తేనె తుట్టెను కదిపారా…?
విపక్ష నేత వైఎస్ జగన్ తన పాదయాత్ర ప్రకటించిన హామీలను ఒక్కొటొక్కటిగా అమల్లో పెట్టేందుకు చంద్రబాబు కార్యాచరణ రూపొందించారు. బిసిల్లో కార్పొరేషన్ ల ఏర్పాటు ప్రకటన వరకు [more]
విపక్ష నేత వైఎస్ జగన్ తన పాదయాత్ర ప్రకటించిన హామీలను ఒక్కొటొక్కటిగా అమల్లో పెట్టేందుకు చంద్రబాబు కార్యాచరణ రూపొందించారు. బిసిల్లో కార్పొరేషన్ ల ఏర్పాటు ప్రకటన వరకు [more]
విపక్ష నేత వైఎస్ జగన్ తన పాదయాత్ర ప్రకటించిన హామీలను ఒక్కొటొక్కటిగా అమల్లో పెట్టేందుకు చంద్రబాబు కార్యాచరణ రూపొందించారు. బిసిల్లో కార్పొరేషన్ ల ఏర్పాటు ప్రకటన వరకు బానే వుంది. కులాల వారీగా తాయిలాలు అందించే ప్రక్రియకు వెనుకబడిన కులాల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే శెట్టిబలిజ గౌడ కార్పొరేషన్, చేనేత కార్పొరేషన్, వెలమ కార్పొరేషన్ ఇలా చంద్రబాబు అందరికి తలో కార్పొరేషన్ ఇస్తున్నట్లు ప్రకటించిన తరువాత అందులో వుండే ఉపకులాల నడుమ చర్చ మొదలైంది. తమ కులానికే విడిగా ఒక కార్పొరేషన్ ఇవ్వాలన్న డిమాండ్ ఇప్పుడు తెరమీదకు రావడం గమనార్హం.
ఉపకులాల నడుమ లేని సఖ్యత …
జనాభాలో 50 శాతానికి పైగా ఉన్నప్పటికీ సరైన రాజకీయ ప్రాతినిధ్యం కానీ, ఆర్ధిక పరపతి గాని వెనుకబడిన కులాలు అందుకోలేక పోతున్నాయి. దీనికి కారణం అనైక్యత అన్నది ఆ కులాల్లో వున్నవారే బాహాటంగా చెప్పుకొస్తారు. తాజాగా కూడా ఒక కులానికి మరో కులానికి సఖ్యత ప్రశ్నార్ధకం గా మారింది. శెట్టిబలిజ, గౌడ కార్పొరేషన్ కు సంబంధించి ఆ రెండు ఉపకులాల నడుమ ఆధిపత్య పోరు నడుస్తుంది. శెట్టిబలిజ కార్పొరేషన్ మాత్రమే ప్రకటించాలని గౌడలకు విడిగా కార్పొరేషన్ ఇవ్వండి అంటూ ఆందోళనలు మొదలయ్యాయి. అలాగే వెలమ సామాజిక వర్గం లో తూర్పు కోస్తా వెలమలు గోదావరి జిల్లాల వెలమల నడుమ అంతరం వుంది. కొప్పుల వెలమలు కు కార్పొరేషన్ ప్రకటించడంతో తమ పరిస్థితి ఏమిటని ఉత్తరాంధ్ర వెలమలు ప్రశ్నిస్తున్నారు. అలాగే చేనేత కులాలకు కార్పొరేషన్ కు సంబంధించి పద్మశాలీ, దేవాంగులు ప్రధానమైన వారు. వీరి నడుమ పంచాయితీ మొదలైంది.
వృత్తి పరంగా వద్దు …
ఇప్పుడు వృత్తిపరంగా కార్పొరేషన్ లు ఏర్పాటు చేయడం మరో సమస్య అని బిసి సంఘాలు అంటున్నాయి. చేనేత ఇప్పుడు పద్మశాలి, దేవాంగులే కాకుండా చాలా వెనుకబడిన వారు, ముస్లిం లు సైతం ఈ రంగంలో వున్నారని కనుక కులాల వారీగానే కార్పొరేషన్ లు దేనికి అదే ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన తెరమీదకు తెస్తున్నారు. దీంతో బాటు బడ్జెట్ కేటాయింపులు చేయడంతో బాటు చట్టబద్ధం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చట్టబద్ధం చేయకపోతే ఎన్నికల అనంతరం పాలకులు విస్మరిస్తారన్న ఆందోళన ఆయా కులాల్లో వ్యక్తం అవుతుంది. జనాభా ప్రాతిపదికన నిధులు సైతం కేటాయించాలని అలాగే రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతున్నారు. ఈ సమస్యలన్నీ ప్రభుత్వం కార్పొరేషన్ లు ఏర్పాటు చేస్తూ జీవో లు తెచ్చేలోగా సరిచేయాలన్నది బిసి సంఘాల డిమాండ్. ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేలోగా పంచాయితీలు తీర్చకపోతే ఓట్ల వర్షం రివర్స్ అయ్యే ప్రమాదం లేకపోలేదని తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారు.