వివాదాలకు దూరంగా ఒకే ఒక్క వైసీపీ ఎమ్మెల్యే
పార్టీ అధికారంలో ఉంటే.. చాలు.. అంతా మనదే అంతా మనమే అనుకునే నాయకులు చాలా మంది ఉన్నారు. ఏం చేసినా ఎవరడుగుతారు? ఎవరికి మాత్రం మనం సమాధానం [more]
;
పార్టీ అధికారంలో ఉంటే.. చాలు.. అంతా మనదే అంతా మనమే అనుకునే నాయకులు చాలా మంది ఉన్నారు. ఏం చేసినా ఎవరడుగుతారు? ఎవరికి మాత్రం మనం సమాధానం [more]
పార్టీ అధికారంలో ఉంటే.. చాలు.. అంతా మనదే అంతా మనమే అనుకునే నాయకులు చాలా మంది ఉన్నారు. ఏం చేసినా ఎవరడుగుతారు? ఎవరికి మాత్రం మనం సమాధానం చెప్పాలి? అనుకునే వారు కూడా కోకొల్లలుగా ఉన్నారు. అందుకే.. వైసీపీ ఎమ్మెల్యేలు చాలా మందిపై అవినీతి ఆరోపణలు వున్నాయి. ముఖ్యంగా ఇసుక కుంభకోణం, గనుల కుంభకోణం.. అక్రమ వసూళ్లు.. ఇలా అనేక రూపాల్లో ఎమ్మెల్యేలపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ప్రతిపక్ష నేతలు.. ఆధారాలతో సహా నిరూపించిన ఘటనల్లో మంత్రులు కూడా ఉన్నారు. కారు లంచంగా తీసుకున్నారని.. ఓ అధికారి నుంచి ఇల్లు కట్టించుకున్నారని.. ఇలా పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రెండేళ్లవుతున్నా…?
అయితే.. వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి అయిన తర్వాత కూడా ఒకే ఒక్క ఎమ్మెల్యేపై ఇప్పటి వరకు అవినీతి, లంచాలు.. అనే మరకలు అంటకుండా.. ఉన్నాయని.. ఎమ్మెల్యేల్లో ఆయన బెస్ట్ అనే పేరు తెచ్చుకున్నారని అంటున్నారన్న చర్చలు రాజధాని ప్రాంతంలో వినిపిస్తున్నాయి. అధికారం చేతిలో ఉన్నప్పటికీ.. మిడిసిపడకుండా.. జాగ్రత్త గా ఉంటున్నారని.. చెబుతున్నారు. ఆయనే గుంటూరు జిల్లా పెదకూరపాడు ఎమ్మెల్యే, కమ్మ సామాజిక వర్గానికి చెందిన నంబూరు శంకర్రావు. గత ఎన్నికలకు ముందు ఇక్కడి బాధ్యతలు చేపట్టిన ఆయనకు జగన్ టికెట్ ఇచ్చారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన శంకర్రావు.. రాజకీయాల్లోకి వచ్చాక చాలా నిబద్ధతతో వ్యవహరిస్తున్నారనే పేరు తెచ్చుకున్నారు.
విపక్షాలు సయితం…
వాస్తవానికి పెదకూరపాడులో టీడీపీకి బలమైన నాయకుడు.. కొమ్మాలపాటి శ్రీధర్ ఉన్నారు. వరుస విజయాలు కూడా దక్కించుకున్నారు. కానీ, గత ఎన్నికల్లో నంబూరి శంకర్రావు ఆయనను ఓడించి.. వైసీపీ జెండా రెప రెపలాడించారు. రియల్ ఎస్టేట్ బిజినెస్ నుంచి రాజకీయాల్లోకి రావడంతో సహజంగానే ఆయన అక్రమాలకు పాల్పడతారని.. అవినీతిని పెంచి పోషిస్తారని.. ప్రతిపక్ష నేతలు తొలుత విమర్శలు గుప్పించారు. కానీ, ఈ రెండేళ్ల కాలంలో ఎంతమందిపైనో.. ఆరోపణలు వచ్చినా.. నంబూరి శంకర్రావుపై మాత్రం ఒక్కమాట కూడా ఆరోపణ వినిపించకపోవడం గమనార్హం.
అనుచరులకూ ఆదేశాలు….
నిజానికి గుంటూరు జిల్లాలో కృష్ణానది పక్కనే ప్రవహిస్తోంది. దీంతో ఇక్కడ ఇసుక అక్రమాలకు పాల్పడే అవకాశం ఉంది. అయినప్పటికీ.. తనకు ఎలాంటి పరిస్థితిలోనూ బ్యాడ్ నేమ్ రాకూడదనే సంకల్పంతో నంబూరి శంకర్రావు పనిచేస్తున్నారు. అదే సమయంలో తన అనుచరులను కూడా ఆయన కంట్రోల్‌లో పెడుతున్నా రు. ఎవరూ రూపాయి అవినీతి చేయరాదని.. తన పేరు చెడగొట్టరాదని.. ఆయన కొన్ని లక్ష్మణ రేఖలు గీశారు. వాటిని తాను అధిగమించకుండా.. తన వర్గం జవదాటకుండా చూస్తూ.. జగన్ దగ్గర మంచి మార్కులు సంపాదించుకుంటున్నారని.. పొలిటికల్ వర్గాల్లో చర్చ సాగుతోంది.
ఇప్పటి వరకూ అయితే..?
ఇప్పుడున్న పరిస్థితిలో ఇంత నిజాయితీగా వ్యవహరించే నాయకులు ఉండడం.. అక్రమాలకు పాల్పడకుండా.. అవినీతికి చేతులు చాపకుండా.. నిబద్ధతతో వ్యవహరించడం అంటే..రికార్డేనని పరిశీలకులు కూడా చెబుతున్నారు. నిజానికి గత ఎన్నికలకు ముందు.. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు వైసీపీ నాయకులు పోటీపడ్డారు.కానీ, జగన్ ఏరికోరి.. నంబూరి శంకర్రావుకు టికెట్ ఇచ్చారు. ఇప్పుడు ఆయన వర్గం.. మా నాయకుడు.. జగన్ పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుతున్నారని ఎక్కడా పార్టీకి, స్వతంత్రంగా ఆయనకు కూడా చెడ్డపేరు రాకుండా చూసుకుంటున్నారని అంటున్నారు. మొత్తానికి అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో నంబూరిశంకర్రావు ఇప్పటి వరకు అయితే క్లీన్ ఇమేజ్‌తోనే దూసుకు పోతున్నారు.