ముద్రగడ అలా సెట్ అయ్యారన్న మాట
కోస్తాలో కాపు సామాజికవర్గానికి కులదైవంగా ఎదిగిన మాజీ మంత్రి కాపు రిజర్వేషన్ పోరాట సమితి నేత ముద్రగడ పద్మనాభం పూర్తిగా సైలెంట్ అయిపోయారు. టిడిపి సర్కార్ అధికారంలో [more]
;
కోస్తాలో కాపు సామాజికవర్గానికి కులదైవంగా ఎదిగిన మాజీ మంత్రి కాపు రిజర్వేషన్ పోరాట సమితి నేత ముద్రగడ పద్మనాభం పూర్తిగా సైలెంట్ అయిపోయారు. టిడిపి సర్కార్ అధికారంలో [more]
కోస్తాలో కాపు సామాజికవర్గానికి కులదైవంగా ఎదిగిన మాజీ మంత్రి కాపు రిజర్వేషన్ పోరాట సమితి నేత ముద్రగడ పద్మనాభం పూర్తిగా సైలెంట్ అయిపోయారు. టిడిపి సర్కార్ అధికారంలో ఉండగా కాపు రిజర్వేషన్ల కోసం ప్రాణాలకు తెగించి పోరాడారు ముద్రగడ పద్మనాభం. ఆయన ఉద్యమాలకు అత్యంత అనుభవజ్ఞుడు అయిన చంద్రబాబు సైతం ఉల్టా పల్టా అయ్యారు. ఈ దశలో కేంద్రం అగ్రవర్ణ పేదలకు కేటాయించిన 10 శాతం రిజర్వేషన్లలో కొంత కాపులకు కేటాయిస్తున్నట్లు ఎన్నికలముందు ప్రకటించి ఈ వివాదానికి తాత్కాలిక ముగింపు ఇచ్చి రాజకీయానికి తెరతీశారు ఆయన. దీనిపై ముద్రగడ పద్మనాభం పలు ప్రశ్నలు సంధించినా వాటికి పొలిటికల్ జవాబులు వచ్చాయి తప్ప మరొకటి లేకుండా పోయింది. కట్ చేస్తే జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చింది.
బాబు జిఓ ను కొట్టిపారేసిన జగన్ …
ఎన్నికల ముందు హడావిడిగా ఓట్ల కోసం చంద్రబాబు కాపు లకు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టిపారేసింది. తమ మ్యానిఫెస్టో లో ప్రకటించిన విధంగా కాపు కార్పొరేషన్ కి వరాలు ప్రకటించింది. కాపు రిజర్వేషన్ అంశం తమ పరిధిలోనిది కాదని అది కేంద్ర పరిధి లోనిది కనుక తాము చేసేది ఏమి లేదంటూ తేల్చేసింది. ఇదే అంశం ఎన్నికలముందు కూడా వైఎస్ జగన్ చెప్పడం అధికారంలోకి వచ్చాకా చెప్పిందే చేయడంతో కాపు రిజర్వేషన్ల అంశం అటకెక్కింది.
లోపాయికారీ ఒప్పందమా?
ఈ నేపథ్యంలో మరోసారి ముద్రగడ పద్మనాభం కొత్త ఉద్యమానికి శ్రీకారం చుడతారని ఆ సామాజికవర్గం భావించింది. కానీ ముద్రగడ పద్మనాభం ఎలాంటి ఉద్యమాలను మొదలు పెట్టలేదు. పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి కి లేఖలు రాశారు కానీ సీరియస్ గా తన అజెండా పై పోరాట వైఖరిని ఆయన అనుసరించకపోవడం నేటికీ చర్చనీయాంశం అయ్యింది. దీంతో ముద్రగడకు దారులన్నీ మూసుకుపోయి సైలెంట్ అయిపోయారా ? లేక వైసిపి తో లోపాయికారి అండర్ స్టాండింగ్ తో ఉన్నారా అన్నది కాలమే తేల్చనుంది.