బాబు కళ్లకే గంతలు కడుతున్నారే?

టీడీపీలో చిత్రమైన మంత్రాంగం న‌డుస్తోంది. పిల్లి క‌ళ్లుమూసుకుని పాలు తాగిన చందంగా.. వ్యవ‌హ‌రిస్తున్నార‌ట టీడీపీ త‌మ్ముళ్లు. పార్టీని డెవ‌ల‌ెప్ చేయాల‌ని.. పార్టీలో అభివృద్ధిని చూసుకోవాల‌ని.. ముంద‌స్తుగా.. పార్టీని [more]

;

Update: 2021-01-04 09:30 GMT

టీడీపీలో చిత్రమైన మంత్రాంగం న‌డుస్తోంది. పిల్లి క‌ళ్లుమూసుకుని పాలు తాగిన చందంగా.. వ్యవ‌హ‌రిస్తున్నార‌ట టీడీపీ త‌మ్ముళ్లు. పార్టీని డెవ‌ల‌ెప్ చేయాల‌ని.. పార్టీలో అభివృద్ధిని చూసుకోవాల‌ని.. ముంద‌స్తుగా.. పార్టీని ఎన్నిక‌ల‌కు సిద్ధం చేయాల‌ని చంద్రబాబు త‌పిస్తున్నారు. ఈ క్రమంలోనే గ‌త ఏడాది ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌రిగిన లోటుపాట్లను స‌రిచేసుకుని ముందుకు సాగుతున్నారు. అంద‌రికీ.. అన్నీ! అనే కాన్సెప్ట్‌తో ప‌ద‌వులు పందేరం చేశారు. కొత్త పోస్టులు సృష్టించి మ‌రీ త‌మ్ముళ్లకు ఇచ్చారు. బీసీల‌కు ఎక్కువ‌గా ప్రాధాన్యం ఇచ్చారు. ఒక ర‌కంగా చెప్పాలంటే.. పార్టీని అభివృద్ది చేసేందుకు ఎంత చేయాలో పార్టీ అధినేత‌గా చంద్రబాబు అన్నీ చేస్తున్నారు.

మనసు పెట్టి….

మ‌రి త‌మ్ముళ్లు ఏం చేస్తున్నారు? చ‌ంద్రబాబు క‌నుస‌న్నల్లో ప‌నిచేస్తున్నారా? లేక‌.. బాబు క‌ళ్లకే గంత‌లు క‌డుతున్నారా? అంటే.. రెండోదే జ‌రుగుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎవ‌రూ కూడా మ‌న‌సు పెట్టి ప‌నిచేయ‌డం లేదు. ఎక్కడో గ‌న్ని వీరాంజ‌నేయులు, వేగేశ్న న‌రేంద్ర వ‌ర్మ, వెల‌గ‌పూడి రామ‌కృష్ణబాబు, ఏలూరి సాంబ‌శివ‌రావు వంటివారు మిన‌హా.. రాష్ట్ర వ్యాప్తంగా సీనియ‌ర్లు, మాజీ మంత్రులు, జూనియ‌ర్లు కూడా మ‌న‌సు పెట్టడం లేదు. పైకి మాత్రం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్టు క‌నిపిస్తున్నారు. కానీ, వ్యూహాత్మకంగా వ్యవ‌హ‌రిస్తున్నారు. చాలా జిల్లాల్లో పార్టీ నేత‌ల‌కు వ్యాపారాలు ఉన్నాయి. దీంతో ఎక్కడా ప్రభుత్వంపై తాడో పేడో తేల్చుకునే రేంజ్‌లో మాత్రం ప‌నిచేయ‌డం లేదు.

కీలక బాధ్యతలను అప్పగించినా….

క్షేత్రస్థాయిలో పార్టీ త‌ర‌పున పోరాటాలు చేసే టీడీపీ నేత‌ల‌ను ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో వేళ్ల మీద లెక్క పెట్టేయొచ్చు. ఇక‌, పార్టీ ప్రధాన కార్యద‌ర్శులు, అధికార ప్రతినిధులుగా ఉన్న వారికి చంద్రబాబు కీల‌క కాన్సెప్ట్ అప్పగించారు. పార్టీ త‌ర‌ఫున వాయిస్ వినిపించాల‌ని ఆదేశించారు. అంటే.. రోజూ మీడియాలో వీరి పేర్లు రావాలి. ఆదివారం, పండ‌గ అనే అంశాల‌ను ప‌క్కన‌పెట్టి మ‌రీ పార్టీ కోసం ప‌నిచేయాల‌ని చంద్రబాబు సూచించారు. అయితే.. వీరు కూడా అదే ప‌నిగా త‌ప్పించుకుంటున్నారు. ఇటీవ‌ల విజ‌య‌వాడ‌, విశాఖ‌, అనంత‌పురం జిల్లాల్లో జ‌రిగిన ఘ‌ట‌న‌లు వీరు ఎంత నాణ్యమైన సేవ‌లు అందిస్తున్నారో స్పష్టమ‌వుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఓ స్టేట్‌మెంట్‌ను ఆన్‌లైన్‌లో మీడియాకు ఇచ్చేసి చేతులు దులుపుకొంటున్నారు.

అటెండెన్స్ మాత్రం…..

కొన్ని చోట్ల కార్యక్రమాల‌కు హాజ‌రు కాకుండానే హాజ‌రైన‌ట్టు పేర్లు రాయించుకుంటున్నారు. మ‌రికొన్ని చోట్ల నిర్వహించ‌ని కార్యక్ర‌మాల‌కు కూడా నిర్వహించిన‌ట్టు క‌ల‌రింగ్ ఇస్తున్నారు. మొత్తంగా వీరు చంద్రబాబు ద‌గ్గర మాత్రం 'మేం ప‌నిచేస్తున్నాం సార్‌' అనే అటెండెన్సును మాత్రం వేయించుకుంటున్నారు. దీనివ‌ల్ల వారికి ఎలాంటి ప్రయోజ‌న‌మో తెలియ‌దు కానీ.. పార్టీ మాత్రం దెబ్బతిన‌డం ఖాయం అని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News