లోకేష్ ని అలా వాడేసుకుంటున్నారా.. ?

చినబాబు అసలే తన రాజకీయం ఎంటో తెలియక నాన రకాలైన ప్రయోగాలు చేసుకుంటున్నారు. చంద్రబాబు కుమారుడు గా ఉన్న ట్యాగ్ ఆయనకు ఒక్కోసారి ఇబ్బంది పెడుతోంది. తండ్రి [more]

;

Update: 2021-09-18 12:30 GMT

చినబాబు అసలే తన రాజకీయం ఎంటో తెలియక నాన రకాలైన ప్రయోగాలు చేసుకుంటున్నారు. చంద్రబాబు కుమారుడు గా ఉన్న ట్యాగ్ ఆయనకు ఒక్కోసారి ఇబ్బంది పెడుతోంది. తండ్రి చాణక్యం తాత సమ్మోహనం వంటబట్టక నారా లోకేష్ కిందా మీద అవుతూంటే పార్టీలో ఉన్న నాయకులు కొందరు ఆయనను తెగ వాడేసుకుంటున్నారు అని అంటున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలలో కొందరు సీనియర్లకు నారా లోకేష్ బహు ఇష్టుడు అంటారు. విశాఖ జిల్లాలో చూసుకుంటే మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడికి లోకేష్ సన్నిహితుడని ప్రచారంలో ఉంది. ఇక బాగా సీనియర్ నేత, ఏపీ టీడీపీ పూర్వ అధ్యక్షుడు అయిన కళా వెంకట రావు కూడా నారా లోకేష్ పేరుని బాగానే వాడుకుంటున్నారు. ఆయనకు నారా లోకేష్ తో మంచి అనుబంధమే ఉందని చెబుతారు.

ఒక్క దెబ్బకు …?

శ్రీకాకుళం రాజకీయాలలో కింజరాపు ఫ్యామిలీకి ఎదురు నిలిచింది కళా కుటుంబం. ఎన్నిసార్లో ఆ ఫ్యామిలీ చేతిలో ఇబ్బందులు పడిన కళాకు నారా లోకేష్ రూపేణా మంచి హైప్ వచ్చింది. ఆయన ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ కావడం, చాలా కాలం ఆ పదవిలో కొనసాగడం వెనక నారా లోకేష్ అండ ఉందని అంటారు. ఇక లోకేష్ విషయానికి వస్తే అచ్చెన్నాయుడు కంటే కూడా కళా అంటేనే ఇష్టపడతారు అంటారు. అచ్చెన్నాయుడుకు ఈ పదవి ఇవ్వడం కూడా నారా లోకేష్ కి సమ్మతం కాదని కూడా అప్పట్లో పార్టీలో ప్రచారం సాగింది. ఇవన్నీ ఇలా ఉంటే లోకేష్ అండ తనకుందని చెప్పుకుంటూ సీనియర్ నేత కళా వెంకటరావు శ్రీకాకుళం పార్టీ రాజకీయాలలో మరో మారు ఒ చక్రం తిప్పాలని చూస్తున్నారని టాక్. ఇలా ఒక్క దెబ్బకు రెండు పిట్టలను కొట్టాలని కళా భారీ స్కెచ్ వేశారని చెబుతున్నారు.

ఆయన పేరు చెప్పి…?

శ్రీకాకుళం జిల్లాలో సీనియర్ మోస్ట్ లీడర్ అయిన కళా వెంకటరావుకు ఇపుడు పోటీ చేయడానికి ఎక్కడా సీటు లేదు. 2009లో జరిగిన అసెంబ్లీ సీట్ల పునర్విభజన వల్ల ఆయన సొంత సీటు ఉణుకూరు పూర్తిగా కనుమరుగు అయింది. దాంతో ఆయన ఎచ్చెర్లకు వలస వచ్చారు. అక్కడ నుంచి మూడు సార్లు పోటీ చేస్తే ఒకసారే విజయం దక్కింది. అది కూడా 2014 ఎన్నికల్లో అతి తక్కువ మెజారిటీతో గెలిచారు. 2019 అయితే భారీ తేడాతో ఓడారు. కళాను నాన్ లోకల్ అని తమ్ముళ్ళే పక్కన పెట్టేసారు. అయితే ఇపుడు కళా నారా లోకేష్ పేరు చెప్పి తాను తప్పకుండా పోటీ చేస్తానని క్యాడర్ ని దారిలోకి తెచ్చుకోవాలని చూస్తున్నారట. దీంతో వారు గట్టిగానే వ్యతిరేకిస్తున్నారు అంటున్నారు.

లోకేష్ నే దింపేసి…

ఇక ఈ సీనియర్ టీడీపీ తమ్ముడు ఆలోచనలు ఎలా ఉన్నాయి అంటే ఏకంగా నారా లోకేష్ నే ఎచ్చెర్ల నియోజకవర్గంలో పోటీలో దింపేస్తాను అంటున్నారు. తాను తలచుకుంటే నారా లోకేష్ ఎచ్చెర్ల నుంచి పోటీ చేస్తారు అని చెబుతున్నారు. ఒకవేళ లోకేష్ దానికి ఓకే అంటే తెర వెనక రాజకీయం అయినా చేయవచ్చు అన్నది కళా ఆలోచనగా ఉందిట. ఒకవేళ లోకేష్ కాదన్నా కూడా ఆయన ద్వారా చెప్పించుకుని తాను పోటీ చేయాలన్న ఆశట. మొత్తానికి ఇక్కడ కలిశెట్టి అప్పలనాయుడు అనే లోకల్ లీడర్ రంగంలో ఉన్నారు. ఆయన దూసుకుపోతున్నారు. దాంతో కళా రాజకీయం ముందుకు సాగడంలేదు. ఈ నేపధ్యంలో నారా లోకేష్ ప్రస్థావన తెస్తున్నారు అంటున్నారు. మొత్తానికి కళా రాజకీయం కాదు కానీ నారా లోకేష్ పేరు బదనాం అవుతోంది అంటున్నారు.

Tags:    

Similar News