభం రాజకీయంగా ముందడుగు వేయాలా లేదా అన్న అంశం తేల్చుకోలేకపోతున్నట్లు సన్నిహిత వర్గాల సమాచారం. కోస్తా జిల్లాల్లో [more]
;
మాజీ మంత్రి కాపు రిజర్వేషన్ పోరాట యోధుడు ముద్రగడ పద్మనాభం రాజకీయంగా ముందడుగు వేయాలా లేదా అన్న అంశం తేల్చుకోలేకపోతున్నట్లు సన్నిహిత వర్గాల సమాచారం. కోస్తా జిల్లాల్లో [more]
మాజీ మంత్రి కాపు రిజర్వేషన్ పోరాట యోధుడు ముద్రగడ పద్మనాభం రాజకీయంగా ముందడుగు వేయాలా లేదా అన్న అంశం తేల్చుకోలేకపోతున్నట్లు సన్నిహిత వర్గాల సమాచారం. కోస్తా జిల్లాల్లో కాపు సామాజిక వర్గంలో ముద్రగడ పద్మనాభం ఒక క్రేజీ స్టార్. ఆయన మాటకు కాపు వర్గంలో మంచి విలువే ఉంది. గత ఎన్నికలకు ముందు ముద్రగడ కుటుంబానికి చంద్రబాబు చేసిన ఘోర అవమానాలతో కాపు లు టిడిపి పై అలకబూనారు. దీనికి తోడు జనసేన టిడిపి నుంచి దూరం జరగడంతో మెజారిటీ పవన్ వెంట మరికొందరు జగన్ వెంట నడిచారు. నాటి ఎన్నికల్లో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మౌనం వహించారు.
రెండు దారులు …
ముద్రగడ పద్మనాభం ముందు రెండు అవకాశాలు ఉన్నాయి. ఒకటి వైసిపి నుంచి వస్తున్న ఆఫర్లు అందుకోవడం. రెండు బిజెపి నుంచి ఇచ్చిన ఆఫర్ తీసుకోవడం. ఈ రెండింటి లో ఏది బెస్ట్ అన్నది అంతర్గతంగా ఆయన సన్నిహితులతో చర్చిస్తున్నారని అంటున్నారు. . మరోపక్క ఈ రెండు పార్టీల్లో ఎందులో చేరి పదవి చేపట్టినా కాపు రిజర్వేషన్ అంశం తాకట్టు పెట్టి లబ్ది పొందారనే విమర్శలను మూట గట్టుకుంటానేమో అన్న ఆందోళన ఆయన్ను వెంటాడుతుంది. టిడిపి పై మాత్రం కాపు ఉద్యమ సమయంలో రేగిన పగ ప్రతీకారాలు ఆయన లో ఇంకా చల్లారలేదు.
ఇప్పటికే గుడ్ బై …
ఇప్పటికే కాపు రిజర్వేషన్ల సాధన ఉద్యమం నుంచి తాను వ్యక్తిగత కారణాల రీత్యా తప్పుకుంటున్నా అంటూ ముద్రగడ పద్మనాభం చాలాకాలం క్రితమే ప్రకటించేశారు. అప్పటినుంచి క్రియాశీలకంగా ఏ కార్యక్రమాల్లో ఆయన పాలు పంచుకోవడం లేదు. దాంతో వివిధ పార్టీల అగ్రనేతలు ఆయన ఇంటికి వచ్చి వెళుతూ రహస్య చర్చలు జరుపుతూనే ఉన్నారు. అవన్ని విని ఆలోచించి చెబుతా అంటూ అన్ని అవకాశాలు తనవద్దే అట్టేపెట్టుకుని సమయం కోసం వేచిచూస్తున్నారు ముద్రగడ పద్మనాభం. మరోపక్క రాజకీయాలకు ఇక పూర్తిగా స్వస్తి చెప్పేయడం కూడా మంచిదనే యోచన కూడా పద్మనాభం చేస్తున్నారని అంటున్నారు. కొత్త తరం రాజకీయాలతో తన తరం ఇమడలేదని కూడా ఆయన ఆలోచన గా ఉందని తెలుస్తుంది. చూడాలి కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టాకా ముద్రగడ పద్మనాభం ఏదో ఒక నిర్ణయం కోసం అడుగు ముందుకు వేయక తప్పదు. అది ఏమై ఉంటుందా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.