బాలయ్యకు బిస్కట్ వేసిన నాగబాబు..?

బాలకృష్ణ ముక్కుసూటి మనిషి. తన బాక్ గ్రౌండ్ చెప్పుకుని తెగ గొప్పలు పోయే రకం కాదు అంటారు. ఆయన డౌన్ టు ఎర్త్ అంటారు సన్నిహితులు. బాలయ్యలో [more]

;

Update: 2020-09-23 02:00 GMT

బాలకృష్ణ ముక్కుసూటి మనిషి. తన బాక్ గ్రౌండ్ చెప్పుకుని తెగ గొప్పలు పోయే రకం కాదు అంటారు. ఆయన డౌన్ టు ఎర్త్ అంటారు సన్నిహితులు. బాలయ్యలో ఎన్నో సుగుణాలు ఉన్నాయి. ఏ పని అయినా ఆయన చాలా సైలెంట్ గా చేస్తారు. ఎక్కడా పబ్లిసిటీ చేసుకోరు. ఇక బాలయ్య తన సినిమాలూ తానేంటో అన్నట్లుగా ఉంటారు. ఆయన మీద మెగా ఫ్యామిలీలో ఎక్కువగా గొడవ పడి ట్వీట్లు వేసేది నాగబాబు మాత్రమే. ఆయన గత ఎన్నికల ముందు నుంచి కూడా బాలయ్యను టార్గెట్ చేస్తూ వచ్చారు. ఈ మధ్య కూడా అమరావతి భూముల గొడవను రేపి బాలయ్యను, టీడీపీని కలిపి విమర్శించారు. మరి ఇంతలా చేసిన నాగబాబు హఠాత్తుగా బాలయ్యతో తన తమ్ముడు హీరో పవన్ కళ్యాణ్ ఉన్న పాత‌ ఫోటో ఒకటి పెట్టి ట్వీటేయడం సర్వత్రా ఆశ్చర్యం కలిగించింది.

తెలియదు నుంచి అలా….

బాలకృష్ణ అంటే ఎవరు, పాత సినిమాల్లో హాస్యనటుడు అయితే నాకు తెలుసు అంటూ వెటకారం ఆడిన నాగబాబు తాజా ట్వీట్లో మాత్రం నందమూరి నటసింహం అంటూ మెచ్చుకున్నారు, నా మరో సోదరుడు అంటూ దగ్గర చేసుకున్నారు. మరి బాలయ్యని ఈ సమయంలో ఇంతలా పొగడాల్సిన అవసరం నాగబాబుకు ఏమి ఉంటుంది అన్నదే ఇపుడు చర్చ. అటు సినీ వర్గాల్లోనూ దీని మీద డిస్కషన్ ఉన్నా అక్కడ ఇవన్నీ మామూలే కాబట్టి వదిలేసినా రాజకీయంగా దీనికి ఏమైనా లింకులు ఉన్నాయా అన్న చర్చ మాత్రం వస్తోందిట‌.

అధికార ప్రతినిధిగా…..

నాగబాబు అన్నయ్య చిరంజీవి మెగాస్టార్, తమ్ముడు పవర్ స్టార్. నాగబాబు ఈ ఇద్దరికీ అనధికారి ప్రతినిధిగా వ్యవహరిస్తారు అంటారు. మెగాస్టార్ ఏ విషయం మీద హర్ట్ అయినా రెస్పాండ్ అయ్యేది నాగబాబు, అలాగే పవన్ విషయంలోనూ ముందుకు వచ్చేది మెగా బ్రదరే. అందువల్ల ఇపుడు తనకు తానుగా ఈ ట్వీటేసి బాలయ్యను నాగబాబు ఎందుకు దగ్గర చేసుకున్నారు అన్నది చూడాలంటే నేపధ్యాన్ని కూడా చూడాలి అంటున్నారు. ఇపుడు పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తులో ఉన్నారు. బీజేపీ ఓవైపు టీడీపీని టార్గెట్ చేస్తోంది. మరో వైపు హిందూత్వ అంటూ ఏపీలో మతం కార్డు తో చెలరేగుతోంది. ఇది ఒక విధంగా జనసేనకు ఇబ్బందిగానే ఉందని అంటున్నారు.

అవే సంకేతాలా …..

రాజకీయాల్లో భావస్వారూప్యం అన్న మాట ఒకటి వాడుతారు కానీ భావాలు ఎవరికీలేవు, ఉన్నవి రాజకీయాలే. ఇక బీజేపీతో పవన్ కి పొత్తు ఉంది. బీజేపీకి జగన్ మొదటి శత్రువు కాదు, అక్కడే భావాలు రెండు పార్టీలవీ భిన్నంగా ఉన్నాయట. అదే చంద్రబాబుతో పొత్తు ఉంటే ఇద్దరికీ ఒక్కరే శత్రువు. జగన్ ని అపుడు స్వేచ్చగా విమర్శించవచ్చు. పవన్ కి ఎందుకో గానీ జగన్ మీద విపరీతమైన ద్వేషం అని అంటారు వైసీపీ నేతలు. ఈ ద్వేషం బీజేపీ నుంచి విడివడి చంద్రబాబు వైపుగా పవన్ ని తీసుకువస్తుందా. దానికి ముందు సంకేతాలా అన్నట్లుగా బాబు గారి బావమరిది బాలయ్యకు నాగబాబు బిస్కట్లు వేస్తున్నారా అన్న చర్చ అయితే సాగుతోంది. ఇది రాజకీయం కాబట్టి ఏమైనా జరగవచ్చు. సో ఒక ట్వీట్ కూడా ఏపీ రాజకీయాలను మార్చేయగలదు అని అంతా అంటున్నారు.

Tags:    

Similar News