ఎందుకు ఓన్ చేసుకుంటున్నారో చెప్పరూ?
మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని రాష్ట్ర ప్రజలు ఎప్పుడో మరిచిపోయారు. ఆయన కూడా రాష్ట్రాన్ని మరిచిపోయినట్లే చెప్పుకోవాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చివరి ముఖ్యమంత్రిగా [more]
;
మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని రాష్ట్ర ప్రజలు ఎప్పుడో మరిచిపోయారు. ఆయన కూడా రాష్ట్రాన్ని మరిచిపోయినట్లే చెప్పుకోవాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చివరి ముఖ్యమంత్రిగా [more]
మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని రాష్ట్ర ప్రజలు ఎప్పుడో మరిచిపోయారు. ఆయన కూడా రాష్ట్రాన్ని మరిచిపోయినట్లే చెప్పుకోవాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చివరి ముఖ్యమంత్రిగా ఆయన రికార్డులకు ఎక్కారు తప్పించి రాష్ట్ర విభజనతో పూర్తిగా నష్టపోయిన నాయకుడు ఎవరంటే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అని చెప్పక తప్పదు. ఆయనకు ఇటీవల కాంగ్రెస్ కమిటీలో స్థానం కల్పించారు తప్పించి కీలక నేతగా కాంగ్రెస్ పార్టీ కూడా గుర్తించలేదు.
నవ్వులపాలయి… అవుట్ డేటెడ్ అయి…..
నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నిజానికి తెలంగాణకు విలన్. ఆంధ్రప్రదేశ్ కు హీరోగా చెప్పుకోవాలి. ఉమ్మడి ఆంధ్ర్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు ఏపీ ప్రజల్లో ఆయనకు ఒక స్థానం లభించింది. అయితే అది అప్పటివరకే రాష్ట్ర విభజన తర్వత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పూర్తిగా తెరమరగు అయ్యారు. సమైక్యాంధ్ర పార్టీని పెట్టి నవ్వుల పాలయ్యారు. బలంగా ఉన్న టీడీపీ, వైసీపీల ఎదుట ఏపీలో పూర్తిగా చాపచుట్టేయాల్సి వచ్చింది.
అందరూ మర్చిపోయిన తరుణంలో….
ఇక అందరూ మరిచిపోయిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గురించి ఇప్పుడు ఎందుకు చర్చించాల్సి వస్తుందంటే దానికి కారణం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. ఈ మధ్య చంద్రబాబు తరచూ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గురించి ప్రస్తావిస్తున్నారు. ఆయన పాలనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తన తర్వాత సమర్ధుడైన ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అని చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కన్నా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి భేషైన పాలన అందించారని చంద్రబాబు పదే పదే కితాబులివ్వడం పార్టీలోనూ చర్చనీయాంశమైంది.
బాబు పొగడ్తలతో……
ఈ మధ్య సీనియర్ నేతలతో తరచూ సమావేశమయినప్పుడు చంద్రబాబు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పాలనలో గట్టిగా ఉండేవారని చంద్రబాబు చెబుతుండటం విశేషం. మంచి అడ్మినిస్ట్రేటర్ అని పొగిడేస్తున్నారు. బీసీ రిజర్వేషన్ల అంశంలోగాని, అధికారులతో పనిచేయించడంలో గాని తన తర్వాత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాత్రమే నని చంద్రబాబు కీర్తిస్తుండటం పార్టీలో చర్చనీయాంశమయింది. ఒకప్పుడు తన శత్రువుగా ఉన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని చంద్రబాబు పొగడ్తలతో ముంచేయడం వెనక జగన్ ను వెనక్కు నెట్టడమేనని అంటున్నారు. రెడ్డి సామాజిక వర్గంలో కొంత గ్రిప్ ను తిరిగి సంపాదించుకోవడం కోసం చంద్రబాబు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపై బాబు ప్రశంసలు కురిపిస్తున్నారని అంటున్నారు. మొత్తం మీద టీడీపీలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి స్పెషల్ టాపిక్ గా ఈ మధ్యకాలంలో మారారు.