చినబాబు పెత్తనాన్ని భరించలేకపోతున్న సీనియర్లు?
టీడీపీలో సీనియర్ నేతలకు పెద్ద చిక్కు వచ్చిపడింది. వారి వయసు, అనుభవం అంత లేని నారా లోకేష్ టీడీపీలో పెత్తనం చేస్తున్నారు. ఆయన తనకంటూ యూత్ టీమ్ [more]
టీడీపీలో సీనియర్ నేతలకు పెద్ద చిక్కు వచ్చిపడింది. వారి వయసు, అనుభవం అంత లేని నారా లోకేష్ టీడీపీలో పెత్తనం చేస్తున్నారు. ఆయన తనకంటూ యూత్ టీమ్ [more]
టీడీపీలో సీనియర్ నేతలకు పెద్ద చిక్కు వచ్చిపడింది. వారి వయసు, అనుభవం అంత లేని నారా లోకేష్ టీడీపీలో పెత్తనం చేస్తున్నారు. ఆయన తనకంటూ యూత్ టీమ్ ని ఏర్పాటు చేసుకుని సీనియర్లకు గట్టి ఝలక్ ఇస్తున్నారు. ఇది పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్న పెద్ద తలకాయలు అసలు భరించలేకపోతున్నారుట. అలాగని బయటకు ఏమీ అనలేని స్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఆయన చంద్రబాబు గారాల పుత్రరత్నం. ఏమైనా అంటే బాబు గారి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. దాంతో సీనియర్లు కక్కలేక మింగలేక అన్నట్లుగా టీడీపీలో ఉన్నారు.
అనుభవలేమితో…?
ఇదిలా ఉంటే నారా లోకేష్ కి రాజకీయ అనుభవలేమి చాలా ఉంది. దానికి తోడు ఆయన ఎవరి మాటా వినరు అని కూడా ప్రచారంలో ఉంది. సీనియర్లను చంద్రబాబు బాగా చూసుకుంటారు. వారి మాట ఎంతవరకూ వింటారో తెలియదు కానీ ఎవరైనా ఏమైనా చెబితే చాలా జాగ్రత్తగా ఆలకిస్తారు. అది సీనియర్లకు కూడా మంచిగా ఉంటుంది. ఇక చంద్రబాబు దగ్గరనే సీనియర్లకు చనువు ఎక్కువ. పైగా వయసు రిత్యా కూడా వారు బాబుతోనే ఎక్కువగా కంఫర్ట్ గా ఉన్నట్లుగా ఫీల్ అవుతారు.
బాధ్యతలన్నింటినీ…..
కానీ ఇపుడు చంద్రబాబే లోకేష్ కి కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఏ విషయం అయినా చినబాబుతోనే మాట్లాడమంటున్నారు. ఆ విధంగా తన తరువాత అతనేనని హింట్ ఇస్తున్నారు. దాంతో సీనియర్లు తెగ ఇబ్బంది పడిపోతున్నారట. లోకేష్ దగ్గరకు వెళ్లాలంటే అపాయింట్మెంట్లు ఇతర ప్రోటోకాల్ కూడా చాలా ఉందని అంటున్నారు. దాంతో వారు చంద్రబాబును కలసినంత ఈజీగా చినబాబుతో కలవలేకపోతున్నారు. ఈ పరిణామాలు టీడీపీలో నిశ్శబ్ద తుఫాన్ నే తలపిస్తున్నాయిట. సీనియర్లు తమ తరువాత కూడా వారసులు టీడీపీలో కొనసాగాలని కోరుకుంటున్నారు.
కోటరీని ఏర్పాటు చేసుకుని….
దానికి బాబు నుంచి అయితే భరోసా ఉంది. కానీ లోకేష్ పూర్తిగా పార్టీ మీద పట్టు సాధిస్తున్న క్రమంలో తమ ఆశలు నెరవేరుతాయా ? లేదా అన్నది వారికి నిద్రలేకుండా చేస్తోందిట. ఎందుకంటే లోకేష్ పార్టీలో సీనియర్లను కాదని.. తనకంటూ ఏర్పాటు చేసుకున్న కోటరీలోనే ఇరుక్కుపోవడం సీనియర్లకు రుచించడం లేదు. దీంతో లోకేష్ వల్ల టీడీపీకి ఎంత వరకూ లాభం అన్న చర్చ కూడా వస్తోంది. అటు సీనియర్లు దూరంగా జరిగి, ఇటు జూనియర్లలో కూడా పనికి వచ్చేవారు లేకపోతే టీడీపీకి రెండు వైపులా నుంచి నష్టం వాటిల్లుతుందని కూడా అంచనా వేస్తున్నారు. మొత్తానికి లోకేష్ తీరే వేరబ్బా అన్న చర్చ అయితే టీడీపీలో ఉంది.