Tdp : జగన్ వద్దన్నాడు.. టీడీపీలోనే సెట్ అయ్యాడు.. జనసేన?

వైసీపీలోకి రావాలనుకున్నారు. కానీ కుదరలేదు. జగన్ అంగీకరించలేదు. దీంతో ఆయన టీడీపీలోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నట్లుంది. 2014లో వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో 23 మంది టీడీపీలోకి వెళ్లిపోయారు. [more]

;

Update: 2021-10-19 05:00 GMT

వైసీపీలోకి రావాలనుకున్నారు. కానీ కుదరలేదు. జగన్ అంగీకరించలేదు. దీంతో ఆయన టీడీపీలోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నట్లుంది. 2014లో వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో 23 మంది టీడీపీలోకి వెళ్లిపోయారు. వారిలో కొందరికి చంద్రాబాబు 2019 ఎన్నికల్లో సీట్లు కూడా ఇవ్వలేదు. మరికొందరికి ఇచ్చారు. అందులో ముత్తముల అశోక్ రెడ్డి ఒకరు. గిద్దలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి వైసీపీ నేత అన్నా రాంబాబు చేతిలో ఓటమి పాలయ్యారు. అన్నా రాంబాబు టీడీపీ నుంచి ఎన్నికలకు ముందు వైసీపీలోకి వచ్చారు.

వైసీపీలో చేరేందుకు…..

అయితే 2019 ఎన్నికల తర్వాత ముత్తముల అశోక్ రెడ్డి తిరిగి వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో చర్చలు కూడా జరిపారు. కానీ తనను మధ్యలో వదిలేసి వెళ్లిపోయిన వారిని తిరిగి పార్టీలో చేర్చుకోలేదని జగన్ తెగేసి చెప్పినట్లు తెలిసింది. ఇతర పార్టీలో ఉన్న వారినైనా తీసుకుంటాం కాని, ఒకసారి మోసం చేసి వెళ్లిన వారిని తిరిగి తీసుకోమని జగన్ స్పష్టం చేసినట్లు సమాచారం.

బాబు కూడా….

ఈ సంగతి తెలుసుకున్న చంద్రబాబు గిద్దలూరు నియోజకవర్గం పార్టీ బాధ్యతలను వేరే వారికి అప్పగించాలని సిద్ధమయ్యారు. పిడతల సాయికల్పనా రెడ్డికి ఇవ్వాలని చంద్రబాబు భావించారు. కానీ ముత్తముల అశోక్ రెడ్డి వైసీపీ గేట్లు తెరుచుకోక పోవడంతో తిరిగి యాక్టివ్ అయ్యారు. టీడీపీలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తు ఉండే అవకాశం ఉండటంతో ఆయన టీడీపీ నుంచే వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగాలని డిసైడ్ అయ్యారు.

జనసేన పొత్తు ఉంటుందని…..

గిద్దలూరు నియోజకవర్గం 2009లో ప్రజా రాజ్యం పార్టీ గెలచింది. అప్పుడు అన్నా రాంబాబు గెలిచారు. దీంతో ఇప్పుడు ముత్తముల అశోక్ రెడ్డి తన సామాజికవర్గం ఓట్లతో పాటు ఇటు జనసేన ఓటింగ్ కలిస్తే సులువుగా విజయం సాధ్యమవుతుందని భావిస్తున్నారు. కానీ ఒకవేళ పొత్తు కుదిరితే గిద్దలూరు నియోజకవర్గాన్ని జనసేన కోరే అవకాశం లేకపోలేదు. ప్రకాశం జిల్లాలో కొద్దోగొప్పో బలం ఉన్న నియోజకవర్గం అదొక్కటే. అందుకే ముత్తముల అశోక్ రెడ్డి టీడీపీ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. మరి చివరకు ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News